Telangana TET 2022 Results announced

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. జూన్ 12న జరిగిన టెట్ ఎగ్జామ్ కు టెట్ పేపర్ 1కు 3,18,506 మంది, పేపర్ 2కు 2,51,070 మంది హాజరయ్యారు. పేపర్ 1లో 32.68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. పేపర్ 2లో 49.64 శాతం మంది పాస్‌ అయ్యారు. పేపర్ 1లో 1,04.078 మంది అభ్యర్థులు.. పేపర్ 2లో 1, 24,535 అభ్యర్థులు పాస్ అయ్యారు.

ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ అధికారులు చెప్పిన సమయం దాటిన వెబ్ సైట్ మాత్రం ఓపెన్ కాలేదు. తర్వాత ఓపెన్ అయ్యింది. దీంతో కాసేపు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. టెట్ ఫలితాల విడుదలలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫలితాలను విద్యాశాఖ ఒకే వెబ్ సైట్ కు లింక్ చేసిందని.... గతంలో రెండు లేదా మూడు వెబ్ సైట్ లో ఫలితాలు విడుదల చేసేవారని వారు ఆరోపిస్తున్నారు. టెట్ లో ఎంత మంది క్వాలిఫై అయ్యారో కనీసం మీడియాకి కూడా సమాచారం ఇవ్వలేదని అభ్యర్థులు విద్యా శాఖపై విమర్శలు చేశారు.

sample

Candidates may check all the important aspects of the CTET Exam 2022 in the below-mentioned table.

CTET 2022 Notification PDF
Exam Name CTET (Central Teacher Eligibility Test)
Conducting Body CBSE
Application Mode Online
CTET Exam Mode Online
Official Website https://ctet.nic.in/
CTET Notification 2022

2022-23 పాఠశాల విద్యా క్యాలెండర్

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం (2022-23) మొత్తం 230 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం విద్యా క్యాలెండర్ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రోజూ స్కూల్ అసెంబ్లీకి ముందు లేదా తర్వాత తరగతి గదిలో విద్యార్థులకు 5
నిమిషాలపాటు యోగా, ధ్యానం నిర్వహించాలని ఆదేశించారు. ఈసారి 1-8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ప్రతివారం 'కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ 'ఇంగ్లిష్' పేరిట ఒక పిరియడ్ను నిర్వహిస్తారు. ఇందులో ఆంగ్ల పత్రికలు చదివించడం, కథలు చెప్పడం, కథల పుస్తకాలు చదవడం, డ్రామా, చిన్న నాటికలు వేయడం వంటి కార్యక్రమాలను అమలుచేస్తారు. రోజూ విద్యార్ధుల హాజరు 90 శాతానికిపైగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. వచ్చే జనవరి 10 నాటికి అన్ని తరగతులకు సిలబస్ పూర్తి చేస్తారు. 2020-21 జాతీయస్థాయి ఇన్స్పైర్ పోటీలు జులై / ఆగస్టులో జరుగుతాయి. 2021-22 సంవత్సరానికి సెప్టెంబరు/అక్టోబరులో జిల్లా స్థాయి, నవంబరు/డిసెంబరులో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు.

పరీక్షల కాలపట్టిక ఇదీ...

• ఫార్మేటివ్ అసెస్మెంట్-1: జులై 21 నాటికి పూర్తి
• ఎఫ్ఎ 2: సెప్టెంబరు 5వ తేదీలోపు
• సమ్మేటివ్ అసెస్మెంట్-1: నవంబరు 1 నుంచి 7వ తేదీ వరకు
• ఎఫ్ఎ3: డిసెంబరు 21 నాటికి పూర్తి
• ఎఫ్ 4: పదో తరగతికి 2023 జనవరి 31 నాటికి, మిగిలిన వాటికి ఫిబ్రవరి 28 నాటికి
• ఎస్ఏ-2 : 2023 ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ వరకు (1-9 తరగతులకు) పదో తరగతికి ప్రీ ఫైనల్ పరీక్షలు: 2023 ఫిబ్రవరి 28కి ముందు పదో తరగతి చివరి పరీక్షలు: 2023 మార్చిలో
• చివరి పనిదినం: 2023 ఏప్రిల్ 24.
• వేసవి సెలవులు: ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు
• మళ్లీ పాఠశాలల పునఃప్రారంభం: 2023 జూన్ 12వ తేదీ నుంచి

పండుగ సెలవులు
• దసరా: సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు 14 రోజులు
• క్రిస్మస్ (మిషనరీ పాఠశాలలకు): డిసెంబరు 22 నుంచి 28 వరకు 7 రోజులు
• సంక్రాంతి సెలవులు: 2023 జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు 5 రోజులు

నెలవారీగా పనిదినాలు .
• జూన్-16 రోజులు,
• జులై-24, 
• ఆగస్టు-22,
• సెప్టెంబరు-20, 
• అక్టోబరు-18,
• నవంబరు-24,
• డిసెంబరు 25,
• 2023 జనవరి- 21, 
• ఫిబ్రవరి - 22, 
• మార్చి-23,
• ఏప్రిల్ 15


ప్రతి మూడో శనివారం 'నో బ్యాగ్ డే...
ప్రతి నెలా మూడో శనివారం 'నో బ్యాగ్ డే'గా పాటించాలని నిర్ణయించారు. ఆ రోజు బాలసభ నిర్వహించాలని సూచించారు. దీంతో విద్యార్థికి పుస్తకాల మోత తప్పడంతో పాటు ఆటవిడుపుగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్న విషయాన్ని విద్యాశాఖ ఆమోదించినట్లయింది. దీంతోపాటు ప్రతి శుక్రవారం మాక్ డ్రిల్ నాలుగో శనివారం హరిత హారం కార్యక్రమం నిర్వహించాలి.

TS SSC Results | తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌.. 90 శాతం ఉత్తీర్ణ‌త‌

TS SSC Results | తెలంగాణ పదో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ఉద‌యం 11:30 గంట‌ల‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. మొత్తంగా టెన్త్ ఫ‌లితాల్లో 90 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక ప్ర‌యివేటు విద్యార్థుల విష‌యానికి వ‌స్తే 819 మంది హాజ‌రు కాగా, 425 మంది పాస‌య్యారు. 51.89 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. పరీక్ష ఫలి‌తా‌లను https://bse.telangana.gov.in/అనే వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు.

 ఈ ఏడాది మే 23 నుంచి జూన్‌ 1 వరకు పది పరీ‌క్షలు నిర్వ‌హిం‌చారు. మొత్తం 5,08,143 రెగ్యు‌లర్‌ విద్యా‌ర్థు‌లకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీ‌క్షలు రాశారు. 167 మంది ప్ర‌యివేటు విద్యా‌ర్థు‌లకు 87 మంది పరీ‌క్ష‌లకు హాజ‌ర‌య్యారు. జూన్ 28 ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

Courses After Intermediate: ఇంటర్ తర్వాత చేయదగిన 113 బెస్ట్ కోర్సులు ఇవే


ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఏ కోర్స్ చేయాలి, ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలో తెలియక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. జీవితంలో ఏ రంగంలో రాణించాలి, ఏ జాబ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నామో ఆ దిశగా ప్రయత్నాలు చేసేది ఇంటర్ తర్వాతి నుంచే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి భవిష్యత్ కోసం ఇంటర్మీడియట్‌లోనే కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇంటర్ పూర్తయి ఏ కోర్సు చేయాలో సతమతమవుతున్న విద్యార్థులకు ఏ కోర్సు తీసుకుంటే బెటరో, వాటిపై అవగాహన పొంది తమకు తగిన కోర్సును ఎంచుకుంటే అద్భుత కెరీర్ సొంతమవుతుంది. ఇంటర్ పూర్తయ్యాక తీసుకోవాల్సిన 113 కోర్సులు ఏవో తెలుసుకుందాం.

1. ఏరోనాటికల్ ఇంజినీరింగ్

2. ఏరోస్పేస్ ఇంజనీరింగ్

3. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్

4. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్

5. ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్

6. ఆటోమొబైల్ ఇంజనీరింగ్

7. బయో మెడికల్ ఇంజనీరింగ్

8. బయో టెక్నాలజీ ఇంజనీరింగ్

9. సెరామిక్స్ ఇంజనీరింగ్

10. కెమికల్ ఇంజనీరింగ్

11. సివిల్ ఇంజనీరింగ్

12. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

13. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

14. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

15. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్

16. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్

17. ఇంస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్

18. మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్

19. మెరైన్ ఇంజనీరింగ్

20. మెకానికల్ ఇంజనీరింగ్

21. మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

22. మెటాలర్జీ

23. మెటరాలజీ

24. మైనింగ్ ఇంజనీరింగ్

25. నావల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్

26. ఫిజికల్ సైన్సెస్

27. పాలీమర్ ఇంజనీరింగ్

28. రోబోటిక్స్

29. టెక్స్‌టైల్ ఇంజనీరింగ్

30. అగ్రికల్చర్ సైన్స్

31. బయోలాజికల్ సైన్స్

32. బయోటెక్నాలజీ

33. కంప్యూటర్ అప్లికేషన్స్

34. కంప్యూటర్ సైన్స్

35. సైబర్ సెక్యూరిటీ

36. ఎర్త్ సైన్స్ / జాగ్రఫీ

37. ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్

38. ఫిషరీస్

39. ఫ్లోరికల్చర్/హార్టికల్చర్

40. ఫుడ్ టెక్నాలజీ

41. ఫారెస్ట్రీ

42. ఓషియనోగ్రఫీ

43. స్టాటిస్టికల్ సైన్స్

44. వెటర్నరీ సైన్సెస్

45. వైల్డ్ లైఫ్ బయాలజీ

46. జువాలజీ

47. ఆయుర్వేద బీఏఎంఎస్

48. డెంటల్ బీడీఎస్

49. హోమియోపతి

50. న్యాచురోపతి

51. ఫార్మసీ

52. సిద్ధ

53. యునానీ

54. ఆంత్రోపాలజీ

55. ఆర్కియాలజీ

56. ఆర్ట్ రిస్టోరేషన్

57. క్యూరేషన్

58. ఎడ్యుకేషనల్/వొకేషనల్ స్కూల్ కౌన్సిలర్

59. మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్‌ రిస్టోరేషన్

60. మ్యూసియాలజీ

61. ఫిజియోథెరపీ

62. రిహ్యాబిలిటేషన్ సైకాలజీ

63. రిహ్యాబిలిటేషన్ థెరపీ

64. సోషల్ వర్క్

65. స్పెషల్ ఎడ్యుకేటర్

66. స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్

67. లా

68. అడ్వర్టైజింగ్

69. జర్నలిజం

70. మాస్ కమ్యూనికేషన్

71. పబ్లిక్ రిలేషన్స్

72. ఆర్ట్ డైరెక్షన్

73. కొరియోగ్రఫీ

74. డైరెక్షన్

75. ఫిల్మ్/డ్రామా ప్రొడక్షన్

76. ఫైన్ ఆర్ట్స్

77. పర్ఫామింగ్ ఆర్ట్స్

78. వోకల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్

79. యానిమేషన్

80. సినిమాటోగ్రఫీ

81. కమ్యూనికేషన్ డిజైన్

82. డిజైన్

83. గ్రాఫిక్ డిజైనింగ్

84. ఫోటోగ్రఫీ

85. యాక్చురియల్ సైన్సెస్

86. బ్యాంక్ మేనేజ్‌మెంట్

87. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్

88. బిజినెస్ మేనేజ్‌మెంట్

89. కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంట్స్

90. చార్టర్డ్ అకౌంటెన్సీ

91. చార్టర్డ్ ఫైనాన్షియల్ అనాలిసిస్

92. ఈవెంట్ మేనేజ్‌మెంట్

93. హాస్పిటల్ మేనేజ్‌మెంట్

94. హోటల్ మేనేజ్‌మెంట్

95. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్

96. ఇన్స్యూరెన్స్

97. లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్

98. మేనేజ్‌మెంట్

99. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్

100. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్

101. కార్పొరేట్ ఇంటెలిజెన్స్

102. డిటెక్టీవ్

103. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రీషియన్

104. ఫారిన్ లాంగ్వేజెస్

105. హోమ్ సైన్స్

106. ఇంటీరియర్ డిజైనింగ్

107. లిబరల్ స్టడీస్

108. లైబ్రసీ సైన్సెస్

109. మాంటెస్సరీ టీచింగ్

110. న్యూట్రీషియన్ అండ్ డైటెటిక్స్

111. ఫిజికల్ ఎడ్యుకేషన్

112. స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్

113. టూరిజం అండ్ ట్రావెల్స్

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం రూపొందించిన బుక్‌లెట్‌లో సీబీఎస్ఈ ప్రధానంగా వివరించిన 113 కోర్సులు ఇవి. ఇవే కాకుండా అనేక రంగాల్లో అనేక కోర్సులు ఉన్నాయి. అయితే విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా కోర్సుల్ని ఎంచుకుంటే కెరీర్ బాగుంటుంది.

E-Filing చేసుకొనుటకు సూచనలు


*Financial Year (FY) 2021-22 అనగా* *Assessment Year (AY) 2022-23(1.4.21 to 31.3.22) సంవత్సరానికి సంబంధించిన Income Tax Return E Filing ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యింది.* 
*అయితే మన DDO లు TDS పూర్తి చేసిన తర్వాతనే మనం E Filing చేసుకొవలసి ఉంటుంది.*

*ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ కోసం గత సంవత్సరం జూన్ 7 నుంచి ప్రారంభమైన కొత్త సైట్ ప్రారంభమైంది. వాస్తవానికి మనం ఈ ఫైలింగ్ ప్రతీ సంవత్సరం జులై 31 లోగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పరిస్ధితులను బట్టి ప్రభుత్వం ఈ గడువు పెంచవచ్చు.*

గమనించవలసిన ముఖ్యవిషయం ఏమంటే ఇన్కమ్ టాక్స్ రిటర్న్ (ఈ - ఫైలింగ్) అనేది *ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేయాల్సిందే. 2,50,000 పైబడి ఆదాయం* కలిగిన వారందరూ *ఇన్కమ్ టాక్స్ పడనప్పటికీ* తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి.

*75 సంవత్సరాల సూపర్ సీనియర్ సిటిజన్స్ వారి ఆదాయం 5 లక్షల లోపు అయితే ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం నుండి మినహాయింప బడ్డారు.*

*ఇన్కమ్ టాక్స్ కడితేనే ఈ ఫైలింగ్ చేయాలి లేకపోతే అక్కరలేదు అనుకోవడం పొరపాటు. టేక్స్ తో సంభంధంలేకుండా రెండున్నర లక్షల వార్షికాదాయం దాటిన వారంతా ఈ ఫైలింగ్ చేయాలి.కారణం ఏదైనా ఎవరేని ఈ-ఫైలింగ్ చేయని వారికి రెండు మూడు సంవత్సరాల తరువాత కూడా ఐ టీ డిపార్టుమెంటు నుండి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది.*

*ఇన్కమ్ టాక్స్ సైట్ లో మనం ఈ ఫైలింగ్ ఎలా చేయాలో పరిశీలించుదాం.*

www.incometax.gov.in.

*సైట్ లో ఇన్కమ్ టాక్స్ రిటరన్స్ ఈ ఫైలింగ్ ద్వారా సబ్మిట్ చేయాలి. వ్యక్తులు, వ్యాపార సంస్థలు ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి, రిఫండ్ కోరడానికి, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ సైట్ ఉపయోగపడుతుంది.*

*ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ కు పాన్ నెంబర్ గానీ ఆధార్ నెంబరు గానీ యూజర్ ఐడి గా ఉపయోగించాలి. పాస్వర్డ్ సహాయంతో మనం ఈ ఫైలింగ్ పేజీలో ప్రవేశించ గలుగుతాం.*

*పాస్ వర్డ్ మరచిపోయిన సందర్భంలో forget పాస్ వర్డు ఆప్షన్ ద్వారా ఇ మెయిల్, ఫోన్ నెంబరు సహాయంతో దిగ్విజయంగా ఈ ఫైలింగ్ సైట్ లోకి ప్రవేశించవచ్చు.*

*ఐటీ రిటర్న్స్ ఈ ఫైలింగ్ చేయడానికి మనం ముందుగా గమనించాల్సినవి.*

*1.పాన్ మరియు ఆధార్ లింక్ అయి ఉండాలి.*

*2. ఆధార్ మన మొబైల్ నెంబర్ కు లింక్ చేయబడి ఉండాలి.*

*3. మన బ్యాంకు ఖాతా కు మొబైల్ నెంబర్ లింక్ చేయబడి ఉండాలి.*

*(గమనిక- ఈ మూడు అంశాలు లో ఏది లేకపోయినా ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయలేము.)*

*4. మన జీతం/ పెన్షన్ వివరాలతో డి డి ఓ ఇచ్చిన ఫారం16 / పెన్షనర్లు ఫిబ్రవరి పేస్లిప్ దగ్గర ఉంచుకోవాలి.*

*(గమనిక -టేక్స్ పే చేసిన పెన్షనర్లకు సంబంధిత ట్రెజరీలలో Form 16 ఏప్రియల్ నెలనుండి ఇస్తారు .టేక్స్ పడని పెన్షనర్లు పిబ్రవరి పేస్లిప్ లో ఉన్న Form 16 వివరాలతో ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు.)*

*5. లింక్ అయిన మొబైల్ దగ్గర ఉండాలి.*

*ప్రస్తుతం I T ఈ ఫైలింగ్ పేజీలో పాన్, ఆధార్ లింక్ అవ్వడం ద్వారా మన వివరాలు ఉంటాయి.వాటిని ఎడిట్ చేసుకోవడానికి, అప్డేట్ చేయడానికి అవకాశం ఉంది. మన ఫోటో కూడా ఆధార్ సైట్ నుండి కానీ నేరుగా గాని ఇక్కడ అప్డేట్ చేయవచ్చు.*

*New users అయితే మనం individual tax payer దగ్గర క్లిక్ చేసి 1. బేసిక్ డీటెయిల్స్ లో పాన్ నెంబర్, నేమ్, డేట్ అఫ్ బర్త్, జెండర్, రెసిడెన్షియల్ స్టేటస్ ఫిల్ చేయడంకానీ ఉన్న వివరాలను అప్డేట్ చేయడం గానీ ఎడిట్ ఆప్షన్ ద్వారా చేసుకొనే అవకాశం ఉంది.*

*2. కాంటాక్ట్ డీటెయిల్స్ లో సెల్ నెంబర్, అడ్రస్ వివరాలు పూర్తి చేయాలి. మన మొబైల్ ఓటీపీ ద్వారా వాలిడేట్ చేయాలి.*

*3. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయాలి..*

*గతంనుండి ఐటి ఫైల్ చేస్తున్న ఎక్సిస్టింగ్ యూసర్స్ వివరాలు ప్రీఫిల్ చేసి ఉంటాయి ..* *సరిచూసుకోవడం అవసరమైతే ఎడిట్ చేయడం చేయవచ్చు.*

*మనం ఇపుడు ఐటి రిటరన్ ఫిల్ చేయడం గురించి చూద్దాం!!*

*లాగిన్ అయి అసెసెమెంట్ ఇయర్ ఎంటర్ చేసి Online filling ఆప్షన్ ఎంపిక చేసి Status లో individual సెలక్ట్ చేసి మనకు వర్తించే ఐ టి ఆర్ ఫారం సెలక్ట్ చేయాలి. మనం ITR 1 ఎంచుకోవాలి.*

*ఇక్కడ మనం 3 steps follow కావాల్సి ఉంటుంది.*
*1 Validate Your returns*
*2.Conform your return summery*
*3.Verify and submit your return అనేవి.*

*1. Validate your return లో 5 అంశాలు ఉంటాయి.*
*1. Personal information*
*2.Gross total Income*
*3.Total deductions*
*4 Taxes paid*
*5. Total Tax Liability లను ఒకటి పూర్తి చేసిన తరువాత మరొకటి క్లిక్ చేసి ఓపన్ చేసి ఫిల్ చేసుకోవాలి.*
*Personal information దగ్గర ఒక ముఖ్యమైన విషయం....*
*Are you opting for New Regime U/s 115BAC?*   
*Old regime పద్దతి ద్వారా 1,50,000వరకూ సేవింగ్స్ , గృహఋణాలు ఉన్నవారు No పై క్లిక్ చేయడం వల్ల ఉపయోగం. ఏవిధమైన సేవింగ్స్ లేని 5లక్షల పై బడి ఆదాయం ఉన్నవారు New regime ఎంచుకుంటే Yes క్లిక్ చేసిముందుకు వెళ్ళాలి.*

*Bank details లో మన పేరున ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలవివరాలు అప్డేట్ చేసినప్పటికి ఏదో ఒక ఖాతాను టేక్స్ రిఫండ్ కోసం సెలక్ట్ చేసుకోవలసి ఉంటుంది. ఈ ఖాతాకు ఆధార్, పాన్, ఫోన్ లింక్ అయిఉండాలి.*

*2.Gross total Income దగ్గర ఇవ్వబడ్డ మనసేవింగ్స్ అన్నింటి పై సెక్షన్ల వారీగా Yes or No జవాబులతో ఫిల్ చేసిన తరువాత మన ఆదాయానికి, డిడక్షన్స్ కు సంబందించిన వివరాల పేజీ ఓపన్ అవుతుంది. అక్కడ ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలను అంకెలరూపంలో నింపి సేవ్ చేయాలి.కన్పర్మ్ చేయాలి.*
*ఇక్కడ మన అకౌంట్ కు బ్యాంకు చెల్లించిన వడ్డీ ని కూడా చూపవలసి ఉంటుంది. మన ఆధార్ తో లింక్ అయ్యి, వివిధ బ్యాంకులలో మనకి ఏవేని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లయితె వాటికి బ్యాంకు చెల్లించె వడ్డీలకు సదరు బ్యాంకు IT ని cut చేసిందీ, లేనిదీ ధృవీకరించుకోవలసి యుంటుంది.*

*3.Total deductions మనం సేవ్ చేసిన మొత్తం ఏఏ సెక్షన్లలో ఎంత అనే అంశాలను ఇక్కడ Yes or No ద్వారా చూపి కంటీన్యూ చేసి ఓపన్ అయిన విండోలో ఎడిట్ ఆప్షన్ ద్వారా అంకెల రూపంలో నింపాలి.*

*4 Taxes paid మనం కట్టిన టేక్స్ వివరాలు ఇక్కడ సంబందిత కాలమ్ లో నింపాలి. కన్ఫర్మ్ చేయాలి. మనం ఇప్పటికే టేక్స్ కన్నా అదనంగా ఐటి కి చెల్లించి ఉంటే ఫారం16 ప్రకారం రిఫండ్ కోసం ఇక్కడ చూపుతాం.*

*5. Total Tax Liability పై క్లిక్ చేసి మనం ఇప్పటి వరకూ నింపిన వివరాలన్నింటిని సరిచూసుకొని కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి.*

*మనం అదనంగా కట్టిన మొత్తం ఉంటె రిఫండ్ క్లైమ్ చేయాలి.*

*ఇపుడు మన టేక్స్ రిటరన్ అన్నివివరాలు కనిపిస్తాయి వాటి ప్రివ్యూ పై క్లిక్ చేయండి . ఓపన్ అయిన విండోలో వివరాలను సరిచూసుకొని ... Proceed to Validation - ఆపై Proceed to Verifcation కు వెళ్ళండి.(ఈ వివరాలన్నింటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు.) ఆధార్ వెరిఫికేషన్ ద్వారా మీ మొబైల్ ఓటిపి ద్వారా వెరిఫికేషన్ ఆప్షన్ ఎంచుకొండి. తరువాత వచ్చే Acknowledgement Print తీసుకొండి.*

*వివిధ కారణాల రీత్యా మొబైల్ OTP రాని పక్షంలో వెరిఫికెషన్ పూర్తికావడానికి అకనాలెడ్జ్ మెంట్ ను అకనాలెడ్జ్ మెంట్ లో సూచించబడిన బెంగళూరు అడ్రస్ కు పోస్ట్ చేయవలసియుంటుంది.*

*Income Tax ఈ ఫైలింగ్ -కొన్ని ప్రశ్నలు-జవాబులు.*

*నా సంవత్సరాదాయంపై ఆదాయపుపన్ను లేదు ఐటి రిటరన్స్ దాఖలు చేయాలా? చేయకపోతే ఏమిటి?*

*ట్రెజరీ వారు నా ఆదాయంలో కొంత పన్నుగా డిటక్ట్ చేసుకొన్నారు నేను ఐటి రిటరన్స్ ఇవ్వడం అవసరమా?* 

*ఇటువంటి మన అనుమానాలకు ఆదాయపు పన్ను శాఖ వారిచ్చిన జవాబులు ఓ సారి పరిశీలించండి.*
 
*ప్రశ్న: రిటర్న్ దాఖలు చేయనందుకు జరిమానా ఏమిటి?*

*జవాబు: గడువు తర్వాత దాఖలు చేసిన రిటర్న్‌లు(ఇ ఫిల్లింగ్), పెనాల్టీ పరిమితి రూ.5,000కి పెంచబడింది. అయితే, చిన్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనంగా, మీ మొత్తం ఆదాయం రూ. 5 లక్షలకు మించకపోతే, ఆలస్యమైతే గరిష్టంగా రూ. 1000 జరిమానా మాత్రమే ఉంటుందని ఐటీ శాఖ పేర్కొంది.*

*ప్రశ్న: నా ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉన్నట్లయితే నేను పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాలా?*
*జవాబు: పన్ను చెల్లించదగిన ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉంటే మీరు పన్నులు చెల్లించనవసరం లేనప్పటికీ, మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయాలి. మీరు ITR ఫైల్ చేయడంలో విఫలమైతే, మీరు ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసును పొందవచ్చు*

*ప్రశ్న: ట్రెజరీ వారు నా ఆదాయంలో కొంత పన్నుగా డిటక్ట్ చేసుకొన్నారు నేను ఐటి రిటరన్స్ ఇవ్వడం అవసరమా?*

*జవాబు: ఆదాయం నుండి ఆదాయపు పన్ను డిడక్ట్ చేయబడిన వారు ఖచ్చితంగా ఐటి రిటరన్స్ సబ్మిట్ చేయాలి*

 *ప్రశ్న: ఎవరు ఐటీఆర్‌‌ను ఫైల్ చేయాలి?*

*జవాబు: సాధారణంగా ఒక ఫైనాన్షియల్ ఇయర్‌‌లో రూ. 2.5 లక్షలు కంటే ఎక్కువ ఇన్‌కమ్ సంపాదిస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలి. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌‌లో వ్యక్తి సంపాదించిన ఇన్‌కమ్‌ (గ్రాస్‌) బేసిక్ మినహాయింపును మించితే, ఆ వ్యక్తి ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్ చేయాల్సిందే.* 

 *ప్రశ్న: కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ ఎంచుకుంటే హౌస్‌‌ రెంట్‌‌ అలవెన్స్‌‌ (హెచ్‌‌ఆర్‌ఏ), లీవ్‌‌ ట్రావెల్ అలవెన్స్‌‌ వంటి కామన్‌‌ ట్యాక్స్ మినహాయింపులను క్లయిమ్ చేసుకోవచ్చా ?* 

 *జవాబు: వీలు లేదు.* 

 *ప్రశ్న పాత ట్యాక్స్‌ సిస్టమ్‌ను ఎంచుకుంటామనుకుంటే బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపు ఎంత?* 
 *జవాబు: బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపు ఏజ్‌ను బట్టి మారుతుంది. బేసిక్ ఎక్జంప్సన్ 60 ఏళ్లలోపు వాళ్లయితే, సంపాదించిన ఆదాయంలో రూ. 2.5 లక్షలు, 60–80 ఏళ్లు మధ్య ఉన్న వారి (సీనియర్ సిటిజన్స్‌) ఇన్‌కమ్‌ రూ. 3 లక్షలు , 80 ఏళ్ల పైన ఉంటే (సూపర్‌‌ సిటిజన్స్‌) రూ. 5 లక్షలుగా ఉంది.* 

 *ప్రశ్నఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఐటీఆర్‌‌ ఎవరు ఫైల్ చేయాలి?.* 

*జవాబు: కింద పేర్కొన్న కేటగిరీలు వారు తప్పని సరిగా ఐటిఆర్ ఫైల్ చేయాలి*

*1)ఫారిన్ కంట్రీకి ట్రావెల్ చేయడానికి తన కోసమైన లేదా ఇతరుల కోసమైన ఒక ఫైనాన్షియల్ ఇయర్‌‌లో రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినవాళ్లు.*

*2)ఒక అకౌంట్ లేదా వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ. కోటి కంటే ఎక్కువ డిపాజిట్ చేసినవారు.*

*3)ఫైనాన్షియల్‌ ఇయర్‌‌లో ఒకే ఎలక్ట్రిసిటీ బిల్లులో రూ. లక్ష చెల్లించిన వారు.*

*4)విదేశాల నుంచి ఆదాయం వస్తున్న వారు. విదేశాల్లో ఆస్తులు ఉన్నవారు.*

*5)క్యాపిటల్‌ గెయిన్స్‌పై ఇన్‌కమ్‌ ట్యాక్స్ చట్టంలోని కొన్ని మినహాయింపులను క్లయిమ్ చేసుకోకముందే, వ్యక్తి గ్రాస్ ఇన్‌కమ్‌ బేసిక్‌ మినహాయింపును దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాలి.*

*6) ఫైనాన్షియల్ ఇయర్‌‌లో వ్యక్తి యొక్క ఆదాయం బేసిక్ మినహాయింపును దాటకపోయినా, ట్యాక్స్ కట్‌ అయితే రీఫండ్ కోసం ఐటీఆర్‌‌ ను ఫైల్ చేయాలి.*

*ఎవరు ఐటీఆర్‌‌ను ఫైల్ చేయాలి? సాధారణంగా ఒక ఫైనాన్షియల్ ఇయర్‌‌లో రూ. 2.5 లక్షలు కంటే ఎక్కువ ఇన్‌కమ్ సంపాదిస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలి.*
*ఒక ఫైనాన్షియల్ ఇయర్‌‌లో వ్యక్తి సంపాదించిన ఇన్‌కమ్‌ (గ్రాస్‌) బేసిక్ మినహాయింపును మించితే, ఆ వ్యక్తి ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్ చేయాల్సిందే. బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపు వ్యక్తి ఎంచుకున్న ట్యాక్స్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇండివిడ్యువల్‌ కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ను ఎంచుకుంటే ఆమె లేదా అతని బేసిక్ ఇన్‌కమ్‌ మినహాయింపు రూ. 2.5 లక్షలు. పాత ట్యాక్స్ సిస్టమ్‌లో అయితే బేసిక్ ఇన్‌కమ్‌ మినహాయింపు ఏజ్‌ను బట్టి మారుతుంది. కానీ, కొత్త ట్యాక్స్ సిస్టమ్‌లో ఏజ్‌ను బట్టి మినహాయింపు ఇవ్వడాన్ని తొలగించారు.*

*కొత్త సిస్టమ్‌లో సీనియర్ సిటిజన్లకు అదనంగా బేసిక్‌ ఇన్‌కమ్ మినహాయింపును ఇవ్వడం లేదు. కానీ, పాత ట్యాక్స్ సిస్టమ్‌తో పోలిస్తే కొత్త సిస్టమ్‌లో ట్యాక్స్ రేట్లను తగ్గించారు. మరోవైపు ట్యాక్స్ డిడక్షన్లను తొలగించారు. అంటే ఒక వ్యక్తి హెల్త్ ఇన్సూరెన్స్‌ కోసం ప్రీమియం కింద రూ. 20 వేలు కడితే, ఆ వాల్యూని ఇన్‌కమ్‌ నుంచి కట్‌ చేసుకొని మిగిలిన అమౌంట్‌పై ట్యాక్స్ లెక్కించొచ్చు. కొత్త సిస్టమ్‌లో ఈ ఫెసిలిటీ లేదు.*

*కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ ఎంచుకుంటే హౌస్‌‌ రెంట్‌‌ అలవెన్స్‌‌ (హెచ్‌‌ఆర్‌ఏ), లీవ్‌‌ ట్రావెల్ అలవెన్స్‌‌ వంటి కామన్‌‌ ట్యాక్స్ మినహాయింపులను క్లయిమ్ చేసుకోవడానికి ఉండదు. అదేవిధంగా సెక్షన్‌‌ 80 సీ, 80డీ, 80టీటీఏ కింద డిడక్షన్లు కూడా అందుబాటులో ఉండవు. ఎన్‌‌పీఎస్‌‌ (నేషనల్ పెన్షన్‌‌ స్కీమ్‌‌) అకౌంట్ కోసం ఎంప్లాయర్‌ చేసే కంట్రిబ్యూషన్‌‌పై మాత్రమే (సెక్షన్‌‌ 80సీసీడీ(2)) ట్యాక్స్ డిడక్షన్ అందుబాటులో ఉంటుంది.*

*పాత ట్యాక్స్‌ సిస్టమ్‌ను ఎంచుకుంటామనుకుంటే బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపు ఏజ్‌ను బట్టి మారుతుంది. అంటే 60 ఏళ్లలోపు ఏజ్‌ ఉన్నవాళ్లయితే, ఒక ఫైనాన్షియల్ ఇయర్‌‌లో సంపాదించిన ఆదాయం రూ. 2.5 లక్షలు దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. అదే 60–80 ఏళ్లు మధ్య ఉన్న వారి (సీనియర్ సిటిజన్స్‌) ఇన్‌కమ్‌ రూ. 3 లక్షల పైన ఉంటే ఐటీఆర్‌‌ ఫైల్ చేయాలి. 80 ఏళ్ల పైన ఉంటే (సూపర్‌‌ సిటిజన్స్‌) రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వస్తే ఐటీఆర్ ఫైల్ చేయాలి.*

*👉ఐటీఆర్‌‌ ఫైల్ చేయడానికి..*

*కొన్ని సార్లు వ్యక్తి ఆదాయం బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపును దాటకపోయినా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం, కింద పేర్కొన్న కేటగిరీలు ఐటీఆర్‌‌ ఫైల్ చేయాలి.*

*1) ఫారిన్ కంట్రీకి ట్రావెల్ చేయడానికి తన కోసమైన లేదా ఇతరుల కోసమైన ఒక ఫైనాన్షియల్ ఇయర్‌‌లో రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినవాళ్లు.*

*2)ఒక అకౌంట్ లేదా వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ. కోటి కంటే ఎక్కువ డిపాజిట్ చేసినవారు.*

*3)ఫైనాన్షియల్‌ ఇయర్‌‌లో ఒకే ఎలక్ట్రిసిటీ బిల్లులో రూ. లక్ష చెల్లించిన వారు.*

*4)విదేశాల నుంచి ఆదాయం వస్తున్న వారు. విదేశాల్లో ఆస్తులు ఉన్నవారు.*

*5)క్యాపిటల్‌ గెయిన్స్‌పై ఇన్‌కమ్‌ ట్యాక్స్ చట్టంలోని కొన్ని మినహాయింపులను క్లయిమ్ చేసుకోకముందే, వ్యక్తి గ్రాస్ ఇన్‌కమ్‌ బేసిక్‌ మినహాయింపును దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాలి.*

*6) ఫైనాన్షియల్ ఇయర్‌‌లో వ్యక్తి యొక్క ఆదాయం బేసిక్ మినహాయింపును దాటకపోయినా, ట్యాక్స్ కట్‌ అయితే రీఫండ్ కోసం ఐటీఆర్‌‌ ను ఫైల్ చేయాలి.*

34 ఏళ్ల తర్వాత కొత్త విద్యా విధానం

నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో విద్యా విధానంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. విద్యార్థులపై కరికులమ్ భారం తగ్గించాలనేది కొత్త విధానం ఎంచుకున్న ప్రధాన లక్ష్యం. 34 ఏళ్ల తర్వాత ప్రభుత్వం కొత్త విద్యా విధానం తీసుకొచ్చింది. పాఠశాల-కళాశాల వ్యవస్థలో పెద్ద మార్పులు చేసింది. డిప్లొమా కోర్సు కాల వ్యవధి రెండేళ్లుగా, వృత్తి విద్యా కోర్సుకు ఏడాదిగా నిర్ణయించింది. ఒక విద్యార్థి ఒక కోర్సు మధ్యలో మరొక కోర్సు తీసుకోవడానికి కొత్త విద్యా విధానంలో అవకాశం ఇచ్చారు. అయిదో తరగతి వరకు విద్యార్థులందరూ మాతృభాషలోనే విద్యను అభ్యసించాలి.
జాతీయ విద్యా విధానం 2020 కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌

2030 నాటికి పాఠశాల విద్యలో 100% జిఇఆర్ తో ప్రీ-స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు విద్యను సార్వజ‌నీనం చేయడం నూత‌న‌ విధానం లక్ష్యం

ఎన్‌.ఇ.పి2020, పాఠ‌శాల వెలుప‌ల ఉన్న 2 కోట్ల మందిని తిరిగి ప్ర‌ధాన స్ర‌వంతిలోకి తీసుకురావడం.

6 వ‌ త‌ర‌గ‌తి నుంచే ఇంట‌ర్న్‌ షిప్‌తో కూడిన వృత్తి విద్య‌

క‌నీసం 5 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మాతృభాష లేదా ప్రాంతీయ భాష‌లో బోధ‌న‌

ఉన్న‌త విద్యా వ్య‌వ‌స్థ‌లో జిఇఆర్‌ ను 2035 నాటికి 50 శాతానికి పెంపు,

ఉన్నత విద్య‌లో 3.5 కోట్ల సీట్ల అద‌న‌పు సీట్ల జోడింపు

దేశంలో బ‌ల‌మైన ప‌రిశోధ‌న సంస్కృతికి నేష‌న‌ల్ రిసెర్చ్ ఫౌండేష‌న్  ఏర్పాటు

15 సంవ‌త్స‌రాల‌లో అఫిలియేష‌న్ వ్య‌వ‌స్థ తొల‌గింపు, క‌ళాశాల‌ల‌కు గ్రేడెడ్ అటాన‌మీ

నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ టెక్నాల‌జీ ఫోర‌మ్‌ ఏర్పాటు.

నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఫ‌ర్ పాళి, ప‌ర్షియ‌న్‌, పాక్రృతి , ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌ లేష‌న్‌,ఇంట‌ర్‌ప్రిటేష‌న్ ఏర్పాటు.

ఇది 21వ శ‌తాబ్ద‌పు తొలి విద్యా విధానం. 34 సంవత్స‌రాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంది. అందుబాటులో విద్య‌, అంద‌రికీ విద్య‌, నాణ్య‌మైన విద్య‌, అందుబాటులో విద్య, జవాబుదారిత్వం వంటి ప్ర‌ధాన అంశాల‌పై ఇది రూపుదిద్దుకుంది. ఇది 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల‌కు అనుగుణంగా  ఉంది. పాఠ‌శాల‌, క‌ళాశాల విద్య‌ను స‌మ‌గ్ర‌మైన‌దిగా తీర్చిదిద్ద‌డం, కొత్త శ‌తాబ్ద‌పు అవ‌స‌రాల‌కు అనువైన‌దిగా తీర్చిదిద్ద‌డం, ప్ర‌తి విద్యార్ధిలోని ప్ర‌త్యేక సామ‌ర్ధ్యాల‌ను వెలికితీయ‌డం  ద్వారా ఇండియాను ఒక శ‌క్తివంత‌మైన జ్ఞాన‌ స‌మాజంగా, ప్ర‌పంచ విజ్ఞాన మ‌హాశ‌క్తిగా మార్చాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రీ స్కూలు నుంచి సెకండ‌రీ స్థాయి వ‌ర‌కు అన్ని స్థాయిల‌లోనూ పాఠ‌శాల విద్య‌ను సార్వ‌త్రికంగా అందుబాటులో ఉంచేందుకు కట్టుబ‌డి ఉంది. వినూత్న విద్యా కేంద్రాలు, మౌలిక‌ స‌దుపాయాల మ‌ద్ద‌తుతో మ‌ధ్య‌లోనే బ‌డి మానేసిన వారు తిరిగి ప్ర‌ధాన స్ర‌వంతిలోకి రానున్నారు. బ‌డి వెలుప‌ల ఉన్న సుమారు 2 కోట్ల మందిని తిరిగి విద్యారంగ ప్ర‌ధాన స్ర‌వంతిలోకి తీసుకురానున్న‌ది.
పూర్వ ప్రాథ‌మిక విద్య‌పై దృష్టిపెడుతూ 10+2 విద్య స్థానంలో 5+3+3+4 సంవ‌త్స‌రాల విద్య‌ను తీసుకురానున్నారు. ఇవి 3-8, 8-11, 11-14, 14-18 సంవ‌త్స‌రాల విద్యార్ధులు దీని ప‌రిధిలోకి వ‌స్తారు. ఇక ముందు 3-6 సంవ‌త్స‌రాల వ‌యసు‌గ‌ల వారు పాఠ‌శాల విద్యా ప్ర‌ణాళిక కిందికి వ‌స్తారు. అంత‌ర్జాతీయంగా ఇది కీల‌క‌మైన , పిల్ల‌ల మాన‌సిక వికాసానికి అనువైన ద‌శ అని గుర్తించ‌డం జ‌రిగింది.

కొత్త విధానంలోమూడు సంవ‌త్స‌రాలు అంగ‌న్ వాడీ లేదా ప్రీ స్కూల్‌తో మొత్తం 12 సంవ‌త్స‌రాల పాఠ‌శాల విద్య ఉంటుంది.
పాఠ‌శాల స్థాయి పాఠ్యాంశాలు, అభ్య‌సించేవారి స‌మ‌గ్ర వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక అంశాల‌ను నేర్చుకునేందుకు పాఠ్యాంశాల‌ను త‌గ్గిస్తారు.  ప్ర‌యోగాత్మ‌క అభ్యాసానికి వీలు క‌ల్పించి దానిపై దృష్టిపెడ‌తారు.

స‌బ్జెక్టుల ఎంపిక‌లో విద్యార్ధుల‌కు స్వేచ్చ ఉంటుంది. ఆర్ట్స్‌, సైన్సు మ‌ధ్య క‌ఠిన విభ‌జ‌న ఏదీ ఉంద‌డు. వృత్తి విద్య‌ను  6వ గ్రేడ్ నుంచే  ఇంట‌ర్న్‌ షిప్‌ తో పాటుగా ప్రారంభిస్తారు.
కొత్త స‌మ‌గ్ర‌మైన నేష‌న‌ల్ క‌రికుల‌మ్‌ ఫ్రేమ్ వ‌ర్క్ ఫ‌ర్ స్కూల్ ఎడ్యుకేష‌న్‌- NCFSE 2020-21ని  ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి అభివృద్ధి చేయ‌నుంది.
భాష శ‌క్తి:
మాతృభాష‌, స్థానిక భాష‌, ప్రాంతీయభాష‌ను బోధ‌న మాధ్యమంగా  క‌నీసం 5 వ గ్రేడ్ వ‌ర‌కు ఉంచాల‌ని, గ్రేడ్  8  ఆ పై వ‌రకూ కొనసాగించనుంది.

సంస్కృతాన్ని పాఠ‌శాల‌లోని అన్ని స్థాయిల‌లో విద్యార్థులు ఐచ్ఛికంగా  మూడు భాష‌ల విధానంలో భాగంగా ఎంచుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. భార‌త‌దేశంలోని ఇత‌ర ప్రాచీన భాష‌లు, సాహిత్యం కూడా విద్యార్థులు  ఎంపిక చేసుకోవ‌డానికి వీలుండాల‌ని ఈ నూత‌న విధానం స్ప‌ష్టం చేసింది.

6-8 గ్రేడ్ ల మ‌ధ్య ‘ఏక్ భార‌త్ శ్రేష్ఠ్ భార‌త్’ కార్య‌క్ర‌మం కింద ప‌లు విదేశీభాష‌లు సెకండ‌రీ విద్యాస్థాయిలో ఆఫ‌ర్ చేయ‌డం జ‌రుగుతుంది.
భార‌తీయ సంజ్ఙా భాష‌ల‌ను  దేశ‌వ్యాప్తంగా ప్రామాణీక‌రిస్తారు. వినికిడి లోపమున్న‌ విద్యార్ధుల‌కు దేశ‌, రాష్ట్ర‌స్థాయి పాఠ్య‌ప్ర‌ణాళిక‌ను అభివృద్ధి చేస్తారు. పుట్టుక‌వల్ల కానీ త‌న నేప‌థ్యం వ‌ల్ల కానీ ఏ విద్యార్థీ నేర్చుకోవ‌డానికీ, రాణించ‌డానికి అవ‌కాశం కోల్పోరాద‌న్న‌ది కొత్త విద్యా విధానం లక్ష్యం.

వెనుక‌బ‌డిన ప్రాంతాలు, గ్రూపుల‌‌కు స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌ జోన్‌ లు జెండ‌ర్ ఇంక్లూజ‌న్ ఫండ్ ను ఏర్పాటు చేయ‌నున్నారు. దివ్యాంగులైన పిల్ల‌లు రెగ్యుల‌ర్ పాఠ‌శాల ప్ర‌క్రియ‌లో ఫౌండేష‌న్ స్థాయినుంచి ఉన్న‌త విద్య‌ వ‌ర‌కు పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు వీలు క‌ల్పిస్తారు. ఇందుకు బోధ‌కుల మ‌ద్ద‌తు, రిసోర్సు సెంట‌ర్లు, త‌గిన వ‌స‌తి, స‌హాయ‌క ఉప‌క‌ర‌ణాలు, త‌గిన సాంకేతిక ప‌రిజ్ఞానంతోకూడిన  ఉప‌క‌ర‌ణాలు ఇలా వారి అవ‌స‌రాల‌కు త‌గినట్టు ఏర్పాట్లు చేస్తారు. ప్ర‌తి రాష్ట్రం, జిల్లా బాల‌భ‌వ‌న్‌ లు ఏర్పాటుచేసేందుకు ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతుంది. ఇవి ప‌గ‌టిపూట బోర్డింగ్ స్కూళ్లుగా ఉంటాయి. క‌ళ‌లు, ఆట‌లు వంటివి నేర్ప‌డానికి వీటిని వినియోగిస్తారు. పాఠ‌శాల అనంత‌రం ఈ స‌దుపాయాల‌ను సామాజిక చేత‌న కేంద్రాలుగా వాడుకోవ‌చ్చు.
పార‌దర్శ‌క విధానంలో ఉపాధ్యాయ‌ రిక్రూట్ మెంట్‌:
ఉపాధ్యాయ నియామ‌కాల‌ను ప‌టిష్ట‌మైన‌, పార‌ద‌ర్శ‌క ప్ర‌క్రియ ద్వారా చేప‌డ‌తారు. ప్ర‌మోష‌న్లు మెరిట్ ఆధారితంగా ఉంటాయి.  ఎప్ప‌టిక‌ప్ప‌డు వారి ప‌నితీరును అంచ‌నావేసే బ‌హుళ మార్గ స‌మాచార సేక‌ర‌ణ ద్వారా దీనిని చేప‌డ‌తారు.  ఉపాధ్యాయుల‌కు ఉమ్మ‌డి జాతీయ వృత్తి  ప్ర‌మాణాల‌ను (ఎన్‌.పి.ఎస్‌టి) నేష‌న‌ల్ కౌన్సిల్‌ ఫ‌ర్‌ టీచ‌ర్ ఎడ్యుకేష‌న్ -ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి, ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి,. ఉపాధ్యాయులు,  వివిధ ప్రాంతాలు వివిధ స్థాయిల‌లోని నిపుణుల సంస్థ‌ల‌తో సంప్ర‌దించి 2022 నాటికి అభివృద్ధి చేస్తుంది.

పాఠ‌శాల‌ల‌ను కాంప్లెక్సులుగా లేదా క్ల‌స్ట‌ర్లుగా ఏర్పాటుచేసి, దానిని పాఠ‌శాల పాల‌న‌కు మౌలిక యూనిట్‌గా ప‌రిగ‌ణిస్తారు. దీనికి మౌలిక స‌దుపాయాలు, విద్యాప‌ర‌మైన లైబ్ర‌రీలు, బ‌ల‌మైన టీచ‌ర్ల వ్య‌వ‌స్థ క‌ల్పిస్తారు.
పాఠ‌శాల విద్య‌కు ప్ర‌మాణాలు:
విద్యా సంబంధ‌, నిర్వ‌హ‌ణా ప‌ర‌మైన‌, నియంత్ర‌ణ ప‌ర‌మైన‌, విధాన‌ నిర్ణ‌యాల‌కు సంబంధించి స్ప‌ష్ట‌మైన ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ ఉండాల‌ని సంక‌ల్సిస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి క‌లిగిన రాష్ట్ర పాఠ‌శాల ప్ర‌మాణాల అథారిటీ (ఎస్‌.ఎస్‌.ఎస్‌.ఎ)ని ఏర్పాటు చేసుకుంటాయి. ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి పాఠ‌శాల నాణ్య‌తా అంచ‌నా , అక్రిడిటేష‌న్ ఫ్రేమ్ వ‌ర్క్ (ఎస్‌.క్యు.ఎఎ.ఎఫ్‌)ను సంబంధిత భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో క‌ల‌సి చ‌ర్చించి అభివృద్ధి చేస్తుంది.
2035 నాటికి  50 శాతానికి జిఇఆర్:
ఉన్న‌త విద్య‌లో దేశంలో స్థూల ఎన్‌రోల్‌మెంట్ నిష్ప‌త్తి (జిఇఆర్‌)ని  26.3 శాతం (2018) నుంచి 2035 నాటికి 50 శాతానికి చేర్చాల‌ని జాతీయ విద్యా విధానం 2020 ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకుంది. ఉన్నత విద్యా సంస్థ‌ల‌కు 3.5 కోట్ల సీట్ల‌ను జ‌త చేయ‌నున్నారు.
మ‌ల్టీ డిసిప్లిన‌రీ ఎడ్యుకేష‌న్ రిసెర్చ్ యూనివ‌ర్సిటీలు (ఎం.ఇ.ఆర్‌.యు)ల‌ను ఐఐటిలు, ఐఐఎం ల‌తో సమానంగా ఏర్పాటు చేయ‌నున్నారు. దేశంలో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో  అత్యుత్త‌మ మ‌‌ల్టీ డిసిప్లిన‌రీ  విద్య‌కు న‌మూనాగా వీటిని ఏర్పాటు  చేయ‌నున్నారు. నేష‌న‌ల్ రిసెర్చ్ ఫౌండేష‌న్‌ ను ఉన్న‌త‌స్థాయి సంస్థ‌గా ఏర్పాటు చేయ‌నున్నారు.  ఉన్నత విద్యా వ్య‌వ‌స్థ‌లో ప‌రిశోధ‌న సామ‌ర్ధ్యాన్ని, ప‌రిశోధ‌న సంస్కృతిని పెంచ‌డానికి దీనిని ఏర్పాటు చేస్తారు.
నియంత్ర‌ణ‌:
మొత్తం ఉన్న‌త విద్యా వ్య‌వ‌స్థ‌కు హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (హెచ్ఇసిఐ) ని ఏర్పాటు చేయ‌నున్నారు. వైద్య విద్య‌, న్యాయ విద్య మాత్రం దీనినుంచి మిన‌హాయింపు. హెచ్‌.ఇ.సి.ఐ కి నాలుగు స్వ‌తంత్ర విభాగాలు ఉంటాయి. అవి నేష‌న‌ల్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ రెగ్యులేట‌రీ కౌన్సిల్ (ఎన్‌.హెచ్‌.ఇ.ఆర్‌.సి) అనేది రెగ్యులేష‌న్ కోసం, ప్ర‌మాణాలను నిర్దేశించ‌డం కొసం  జ‌న‌ర‌ల్  ఎడ్యుకేష‌న్ కౌన్సిల్ (జిఇసి),  ఫండింగ్ కు హయ్య‌ర్ ఎడ్యుకేష‌న్ గ్రాంట్స్ కౌన్సిల్ (హెచ్‌.ఇ.జి.సి), అక్రిడిటేష‌న్‌కు నేష‌న‌ల్ అక్రిడిటేష‌న్ కౌన్సిల్ (ఎన్‌.ఎ.సి) ఏర్పాటు అవుతాయి. రెగ్యులేష‌న్‌, అక్రిడిటేష‌న్, అక‌డ‌మిక్ ప్ర‌మాణాల‌కు సంబంధించి ప‌బ్లిక్‌, ప్రైవేట్ ఉన్న‌త విద్యా సంస్థ‌ల‌న్నింటికీ ఒకే ర‌క‌మైన నిబంధ‌న‌లు వ‌ర్తింప‌చేస్తారు.
కళాశాలల అనుబంధాన్ని 15 సంవత్సరాలలో దశలవారీగా తొలగించాల‌ని,  కళాశాలలకు గ్రేడెడ్ స్వయంప్రతిపత్తిని ఇవ్వడానికి దశల వారీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఈ జాతీయ విద్యా విధానం 2020 పేర్కొంది. కొంత‌కాలానికి ప్ర‌తి కాలేజీ ఒక స్వ‌తంత్ర డిగ్రీలు మంజూరుచేసే కాలేజీగా లేదా యూనివ‌ర్సిటీ భాగ‌స్వామ్య క‌ళాశాల‌గా త‌యారయ్యేట్టు చూస్తారు.
ఉపాధ్యాయ విద్య‌:
ఉపాధ్యాయ విద్య‌కు సంబంధించి, స‌మ‌గ్ర‌మైన నూత‌న జాతీయ క‌రికుల‌మ్ ఫ్రేమ్ వ‌ర్క్ ఫ‌ర్ టీచ‌ర్ ఎడ్యుకేష‌న్ , ఎన్‌.సి.ఎఫ్‌.టి.ఇ 2021 ని ఎన్‌సిటిఇ రూపొందించ‌నుంది. ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి తో సంప్ర‌దించి దీనిని రూపొందిస్తుంది. 2030 నాటికి బోధ‌న‌కు క‌నీస డిగ్రీ అర్హ‌త‌, నాలుగు సంవ‌త్స‌రాల బిఇడి డిగ్రీ కానున్న‌ది.  నాసిర‌కం  ఉపాధ్యాయ విద్యా సంస్థ‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారు.
ప్ర‌తిభ గ‌ల ఎస్‌.సి., ఎస్‌.టి, ఒబిసి ఇత‌ర ఎస్ఇడిజి విద్యార్దుల‌కు ప్రోత్సాహ‌కం అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటారు. నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్ పోర్ట‌ల్ ను విస్త‌రింప‌చేసి స్కాల‌ర్‌షిప్ పొందిన విద్యార్ధుల ప్ర‌గ‌తిని గ‌మ‌నిస్తారు. ప్రైవేటు ఉన్న‌త విద్యాసంస్థ‌లు వీలైన‌న్ని ఎక్కువ ఫ్రీషిప్‌, స్కాల‌ర్‌ షిప్‌ ల‌ను త‌మ విద్యార్థుల‌కు అందించేందుకు ప్రోత్స‌హించనున్నారు.
 ఆన్‌లైన్‌, డిజిట‌ల్ ఎడ్యుకేష‌న్‌:
ఇటీవ‌లి మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ప్ర‌త్యామ్నాయ నాణ్య‌మైన విద్యా విధానాల‌ను అనుస‌రించేందుకు వీలుగా ఆన్‌ లైన్ విద్య‌ను ప్రోత్స‌హించేందుకు స‌మ‌గ్ర సిఫార్సుల‌ను పొందుప‌రిచారు. డిజిట‌ల్ మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు, డిజిట‌ల్ కంటెంట్‌, సామ‌ర్ధ్యాల నిర్మాణానికి ఎం.హెచ్‌.ఆర్‌.డి లో ఒక ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది పాఠశాల‌, ఉన్న‌త‌విద్య స్థాయిలో ఈ – విద్య అవ‌స‌రాల‌ను తీర్చ‌నుంది.
ఆర్ధిక వ‌న‌రులు:
కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉమ్మ‌డిగా విద్యారంగంలొ ప‌బ్లిక్ ఇన్వెస్ట్‌ మెంట్‌ను వీలైనంత త్వ‌ర‌గా జిడిపి లో ఆరు శాతానికి చేర్చేందుకు  కృషి చేస్తాయి.
పెద్ద ఎత్తున సంప్ర‌దింపులు:
జాతీయ విద్యా విధానం 2020, మున్నెన్న‌డూ లేనంత రీతిలో పెద్ద ఎత్తున సంప్ర‌దింపుల ద్వారా రూపుదిద్దుకున్న‌ది. 2.5 ల‌క్ష‌ల గ్రామ పంచాయ‌తీలు, 6600 బ్లాకుల‌, 6000 ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌లు, 676 జిల్లాల నుంచి 2 ల‌క్ష‌ల‌కు పైగా సూచ‌న‌లు వ‌చ్చాయి.  2015 జ‌న‌వ‌రి నుంచి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ మున్నెన్న‌డూ లేనంత‌గా స‌మ‌గ్ర , ఉన్న‌త‌స్థాయి సంప్ర‌దింపుల‌ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టింది.

