Latest

Latest

Latest

Latest

Latest

Latest

Indian Post office Postman and Mail guard Recruitment 2022

Posted by eGURUm tv on Tuesday, August 16, 2022


నిరుద్యోగులకు కేంద్ర కొలువులు సాధించే అద్భుత అవకాశం! భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్‌ (India Post) దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 23 సర్కిళ్లకుగానూ ఖాళీల వివరాలను తెలియజేస్తూ షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం పోస్ట్‌ మ్యాన్‌ పోస్టులు 59,099, మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 1445, మల్టీ టాస్కింగ్‌ పోస్టులు 37,539 వరకు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భరీగా ఖాళీలున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీల వివరాలు..

• పోస్ట్‌ మ్యాన్‌ పోస్టులు 2289

• మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 108

• మల్టీ టాస్కింగ్‌ పోస్టులు 1166

తెలంగాణ సర్కిల్‌లో ఖాళీలు..

• పోస్ట్‌ మ్యాన్‌ పోస్టులు 1553

• మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 82

• మల్టీ టాస్కింగ్‌ పోస్టులు 878

పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నైపుణ్యాలు కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 32 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే ఖాళీల వివరాలను తెలుపు పోస్టల్ శాఖ షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానం వంటి ఇతర సమాచారం వివరణాత్మక అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.



Blog, Updated at: August 16, 2022

1 Comments: