Showing posts with label Updates. Show all posts
Showing posts with label Updates. Show all posts

ఉత్పత్తి కులాల దిక్సూచి 'ది శూద్రాస్"

ఉత్పత్తి కులాల దిక్సూచి 'ది శూద్రాస్"
                   వేల సంవత్సరాలుగా భారత సామాజిక వ్యవస్థలో కొన్ని వర్గాలు మరికొన్ని వర్గాల మీద నిరంతరాయంగా ఆధిపత్యాన్ని వహించడం అసమానతలను ప్రస్పూటకరించడమే అవుతుంది. ఈ సామాజిక అసమానతలను ధిక్కరించడం దీర్ఘకాలం సంభవించే ప్రక్రియ. తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న శూద్రులను విముక్తి చేసే పోరాటంలో జ్యోతిభాపూలె ఏకంగా వర్ణ వ్యవస్థనే  ధిక్కరించాడు. ఆయన అడుగుజాడలల్లో నడిచిన అంబేడ్కర్ సైతం సామాజిక అసమానతలను ప్రశ్నించాడు. అంబేడ్కర్ అనంతరం బ్రాహ్మణీయ హిందూ వ్యవస్థ దాష్ఠికాల మీద తన కలం ఎక్కుపెట్టిన సామాజిక, రాజకీయ తత్వవేత ప్రొఫెసర్ కంచ ఐలయ్య, జే ఎన్ యూ పరిశోధక విద్యార్థి కార్తిక్ రాజా కరిప్పుసామి సంపాదకీయంలో వెలువడిన పుస్తకం 'ది శూద్రాస్: విజన్ ఫర్ ఎ న్యూ పాత్".  ఆధునిక కాలంలో సైతం కులం, మతం పేరిట సమాజాన్ని విడదీస్తున్న అభివృద్ది నిరోధక శక్తుల అరాచకత్వంపై ఎక్కుపెట్టిన అస్త్రమిది. ముందస్తు పరిచయ  వ్యాసంతో కలిపి పన్నెండు వ్యాసాలున్న ఈ పుస్తకం ఆధ్యాంతం ఆలోచింప జేసే విధంగా భారత సమాజంలో శూద్రుల వెనకబాటు తనంతో పాటు, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితులను భిన్న కోణంలో మన ముందుంచుతుంది. దేశాన్ని పట్టి పీడిస్తున్న విభిన్న సమస్యల గురించి ఈ పుస్తకంలోని వ్యాసాలు పాఠకులకు అవగాహన కల్పించడంతో పాటు, శూద్ర సమస్యను ఆధునికవాద విధానంతో దేశం ముందు ఉంచాయి. చారిత్రాత్మకంగా నాగరికత ప్రాతిపదికన నిర్మించిన అనేక ఉత్పాదక కులాలు శూద్ర వర్గంలో భాగమే. అయినప్పటికీ బ్రాహ్మణీయ క్రమంలో శక్తి, జ్ఞానం పంచుకునే అమరిక పరంగా ఈ వర్గం అట్టడుగు స్థానంలో ఉంది. వ్యవసాయ ఆధిపత్య కులాలు, వెనుకబడిన కులాలు, ఇతర వెనుకబడిన కులాలు, చాలా వెనుకబడిన కులాలు వంటి అనేక పేర్లతో ఈ వర్గం పిలవబడుతోంది.  కులవ్యవస్థ భావజాలం సమానత్వ సమాజం అనే భావనకు ప్రాథమికంగా విరుద్ధమని, అటువంటి సమాజ సాక్షాత్కారం స్వభావం, పరిస్థితులు పరిమితుల నుండి ఉత్పన్నమవుతుందని "హోమో హైరార్కికస్" పుస్తకంలో లూయీ డ్యుమాంట్ పేర్కొన్నాడు. కుల వ్యవస్థను 'సామాజిక స్తరీకరణ'కు రూపంగా మాత్రమే అర్థం చేసుకోవడానికి మనల్ని మనం పరిమితం చేసుకోలేమని ఆయన స్పష్టం చేశాడు.
                బాబాసాహెబ్ అంబేడ్కర్ 1946లో మొదటిసారిగా 'శూద్రులు ఎవరు" ? అనే పేరుతో ప్రచురించిన పుస్తకం శూద్రుల అస్థిత్వంపై మొదటిసారిగా స్పూర్తిధాయక ప్రశ్నలను సంధించింది. ఇన్నేళ్ళ తరువాత "ది శూద్రాస్" దళిత బహుజనులలో అదేరకమైన స్పూర్తిని రగిలిస్తోంది. వేద కాలంలో పట్టణ నాగరికత లేదు. ఈ కాలంలో మతసంబంధమైన ఆర్థిక వ్యవస్థ సమాజాన్ని శ్రేణీకృత వర్ణాలుగా విభజించింది. శూద్రులు వ్యవసాయదారులు, పశువుల పెంపకందారులుగా, వైశ్యులు పర్యవేక్షకులుగా కనిపిస్తారు. బ్రాహ్మణులు, క్షత్రియులు కూడా ఉత్పత్తి సంబందిత వ్యాపకలకు, వ్యవసాయ, పశువుల పెంపకం పనులకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఏదేమైనా, ద్విజా (రెండుసార్లు జన్మించిన) కులాలు అని పిలువబడే ఈ మూడు కులాలు హిందూ మతంలో అనేక హక్కులను పంచుకున్నాయి. హిందూ సమాజంలో శూద్రులకు ప్రాథమిక హక్కులు లేనప్పటికినీ, వారిని అదే మతానికి చెందినవారని ద్విజులు ప్రకటించారు.  అదేసమయంలో వారికి ఆధ్యాత్మిక పౌరసత్వం, దాని తాత్విక ఉపన్యాసంలో స్థానాన్ని నిరాకరించారు. పార్లమెంట్ సభ్యుడు శరద్ యాదవ్, సామాజిక కార్యకర్త సునీల్ సర్దార్, న్యాయ నిపుణులు బిందూ దొడ్డహట్టి, జామియా మిలియా ఇస్లామియా ప్రొఫెసర్ అరవింద్ కుమార్, జే ఎన్యూ రీసర్చ్ స్కాలర్ ఓం ప్రకాశ్ మహతో, సామజిక కార్యకర్త ప్రాచీ పాటిల్, జర్నలిస్ట్ ఉర్మిలేశ్, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రాం షేఫర్డ్ భీనవేణి, సీనియర్ వైద్య నిపుణుడు వినయ్ కుమార్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థి పల్లికొండ మణికంఠ వంటి శూద్ర నేపథ్య వ్యాసకర్తలు అందించిన వ్యాసాలు ఈ పుస్తకం ఉద్దేశానికి బలాన్నందించాయి. చరిత్ర వివిధ దశలలో శూద్రుల పరిస్థితిని వివరించడానికి సరైన అధ్యయనాలు లేవు. ఈ వ్యాసాలలో వారి సమకాలీన స్థితిగతులు.., మరీ ముఖ్యంగా భారతీయ సమాజంలో వారి స్థానాన్ని చర్చించారు. ప్రస్తుతం శూద్రుల పరిస్థితి దుర్భరంగా ఉన్నదని, శూద్ర విముక్తే ప్రధాన లక్ష్యంగా భవిష్యత్తులో శూద్ర విప్లవ ఆవశ్యకతను ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది.
               ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలంలోనూ శూద్రులపై జరుగుతున్న అత్యాచారాలకు అంతు లేకుండా పోయింది. ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వ సాధన కోసం శూద్రులు చేయవలసిన పోరాటాల ఆవశ్యకతను ఈ పుస్తకం వివరిస్తుంది. నిరాధరణకు గురైన శూద్ర సంస్కృతి, సాంప్రదాయాల పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పింది. శూద్రులకు దేశ విదేశాలలో కూడా ఎటువంటి స్నేహసంబంధాలు లేనందున వారి అస్థిత్వ పోరాటం వారే చేయాలి. వైధిక ధర్మం శూద్రులను కేవలం ఉత్పాధక కార్యక్రమాలకే పరిమితం చేసి పేదరికాన్ని, బలవంతపు బానిసత్వాన్ని అనాధిగా అంటగడుతూనే ఉంది. బ్రాహ్మణియ వర్గీకరణ ప్రకారం, అంటరానివారితో సహా శూద్రులనబడే అన్ని ఉత్పాదక కులాలు శ్రమించేందుకే ఉద్దేశించబడినవి. కానీ ఈ ఉత్పాదకత ఫలాలను మాత్రం ద్విజా కులాలు స్వాధీనం చేసుకున్నాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం ఈ దోపిడీ వ్యవస్థ తొలి క్రమబద్ధమైన చరిత్రను అందించింది. ద్విజులు ఉత్పాదక శ్రమకు దూరంగా ఉండటానికి, శూద్రుల ఖర్చుతో సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించడానికి అర్థశాస్త్రం సైద్ధాంతిక పునాది వేసింది.  అన్ని రకాల శ్రమతో కూడిన పనులను చేయడం ద్వారా ద్విజ వర్ణాలకు సేవ చేయడమే శూద్రుల ఏకైక విధి అని మనువు తెలివిగా ఆదేశించాడు. ఈ అన్యాయం అనాధిగా కొనసాగుతూ ఆదర్శవంతమైన వర్ణశ్రమధర్మంగా కొనియాడబడుతోంది. ద్విజులు సంస్కృతం, వేదాల అధ్యయనాలను ఇంకా తమ ఆధీనంలో ఉంచుకుంటూనే శూద్రులను హింసాత్మక వివక్షకు గురి చేస్తున్నారు. ఆధిపత్య కులాలుగా భావించబడే ఎగువ శూద్రులైన జాట్లు, గుజ్జర్లు, పటేల్స్, యాదవులు, మరాఠాలు, నాయరా, రెడ్డిలు, కమ్మలు, గౌండర్లు, లింగాయత్‌లు తమ మోధో స్పృహను మరిచి మనువాద రాజకియాలకు బలైతే శూద్రుల పరిస్థితి మరింత దారుణంగా మారడం ఖాయమని ఈ పుస్తకం హెచ్చరిస్తోంది.
                     ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న జ్యోతిభాపూలే శూద్రులు, అతిశూద్రుల మీద షేఠ్ జీ - భట్ జీ(బ్రాహ్మణ-బనియా)ల సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక ఆధిపత్యాన్ని నిరసించాడు. దక్షిణాదిన పెరియార్ రామస్వామి, అయోతి దాస్ లు బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలు భవిష్యత్తులో శూద్ర అస్థిత్వా పోరాటాలకు స్పూర్తిదాయకమయ్యాయి. స్వాతంత్రానికి ముందు నుంచే పశ్చిమ, దక్షిణ భారత దేశంలో బ్రాహ్మణాధిపత్యాన్ని నిరసిస్తూ అనేక అస్థిత్వ ఉద్యమాలు మొదలు కావడం సదరు ప్రాంతాల ఆత్మ గౌరవానికి నిదర్శనం. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాది పార్టీ, రాష్ట్రీయ జనతాదల్ పార్టీల ఆవిర్భావానికి ముందు హిందీ మాట్లాడే ఉత్తర, తూర్పు భారతంలో ఈ అస్థిత్వ పోరాటాలు తక్కువే అని చెప్పవచ్చు. విద్య, ఉపాధి పరంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోగా, కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్,బిజేపి రెండింటి పాలనలోనూ రిజర్వేషన్ల అమలు పట్ల స్పష్టమైన చర్యలు  లేకపోవడం దీనికి నిదర్శనం. 'కులరహిత' సమాజ ద్యేయంగా ప్రకటనలు గుప్పించిన భారతదేశ ఆధునిక ద్విజ సమాజం మండల్ కమిషన్ ప్రకటన సందర్భంగా తీవ్ర ఒత్తిడికి గురైంది. మండల్ కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం తీసుకు రావడం ఈ ఒత్తిడి ఫలితమే. రాబోయే ప్రమాదాన్ని దళిత, ఆదివాసీలు తెలివిగా అర్థం చేసుకున్నప్పటికీ, శూద్ర ప్రాంతీయ పార్టీ నాయకులు, క్యాడర్లతో సహా చాలా మంది శూద్రులు అర్థం చేసుకోలేదు. చాలా విషాదకరంగా, ఆధునిక భారతీయ చరిత్రలో ఉన్నత కుల ముస్లిం మేధావులు కూడా కులం, ఆధ్యాత్మిక ద్విజుల గురించి వ్రాయలేదు. ఇదేసమయంలో ఫులే-అంబేద్కర్ భావజాలం ప్రజాస్వామ్య, రాజ్యాంగ రూపాల పోరాటాలకు నిబద్ధతను కలిగి, అన్ని రకాల వ్యవస్థీకృత హింసపై పోరాటం చేస్తుంది. శూద్రులలో విద్యాధికులు కూడా తమను తాము శూద్రులుగా చెప్పుకోవడానికి ఇష్టపడక పోవడం విషాధం. తమ శూద్ర అస్థిత్వమే తమ పాలిట శాపంలా పరిణమించి విద్య, ఉద్యోగావకాశాల మీద ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనని వారి భయం. శూద్రులు, దళిత, ఆదివాసులు తమ అభ్యున్నతి కోసం లౌకిక, ప్రగతిశీల, ప్రజాస్వామ్య పాఠ్యాంశాలతో ప్రాంతీయ భాషలను నేర్చుకోవడంతో పాటు, ఆంగ్ల మాధ్యమంలో ఉన్నత విద్య చదవవలసిన ఆవశ్యకత ఉంది. శూద్రులకు ఆంగ్ల విద్య నేర్చుకోవడానికి పెద్దగా సదుపాయాలు, వనరులు లేవు. కొంతవరకు చారిత్రక ప్రతికూలత, మరికొంతవరకు ఉన్నత విద్యలో మండల్ కమిషన్ యొక్క సిఫారసులను పూర్తి స్థాయి అమలుపరుచకపోవడం కూడా కారణమేనని వ్యాసకర్తల అభిప్రాయం. ఆధిపత్య నియంతృత్వాలను ఎదిరించడంలోనే శూద్రుల అస్థిత్వం ఆధారపడి ఉందనే వాస్తవాన్ని ఈ పుస్తకం లోతుగా విశ్లేషించింది.  
                                                                                  #జయప్రకాశ్_అంకం...

శాసనాలు

🔥శాసనాలు::

🔥నానాఘాట్ శాసనం-దేవి నాగానికా

🔥హథిగుంపా శాసనం-ఖారవేలుడు

🔥నాసిక్ శాసనం - గౌతమీ బాలశ్రీ

🔥అమరావతి శాసనం-రెండవ పులోమావి

🔥జునాఘడ్ శాసనం - శక రుద్రదాముడు

🔥భట్టిప్రోలు నిగమసభశాసనం- కుబేరుడు

🔥మ్యాకదోని శాసనం-
మూడవపులోమావి

🔥ఎర్రగడి శాసనం-. అశోకుడు

🔥రాజులమందగరి శాసనం-అశోకుడు

🔥గుమ్మడి దర్రుశాసనం-
ఎహుబల శాంతమూలడు

🔥మంచికల్లు శాసనం-
రుద్రపురుష దత్తుడు

🔥అల్లూరి శాసనం-
వీరపురుషదత్తుడు

🔥కొండముదితామ్ర శాసనం-
జయవర్మ 

🔥పెదవేగి శాసనం-రెండవ నందివర్మ

🔥కొల్లేరు శాసనం-రెండవ నందివర్మ

🔥మట్టిపాడు శాసనం-దామోదరవర్మ

🔥గోరెంట్ల శాసనం-అత్తివర్మ

🔥తుమ్మలగూడెం శాసనం-గోవిందవర్మ

🔥ఈవూరు శాసనం-మాదవవర్మ

🔥రామతీర్థం శాసనం-ఇంద్రవర్మ

🔥మైదవోలు తామ్రశాసనం- శివస్కందవర్మ

🔥కొడాలి శాసనం-విజయస్కందవర్మ

🔥పొట్లదుర్తి శాసనం- పుణ్యకుమారుడు

🔥విప్పర్లశాసరం-
మొదటి జయసింహవల్లభుడు

🔥అద్దంకి శాసనం-
పాండురంగడు

🔥చీపురుపల్లి శాసనం-
కుబ్జవిష్ణువర్థనుడు

🔥సతారా శాసనం-
రెండవ పులకేసి

🔥మాగల్లు శాసనం-
దానార్ణవుడు

🔥బయ్యారం శాసనం-మైలాంబ

🔥ఖాజీపేట శాసనం-
రెండవ బేతరాజు

🔥ఖాజీపేట దుర్గ శాసనం-
దుర్గరాజు

🔥హన్మకొండ శాసనం-
రుద్రదేవుడు

🔥మోటుపల్లి శాసనం-
గణపతి దేవుడు

🔥బీదరుకోట శాసనం-
రేచర్ల ప్రసాదిత్యుడు

🔥తేరాల శాసనం-
ప్రతాప రుద్రుడు

🔥మట్టివాడ శాసనం-
గణపతి దేవుడు

🔥విలాస తామ్రశాసనం-
ముసునూరి ప్రోలయనాయకుడు

🔥నెల్లూరి శాసనం-
మొదటి హారిహరరాయులు

🔥బిట్రగుంట శాసనం-
మొదటి బుక్కరాయలు

🔥మోటుపల్లి దానశాసనం-
మొదటి దేవరాయలు

🔥హంపీశాసనం , కొండవీడు‌,మంగళగిరి, పొట్నూరు,ఉదయగిరి శాసనాలు-
శ్రీ కృష్ణ దేవరాయలు


ఉపాధ్యాయుల బదిలీలు - పదోన్నతుల షెడ్యూల్ విడుదల

ఉపాధ్యాయుల బదిలీలు - పదోన్నతుల షెడ్యూల్ విడుదల

 •  *జనవరి 27 నుండి మార్చి 4 వరకు కొనసాగింపు.*

 •  *వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా పదోన్నతులు.*

*ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీలు, పదోన్నతుల కల్పనకు ఎట్టకేలకు కాలపట్టిక విడదలైంది. ఈ జాతర ఈనెల 27 నుండి మార్చి 4 వరకు కొనసాగుతుంది.*

 •  *జనవరి 27న అన్ని క్యాటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్లైన్ లో ప్రకటిస్తారు.* 

 •  *జనవరి 28 నుండి 30 వరకు బదిలీ దరఖాస్తులు ఆన్లైన్ లో స్వీకరిస్తారు.*

 •  *దరఖాస్తు హార్డ్ కాపీలను హైస్కూల్ ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓలకు, మండల పరిషత్ పిఎస్, యుపిఎస్ ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డిఈఓ కు జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 లోపు సమర్పించాలి.*

 •  *దరఖాస్తుల హార్డ్ కాపీలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు డిఈఓ కార్యాలయంలో సమర్పించడం, పరిశీలన, ఆన్లైన్ లో ఆమోదించటం ఫిబ్రవరి 3 నుండి 6 వరకు*

 •  *ఫిబ్రవరి 7న డిఈఓ/ ఆర్జేడీ వెబ్ సైట్లలో బదిలీ పాయింట్లతో ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాలు మరియు పదోన్నతుల సీనియారిటీ జాబితాల ప్రకటన*

 •  *ఫిబ్రవరి 8 నుండి 10 వరకు మూడు రోజులు అభ్యంతరాల స్వీకరణ పరిశీలన, పరిష్కారం.*

 •  *తుది సీనియారిటీ జాబితాల ప్రకటన మరియు ప్రధానోపాధ్యాయులు బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు ఫిబ్రవరి 11,12 తేదీలు.*

 •   *మల్టీ జోనల్ స్థాయిలో* *ప్రధానోపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునః పరిశీలన ఫిబ్రవరి 13.*

 •  *ఫిబ్రవరి 14న ఆర్జేడీలచే ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల విడుదల.*

 •  *ఫిబ్రవరి 15న బదిలీల అనంతరం మిగిలిన ఖాళీల ప్రకటన.*

 •  *ఫిబ్రవరి 16,17,18 తేదీల్లో అర్హత గలిగిన స్కూల్ అసిస్టెంట్స్ కు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సెలింగ్.*

 •  *ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సబ్జెక్ట్ వారీగా స్కూల్ అసిస్టెంట్స్ ఖాళీల ప్రకటన మరియు బదిలీ ఆప్షన్స్ నమోదు.*

 •  *ఫిబ్రవరి 21 న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలనకు అవకాశం*

 •  *ఫిబ్రవరి 22,23 తేదీల్లో డిఈఓలచే స్కూల్ అసిస్టెంట్స్ బదిలీ ఉత్తర్వులు విడుదల.*

 •  *ఫిబ్రవరి 24 న స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ప్రకటన*

 •  *ఫిబ్రవరి 25,26,27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు.* 

 •  *ఫిబ్రవరి 28, మార్చి 1,2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన మరియు వెబ్ ఆప్షన్స్ నమోదు.*

 •  *మార్చి 3న ఆప్షన్ల సవరణ, పునః పరిశీలన*

 • *మార్చి 4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల.*

 •  *మార్చి 5 నుండి 19 వరకు డిఈఓ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీల్స్, అభ్యంతరాలను ఆర్జేడీ కి, ఆర్జేడీ ఉత్తర్వులపై అప్పీల్స్/ అభ్యంతరాలను డియస్ఈ కి పంపుకోవాలి.*

*సంబంధిత అధికారులు 15 రోజుల్లో వాటిని పరిష్కరించాలి.*

టెన్త్ అర్హతతో కోర్టుల్లో ఉద్యోగాలు.. వేతనం గరిష్టంగా 58 వేలు

రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి హైకోర్టు ఒకేసారి ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఎగ్జామినర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, ప్రాసెస్‌ సర్వర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ విభాగాల్లో మొత్తం 1,904 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల11వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 31వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది.

ఫిబ్రవరి 15వ తేదీ నుంచి హాల్‌టికెట్లను వైబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మార్చిలో ఆయా పోస్టులకు కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్స్‌ నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని హైకోర్టు రిజిస్ట్ట్రార్‌ తెలిపారు. ఖాళీల వివరాలు, రిజర్వేషన్లు, విద్యార్హతలు ఇతర పూర్తి వివరాలకు హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ http;//tshc.gov.in ను సందర్శించవచ్చు. అనుమానాలను నివృత్తి చేసుకొనేందుకు helpdesk-tshc@telangana.gov.in ఈ-మెయిల్‌లో సంప్రదించొచ్చు. 040- 23688394 నంబర్‌కు హైకోర్టు పని దినాల్లో ఫోన్‌ చేసి కూడా తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లలో పేరొన్నారు.

TSPSC Group-2, 3 Exam Pattern and Syllabus In Telugu

 TSPSC Group-2 Exam Pattern and Syllabus In Telugu

eGURUm tv (ఇగురం టీవీ) YouTube Channel

పేపర్‌

సబ్జెక్ట్‌

ప్రశ్నలు

సమయం (గంటలు)

మార్కులు

1

జనరల్‌ స్టడీస్, జనరల్‌ సైన్స్‌

150

2 1/2

150

2

హిస్టరీ, పాలిటీ  అండ్‌ సొసైటీ

1.      భారతదేశ మరియు తెలంగాణ సామాజిక సాంస్కతిక చరిత్ర

2.      భారత రాజ్యాంగం మరియు రాజకీయాల పర్యావలోకనం (ఓవర్‌ వ్యూ)

3.      సోషల్‌ స్ట్రక్చర్, ఇష్యూస్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీస్‌

150

2 1/2

150

3

ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌

1.      భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్లు

2.      తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి

3.      ఇష్యూస్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఛేంజెస్‌

150

2 1/2

150

4

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం

1.      తెలంగాణ ఆలోచన పుట్టుక (1948–1970)

2.      మద్దతు కూడగట్టే దశ (1971–1990)

3.      తెలంగాణ ఏర్పాటు దిశగా..(1991–2014)

150

2 1/2

150

 

eGURUm tv (ఇగురం టీవీ) YouTube Channel

  

పేపర్ 1: జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ

 