2016 మే నెల‌లో మాజీ కేంద్ర కేబినెట్ కార్య‌ద‌ర్శి, దివంగ‌త శ్రీ టి.ఎస్‌.ఆర్ సుబ్ర‌మ‌ణియ‌న్ నేతృత్వంలో,  క‌మిటీ ఫ‌ర్ ఎవ‌ల్యూష‌న్ ఆప్ ద న్యూ ఎడ్యుకేష‌న్ పాల‌సీ త‌న నివేదిక‌ను స‌మ‌ర్పించింది. దాని ఆధారంగా మంత్రిత్వశాఖ ముసాయిదా జాతీయ విద్యావిధానం- 2016 కొన్నిఅంశాలను రూపొందించింది.

2017 జూన్‌లో, ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త ప‌ద్మ‌విభూష‌ణ్ డాక్ట‌ర్ కె. క‌స్తూరి రంగ‌న్ నేతృత్వంలో క‌మిటీ ఫ‌ర్ ద డ్రాప్ట్ నేష‌న‌ల్ ఎడ్యుకేష‌నల్ పాల‌సీ ని ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీ ముసాయిదా జాతీయ విద్యా విధానం 2019ని కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ది శాఖ మంత్రికి 2019 మే 31న అంద‌జేసింది. ఈ ముసాయిదా జాతీయ విద్యా విధానం 2019 ను ఎం.హెచ్‌.ఆర్‌.డి వెబ్‌సైట్‌ లో, మై గ‌వ్ ఇన్నొవేట్ పోర్ట‌ల్ లో అప్‌ లోడ్ చేసి ప్ర‌జ‌లు భాగ‌స్వామ్య ప‌క్షాలు నిపుణుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు, వ్యాఖ్య‌ల‌ను ఆహ్వానించింది.
***

ఉద్యోగుల సందేహాలు - సమాధానాలు


1. సందేహం:
*నేను సంక్రాంతి సెలవులు అనంతరం సెలవు పెట్టాలని అనుకొనుచున్నాను. సెలవు పెట్టవచ్చా?*

సమాధానం:
*సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇస్తున్నారు. మీరు 1 రోజు సెలవు పెడితే మొత్తం సెలవులు 11 రోజులు అవుతాయి. కాబట్టి CL ఇవ్వటం కుదరదు. మీరు గనక సెలవు పెడితే మొత్తం సెలవులకు eligible leave పెట్టుకోవలసి ఉంటుంది.*


2. సందేహం:
*ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి?*

సమాధానం:
*మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.*


3. సందేహం:
*ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు. ఆ కాలానికి ELs ఎలా ఇవ్వాలి.?*

సమాధానం:
*Aplr 1933 లోని రూల్ 4 ప్రకారం ELs ను డ్యూటీ పీరియడ్ పై మాత్రమే లెక్కించాలి. ఏ విధమైన ఆకస్మికేతర సెలవు కూడా డ్యూటీ గా పరిగణించబడదు. కనుక 3 ELs జమ చేయకూడదు.*


4. సందేహం:
*ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.*

సమాధానం:
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్ ఎయిడ్, ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.*


5. సందేహం:
*ఫిబ్రవరి 29న విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి ఇవ్వాలి?*

సమాధానం:
*మార్చి1 నుండి ఇవ్వాలి. AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్ సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.*

జులై లో టీచర్లు.. బదిలీలు, పదోన్నతులు

*జులై లో టీచర్లు.. బదిలీలు, పదోన్నతులు*

*ఈ నెలాఖరులో షెడ్యూల్‌ విడుదల.. కొన్ని పోస్టులకే గ్రీన్‌ సిగ్నల్‌*

*కోర్టు కేసులు తేలాక డీఈవోలు,ఎంఈవోల పదోన్నతులు*

*వెబ్‌ ఆప్షన్ల ద్వారా బదిలీ ప్రక్రియ చేపట్టనున్న సర్కారు!*

*ఉపాధ్యాయ సంఘాలు తో రేపు చర్చలు*

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను జులై లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరులోగా షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. బదిలీలు, ట్రాన్స్‌ఫర్లపై ఉపాధ్యాయ సంఘాలతో విద్యా శాఖ శుక్రవారం మరో దఫా చర్చలు జరుపనున్నారు. అయితే అన్ని స్థాయిల్లో ప్రమోషన్లకు అవకాశం లేకపోవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జిల్లా విద్యా శాఖాధికారులు (డీఈవో), ఎంఈవోలు, డైట్‌ లెక్చరర్ల ప్రమోషన్లకు సంబంధించి కోర్టు కేసులున్నాయి.

ఇవి పరిష్కారం అయ్యాకే పదోన్నతులు కల్పించే వీలుంది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన సమస్యల పరిష్కారం చేపడుతూనే ఇబ్బందుల్లేని వాటిల్లో ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ఎలా ఉండాలో ఉపాధ్యాయ సంఘాలు, టీచర్స్‌ ఎమ్మెల్సీల నుంచి మంత్రి సలహాలు తీసుకోనున్నారు. వీటిపై అధికారులతో చర్చించి, సీఎం దృష్టికి తీసుకెళ్తారని విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. అన్ని స్థాయిల్లో ఏకకాలంలో బదిలీలు, పదోన్నతులు కల్పించాలన్న డిమాండ్‌ వస్తుండటంతో మంత్రి ఆకస్మికంగా చర్చలు జరపడం ప్రాధాన్యం ఏర్పడింది.  


హెచ్‌ఎం స్థాయి వరకూ ఓకే 
సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయికి పదోన్నతి పొందాల్సిన వారు దాదాపు 8,500 మంది ఉన్నారు. గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందాల్సిన వాళ్లు 1,970 మంది ఉన్నారు. వీటిల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని విద్యా శాఖ భావిస్తోంది. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులను ఉమ్మడి సీనియారిటీ ప్రకారం పాత నిబంధనల మేరకే ఇవ్వాలని భావిస్తున్నారు.

అయితే అప్‌గ్రేడ్‌ చేసిన పోస్టుల విషయంలో కొన్ని కోర్టు వివాదాలు, పాలన పరమైన సమస్యలున్నాయి. దీనిపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం కన్పించట్లేదు. భాషా పండితుల పదోన్నతులకు బ్రేక్‌ పడే వీలుందని తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో 1–8 తరగతులకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధించాలని నిర్ణయించిన సర్కారు.. ఇప్పటికే ఇంగ్లిష్‌ శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది. మరోవైపు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో భాగంగా కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులు జరిగాయి. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని సీనియారిటీని రూపొందించాల్సి ఉంది. దీనిపై సమావేశంలో ఓ స్పష్టత వచ్చే వీలుందని అధికారులు భావిస్తున్నారు. 

