గురుకుల డిగ్రీ కాలేజీల్లో 863 పోస్టుల భర్తీకి అనుమతి
నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త
తెలిపింది. రాష్ట్రంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలకు కొత్త పోస్టులు
మంజూరయ్యాయి. ఈ మేరకు 863 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా
ఊపింది. వీటిలో 616 లెక్చరర్, 15 ప్రిన్సిపల్ సహా పలు ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ బుధవారం (జూన్ 20)
ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉద్యోగాలను గురుకుల
బోర్డు ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే వీటికి సంబంధించిన
నోటిఫికేషన్, పరీక్షా విధానం షెడ్యూల్
ప్రకటించనున్నారు.
గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలకు కొత్త
పోస్టులు మంజూరయ్యాయి. వివిధ కేటగిరీల్లోని 863 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిస్తూ
ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల్లో అత్యధికంగా 616 జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉండటం
విశేషం. గురుకుల బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ
ముఖ్య కార్యదర్శి ఎన్.శివశంకర్ తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించి జూలై మొదటి
వారంలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.
గురుకుల డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టుల వివరాలు..
- ప్రిన్సిపల్: 15
- లెక్చరర్లు: 616
- లైబ్రేరియన్లు: 15
- ఫిజికల్ డైరెక్టర్లు: 15
- మెస్ మేనేజర్లు: 15
- స్టాఫ్ నర్సులు: 31
- సంరక్షకులు: 15
- ల్యాబ్ అసిస్టెంట్లు: 62
- కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్లు: 31
- అసిస్టెంట్ లైబ్రేరియన్లు: 22
- జూనియర్ అసిస్టెంట్లు: 11
- స్టోర్ కీపర్లు: 15
No comments:
Post a Comment