  1. 1.       కరెంట్ అఫైర్స్ – ప్రాంతీయ, జాతీయ & అంతర్జాతీయ.
  2. 2.       అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు.
  3. 3.       జనరల్ సైన్స్; సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు.
  4. 4.       పర్యావరణ సమస్యలు; విపత్తు నిర్వహణ- నివారణ మరియు ఉపశమనం వ్యూహాలు.
  5. 5.       ప్రపంచ భూగోళ శాస్త్రం, భారతీయ భౌగోళిక శాస్త్రం మరియు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక శాస్త్రం.
  6. 6.       భారతదేశ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం.
  7. 7.       తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం.
  8. 8.       తెలంగాణ రాష్ట్ర విధానాలు.
  9. 9.       సామాజిక మినహాయింపు, హక్కుల సమస్యలు మరియు సమగ్ర విధానాలు.
  10. 10.   లాజికల్ రీజనింగ్; అనలిటికల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్‌ప్రెటేషన్.
  11. 11.    ప్రాథమిక ఇంగ్లీష్. (10వ తరగతి ప్రమాణం)

 

పేపర్-II: హిస్టరీ, పాలిటీ మరియు సొసైటీ

చరిత్ర, రాజకీయాలు మరియు సమాజం

eGURUm tv (ఇగురం టీవీ) YouTube Channel

1 ) భారతదేశం మరియు తెలంగాణ యొక్క సామాజిక-సాంస్కృతిక చరిత్ర.


  • 1.       సింధులోయ నాగరికత యొక్క ముఖ్య లక్షణాలు: సమాజం మరియు సంస్కృతి. – ప్రారంభ మరియు తరువాత వేద నాగరికతలు; ఆరవ శతాబ్దం లో మతపరమైన ఉద్యమాలు – జైన మతం మరియు బౌద్ధమతం. మౌర్యులు, గుప్తులు, పల్లవుల సామాజిక, సాంస్కృతిక సహకారం, చాళుక్యులు, చోళుల కళ మరియు వాస్తుశిల్పం – హర్ష మరియు రాజపుత్ర యుగం.
  • 2.       ఇస్లాం యొక్క ఆగమనం మరియు ఢిల్లీ సుల్తానేట్ రాజ్య స్థాపన-సామాజిక, సాంస్కృతిక సూఫీ మరియు భక్తి ఉద్యమాల పాలనలో పరిస్థితులు. మొఘలుల కాలంలో: సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితులు; భాష, సాహిత్యం, కళ
  • 3.       మరియు వాస్తుశిల్పి. మరాఠాల పోరాటం మరియు సంస్కృతికి వారి సహకారం; దక్కన్ ప్రాంతంలో బహమనీల  మరియు విజయనగరం  పాలనలో సామాజిక సాంస్కృతిక పరిస్థితులు- సాహిత్యం, కళ మరియు వాస్తుశిల్పి.
  • 4.       యూరోపియన్ల ఆగమనం: బ్రిటిష్ పాలన యొక్క పెరుగుదల మరియు విస్తరణ: సామాజిక-సాంస్కృతిక విధానాలు – కార్న్‌వాలిస్, వెల్లెస్లీ, విలియం బెంటింక్, డల్హౌసీ మరియు ఇతరులు. 19 వ శతాబ్దంలో సామాజిక-మత సంస్కరణ ఉద్యమాల పెరుగుదల. సామాజిక భారతదేశంలో నిరసన ఉద్యమాలు -జ్యోతిభా మరియు సావిత్రిబాయి ఫూలే, అయ్యంకాళి, నారాయణ గురువు, పెరియార్ రామస్వామి నాయకర్, గాంధీ, అంబేద్కర్ తదితరులు.
  • 5.       ప్రాచీన తెలంగాణలో సామాజిక-సాంస్కృతిక పరిస్థితులు- శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ముదిగొండ, వేములవాడ చాళుక్యులు. మతం, భాష, సాహిత్యం, కళ మరియు వాస్తుశిల్పి ; మధ్యయుగ తెలంగాణ – సహకారం కాకతీయులు, రాచకొండ మరియు దేవరకొండ వెలమలు, కుతుబ్ షాహీలు; సామాజిక – సాంస్కృతిక పరిణామాలు: మిశ్రమ సంస్కృతి యొక్క ఆవిర్భావం. జాతరలు, పండుగలు, మొహర్రం, ఉర్సు, జాతరలు మొదలైనవి.
  • 6.       అసఫ్ జాహీ రాజవంశం పునాది- నిజాం-ఉల్-ముల్క్ నుండి మీర్ ఒసామాన్ అలీ ఖాన్ వరకు – సాలార్‌జంగ్ సంస్కరణలు సామాజిక వ్యవస్థ మరియు సామాజిక పరిస్థితులు-జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్‌ముక్‌లు మరియు దొరలు- వెట్టి మరియు భగేలా వ్యవస్థ. తెలంగాణలో సామాజిక-సాంస్కృతిక ఉద్యమాల పెరుగుదల: ఆర్యసమాజ్, ఆంధ్ర మహా సభ, ఆంధ్ర మహిళా సభ, ఆది-హిందూ ఉద్యమాలు, సాహిత్యం మరియు లైబ్రరీ ఉద్యమాలు. గిరిజన మరియు రైతుల తిరుగుబాట్లు: రామ్‌జీ గోండ్, కుమరమ్ భీముడు, మరియు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం – పోలీసు చర్య మరియు ముగింపు నిజాం పాలన.