టెన్త్‌ పరీక్షలు కాగానే.. 
వాస్తవానికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను జూన్ నెలలోనే పూర్తి చేయాలని భావించారు. కానీ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ముగియగానే బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని నిర్ణయించారు. ప్రత్యక్ష విధానంలో బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా ఆన్‌లైన్‌ విధానంలో వెబ్‌ ఆప్షన్ల ద్వారానే ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 317 జీవో అమలులో అనేక సమస్యలతో విద్యా శాఖ ఇబ్బంది పడుతోంది. బదిలీల ప్రక్రియలో ఇది సమస్య తీవ్రతను పెంచుతుందనే సంకేతాలు రావడంతో వెబ్‌ ఆధారిత బదిలీ విధానం అమలు చేయాలని నిర్ణయించారు.  

త్వరగా పూర్తి చేయాలి
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను త్వరగా, వివాద రహితంగా పూర్తి చేయాలి. అన్ని స్థాయిల్లో పోస్టులను భర్తీ చేస్తేనే విద్యా శాఖ బలోపేతమవుతుంది. న్యాయపరమైన చిక్కులను పరిష్కారానికి సమన్వయంతో ముందుకెళ్లాలి. 
–ఉపాధ్యాయ సంఘాలు

Gurukula Recruitment TGT, PGT, JL, DL Old Question Papers PDF Download

 

Gurukula Old Question Papers

తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా గతంలో నిర్వహించిన టిజిటి, పిజిటి, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ తోపాటు, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ teacher ఉద్యోగాల ప్రశ్నపత్రాల తోపాటు , సోషల్ స్టడీస్, సైన్స్, సాంస్క్రిట్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ఇం, గ్లీష్ సైన్స్ మొదలగు సబ్జెక్ట్ లాంటి అన్ని పరీక్షల  ప్రశ్నపత్రాలు అన్ని డౌన్లోడ్ చేసుకునే విధంగా కింద ఇవ్వబడ్డాయి.  ప్రస్తుతం గురుకుల ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతీ యువకులకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి అన్ని ప్రశ్నపత్రాలను ఒకే దగ్గర ఇస్తున్నాను సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి యూస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కొరకు మన టెలిగ్రామ్ గ్రూప్ లో మన whatsapp గ్రూప్ లో చేరండి.



TS Gurukula TGT, PGT Qualification, Syllabus Exam Pattern, Selection Process total detials



tspsc ద్వారా నియామకం జరిగిన గురుకుల విద్యా సంస్థల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇక్కడ ఇవ్వ బడ్డాయి. అందులో సిలబస్ అంశాలు పూర్తిగా ఉంటాయి. కావున సబ్జెక్టుల వారిగా సిలబస్ కొరకు ఈ కింది నోటిఫికేషన్లను డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఉన్న సిలబస్ చూసుకొని పరీక్షలకు సన్నద్ధం అవ్వండి.

  NOTIFICATION NO. 29/2017, Dt.02/06/2017 PRINCIPAL (SCHOOL) IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES
  NOTI.NO:28/2017 LIBRARIAN (JUNIOR COLLEGES) IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES
  NOTI.NO:27/2017 JUNIOR LECTURERS IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES (GENERAL RECRUITMENT)
  NOTI.NO:26/2017 PHYSICAL DIRECTOR (JUNIOR COLLEGE) IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES
  NOTI.NO:25/2017 PRINCIPAL (JUNIOR COLLEGES) IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES
  NOTI.NO:24/2017 LIBRARIAN DEGREE COLLEGE (WOMEN) IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES
  NOTI.NO:23/2017 PHYSICAL DIRECTOR (DEGREE COLLEGE) IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES(WOMEN)
  NOTI.NO:22/2017DEGREE COLLEGE LECTURERS IN RESIDENTIAL DEGREE COLLEGES(WOMEN)
  Notification no: 21/2017 Staff Nurses in Residential Schools
  Notification.no: 20/2017 Librarian in Residential Education Institutions Societies
  Notification no: 19/2017 Music Teachers in Residential Educational Institutions Societies
  Notification no: 18/2017 Craft Teachers in Residential Educational Institutions Societies
  Notification.no:17/2017 Art Teachers in Residential Educational Institutions
  Notification.no:16/2017 Physical Education Teachers in Residential Educational Institutions
  Notification no. 15/2017 Physical Director (School) in Residential Educational Institutions Societies
  Notification no. 14/2017 Trained Graduate Teachers in Residential Educational Institutions
  Notification no: 13/2017 Post Graduate Teachers in Residential Educational Institutions Societies

Singareni Junior Assistant Syllabus

 1.      ENGLISH LANGUAGE APTITUDE:                              [20 Questions]

 

English Language

Vocabulary

Grammar

Reading Comprehension

1.    Homonyms

2.    Antonyms

3.    Synonyms

4.    Word Formation

5.    Spelling

1.    Spotting Errors.

2.    Phrases and idioms

3.    Direct    and    Indirect speech

4.    Active / Passive voice

1.    Theme Detection

2.    Passage completion

3.    Topic rearrangement of passage

4.    Deriving Conclusion

 

 

2.      GENERAL STUDIES:                                                                    [15 Questions]

  1. ·         The making of the Constitution of India
  2. ·         Laws before the making of the Indian constitution
  3. ·         Human rights charter
  4. ·         The preamble of the Constitution
  5. ·         Making of the constituent assembly
  6. ·         The Constituent Assembly of India
  7. ·         Basic Structure (Doctrine) of the Constitution
  8. ·         Features of the Indian Constitution
  9. ·         Constitution of India: features taken from other countries
  10. ·         Parliamentary System in India
  11. ·         Citizenship
  12. ·         Directive Principles of State Policy
  13. ·         Schedules in the Constitution of India
  14. ·         Scheduled and Tribal Areas in India
  15. ·         Emergency Provisions in the Indian Constitution
  16. ·         Electoral Reforms in India
  17. ·         Panchayati Raj Systems in India
  18. ·         List of Important Articles of the Indian Constitution
  19. ·         Reorganization of Indian states
  20. ·         Important constitutional amendments
  21. ·         Right to Information Act 2005
  22. ·         Important terms in Indian polity and constitution

 

 

3.      CURRENT AFFAIRS:                         [20 Questions]

  1. ·         Bilateral, Regional and Global Groupings.
  2. ·         International Organizations.
  3. ·         International Relations.
  4. ·         International Trade & Treaties.
  5. ·         International Treaties & Agreements.
  6. ·         Polity & Governance
  7. ·         National Security
  8. ·         Judiciary
  9. ·         Indian art, Culture & Heritage
  10. ·         Social Issues
  11. ·         Social Justice
  12. ·         Plan/Policy
  13. ·         Defence


4.      HISTORY, CULTURE AND HERITAGE OF INDIA & TELANGANA

[15 Questions]

  1. ·         Art & Culture of Telangana
  2. ·         History of Telangana
  3. ·         Important Kingdoms related to Telangana History
  4. ·         Historical Places of Telangana
  5. ·         Festivals in Telangana State
  6. ·         Indian Culture: An Introduction
  7. ·         Indian Languages and Literature
  8. ·         A Brief History of Indian Arts and Architecture
  9. ·         Spread of Indian Culture Abroad
  10. ·         Characteristics of Indian Culture
  11. ·         Indian Climate
  12. ·         Festivals
  13. ·         Efflorescence of Indian Culture through Art /Religion
  14. ·         Mining history in India

 

5.      ARITHMETIC APTITUDE & LOGICAL REASONING:             [25 Questions]

Time and Work Partnership, Ratio and Proportion, Simple Interest, Problems on Numbers, Compound Interest, Areas, Percentages, Indices and Surds, Mensuration, Pipes and Cisterns, Time and Distance, Problems on Trains, Odd Man Out, Volumes Profit and Loss, Races and Games, Problems on

L.C.M. and H.C.F, Mixtures and Allegations, Boats and Streams, Permutations and Combinations, Simplification and Approximation, Numbers and Ages, Probability, Averages, Simple Equations, Quadratic Equations.

 

Symbolic / Number Classification, Analytical Reasoning, Arithmetical Reasoning, Venn diagrams, Non-Verbal Test, Visual Memory, Shapes and Mirror, Space Visualization, Odd man out, Coding Decoding, Problem Solving, Clocks, Discrimination, Figural Classification, Similarities, Letter series, Arithmetical Number Series, Semantic Analogy, Number series, Relationship Concepts.

 

6.      COMPUTER BASICS:                                                                   [25 Questions]

·         Basics of Hardware and software.

·         Windows operating system basics.

·         Internet terms and Services.

·         Basic Functionalities of MS-Office (MS-word, MS-Excel, MS-Power Point).

·         History of computers.

·         Networking and communication.

·         Database basics.

·         Basics of Hacking.

·         Security Tools.

·         Viruses.

All Updates

TSLPRB Updates

TET DSC Gurukula Updadtes

Job Notifications

Important Links

Centran Jobs Updates

TSPSC VRO FInal Merit Lists and Cut off Marks

Important Links

TSPSCvro District wise Reservation wise Marks and Merit lists

Top