 

2 ) భారత రాజ్యాంగం యొక్క అవలోకనం మరియు రాజకీయాలు.

 

  • 1.       భారత రాజ్యాంగం యొక్క పరిణామం – స్వభావం మరియు ముఖ్యమైన లక్షణాలు – ప్రవేశిక.
  • 2.       ప్రాథమిక హక్కులు – రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు – ప్రాథమిక విధులు.
  • 3.       ఇండియన్ ఫెడరలిజం యొక్క విశిష్ట లక్షణాలు – శాసనాల పంపిణీ మరియు యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య పరిపాలనా అధికారాలు.
  • 4.       కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు – అధ్యక్షుడు – ప్రధాన మంత్రి మరియు కౌన్సిల్ ఆఫ్ మంత్రులు; గవర్నర్, ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి – అధికారాలు మరియు విధులు.
  • 5.       73వ మరియు 74వ ప్రత్యేక సూచనతో గ్రామీణ మరియు పట్టణ పాలన సవరణలు.
  • 6.       ఎన్నికల వ్యవస్థ: ఉచిత మరియు న్యాయమైన ఎన్నికలు, అక్రమాలు; ఎన్నికల సంఘం; ఎన్నికల సంస్కరణలు మరియు రాజకీయ పార్టీలు.
  • 7.       భారతదేశంలో న్యాయ వ్యవస్థ – న్యాయపరమైన క్రియాశీలత.
  • 8.       ఎ) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వారికి ప్రత్యేక నిబంధనలు తరగతులు, మహిళలు మరియు మైనారిటీలు.
  • బి) వెల్ఫేర్ మెకానిజం ఫర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ – నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ మరియు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్.
  • 9.       భారత రాజ్యాంగం: కొత్త సవాళ్లు. 

3 ) సామాజిక నిర్మాణం, సమస్యలు మరియు పబ్లిక్ పాలసీలు. 

  • 1)       భారతీయ సామాజిక నిర్మాణం: భారతీయ సమాజంలోని ముఖ్య లక్షణాలు: కులం, కుటుంబం, వివాహం, బంధుత్వం, మతం, తెగ, స్త్రీలు, మధ్య తరగతి – తెలంగాణ సమాజం యొక్క సామాజిక-సాంస్కృతిక లక్షణాలు.
  • 2)      సామాజిక సమస్యలు: అసమానత మరియు బహిష్కరణ: కులతత్వం, మతతత్వం, ప్రాంతీయవాదం, హింస మహిళలు, బాల కార్మికులు, మానవ అక్రమ రవాణా, వైకల్యం మరియు వృద్ధులకు వ్యతిరేకంగా.
  • 3)      సామాజిక ఉద్యమాలు:  రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ప్రాంతీయ స్వయంప్రతిపత్తి ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు.
  • 4)      తెలంగాణ నిర్దిష్ట సామాజిక సమస్యలు: వెట్టి, జోగిని, దేవదాసి వ్యవస్థ, బాల కార్మికులు, ఆడపిల్లలు, ఫ్లోరోసిస్, వలసలు, రైతు  మరియు నేత కార్మికుల కష్టాలు.
  • 5)      సామాజిక విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు: SCలు, STలు, OBC, మహిళలు, మైనారిటీలు, కార్మికులు, వికలాంగుల కోసం నిశ్చయాత్మక విధానాలు మరియు పిల్లలు; సంక్షేమ కార్యక్రమాలు; ఉపాధి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు; గ్రామీణ మరియు పట్టణ స్త్రీ మరియు శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం.

  

పేపర్-III: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్

భారతీయ ఆర్థిక వ్యవస్థ: సమస్యలు మరియు సవాళ్లు

  • 1)       పెరుగుదల మరియు అభివృద్ధి : కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ – పెరుగుదల మరియు అభివృద్ధి మధ్య సంబంధం.
  • 2)      ఆర్థిక వృద్ధికి సంబంధించిన చర్యలు: జాతీయ ఆదాయం- నిర్వచనం, భావనలు మరియు జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు; నామమాత్ర మరియు నిజమైన ఆదాయం.
  • 3)      పేదరికం మరియు నిరుద్యోగం : పేదరికం యొక్క భావనలు – ఆదాయ ఆధారిత పేదరికం మరియు ఆదాయం లేని పేదరికం; పేదరికం యొక్క కొలత; నిరుద్యోగం నిర్వచనం, నిరుద్యోగం రకాలు.
  • 4)      భారత ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక : లక్ష్యాలు, ప్రాధాన్యతలు, వ్యూహాలు మరియు పంచవర్ష ప్రణాళికల విజయాలు – 12FYP; సమ్మిళిత వృద్ధి – నీతి ఆయోగ్.

ఆర్థిక మరియు అభివృద్ధి తెలంగాణ

  • 1)       విభజన పూర్వ ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (1956-2014)- లేమిలు (నీరు (బచావత్ కమిటీ), ఆర్థిక వ్యవహారాలు (లలిత్, భార్గవ, వాంచు కమిటీలు) మరియు ఉపాధి(జై భారత్, గిర్గ్లానీ కమిటీలు)) మరియు కింద అభివృద్ధి.
  • 2)      తెలంగాణలో భూ సంస్కరణలు : మధ్యవర్తుల నిర్మూలన: జమీందారీ, జాగీర్దారీ మరియు ఇనామ్దారి;అద్దె సంస్కరణలు ;ల్యాండ్ సీలింగ్; షెడ్యూల్డ్‌లో భూమి అన్యాక్రాంతం ప్రాంతాలు.
  • 3)      వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు: వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటా. GSDP; భూమి హోల్డింగ్స్ పంపిణీ; వ్యవసాయంపై ఆధారపడటం; ఇరిగేషన్ నీటిపారుదల వనరులు; పొడి భూమి వ్యవసాయ సమస్యలు; వ్యవసాయ రుణం.
  • 4)      పరిశ్రమ మరియు సేవా రంగాలు: పారిశ్రామిక అభివృద్ధి; యొక్క నిర్మాణం మరియు పెరుగుదల పరిశ్రమల రంగం- సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME) రంగం; పారిశ్రామిక మౌలిక సదుపాయాలు; తెలంగాణ పారిశ్రామిక విధానం; నిర్మాణం మరియు పెరుగుదలసేవా రంగం.

 

అభివృద్ధి మరియు మార్పు సమస్యలు

 

  • 1.       డెవలప్‌మెంట్ డైనమిక్స్: భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు – సామాజిక అసమానతలు – కులం, జాతి (తెగ), లింగం మరియు మతం; వలస; పట్టణీకరణ.
  • 2.       అభివృద్ధి : భూ సేకరణ విధానం; పునరావాసం .
  • 3.       ఆర్థిక సంస్కరణలు: వృద్ధి, పేదరికం మరియు అసమానతలు – సామాజిక అభివృద్ధి (విద్య మరియు ఆరోగ్యం); సామాజిక పరివర్తన; సామాజిక భద్రత.
  • 4.       సస్టైనబుల్ డెవలప్మెంట్: కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్; సుస్థిరమైనది అభివృద్ధి లక్ష్యాలు.
  •  

పేపర్-IV: తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు

 

1.       తెలంగాణ ఆలోచన , తెలంగాణ తొలి దశ ఉద్యమం (1948-1970)

2.       సమీకరణ దశ (1971-1990)

3.       తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు (1991-2014)


Click Here to Download TSPSC Group-2 syllabus in Telugu PDF

Click Here to Download TSPSC Group-3 syllabus in Telugu  PDF

 

 

eGURUm tv (ఇగురం టీవీ) Youtube Channel

అగ్నిపథ్ పథకం అంటే ఏంటి? జీతం ఎంత? ఎవరు అర్హులు?

సైన్యంలో చేరడానికి కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. దాని పేరు అగ్నిపథ్. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించారు.

అగ్నిపథ్ పథకం అంటే?
ర శాఖ చెప్పిన వివరాల ప్రకారం సైన్యంలో యువతకు అవకాశం ఇచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ఇది. అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీరులు అంటారు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేయొచ్చు. ఆ తర్వాత వారి పనితీరును సమీక్షిస్తారు. మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. అంటే ప్రతి 100 మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్లు 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు.

జీతం ఎంత?
అగ్నిపథ్‌ కింద సైన్యంలో చేరేవారికి మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల జీతం ఇస్తారు. ఇందులో చేతికి 21 వేలు వస్తాయి. మిగిలిన 9 వేల రూపాయలు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమచేస్తారు. రెండో ఏడాది నెలకు 33 వేల రూపాయల జీతం వస్తుంది. అందులో 30 శాతం అంటే 9900 రూపాయలు కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. మూడో ఏడాదిలో ప్రతి నెలా ఇచ్చే 36500లో 10980 కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. నాలుగో ఏడాది నెలకు 40 వేలు జీతం ఇస్తారు. ఇందులో 12000 కార్పస్ ఫండ్‌కి వెళ్తుంది. ఇలా నాలుగేళ్లలో మొత్తం 5లక్షల రెండు వేల రూపాయలు కార్పస్‌ ఫండ్‌లో జమ అవుతాయి. దీనికి మరో 5 లక్షల 2 వేల రూపాయలు అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలుపుకుని నాలుగేళ్ల తర్వాత 11.71 వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్మీ నిబంధనల ప్రకారం ఇతర రాయితీలు, సౌకర్యాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సమగ్ర ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది.

ఎవరు అర్హులు?
పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అగ్నిపథ్‌ పథకం ద్వారా సైన్యంలో చేరవచ్చు. పదో తరగతి లేదా ఇంటర్ పాసైన యువతీ యువకులు అర్హులు. అయితే, ప్రస్తుతం అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. అనంతరం అమ్మాయిలకు కూడా ఈ అవకాశం ఇస్తామని చెబుతున్నారు. అర్హతలను బట్టి ఆర్మీ, వైమానిక దళం, నేవీలో పని చేయవచ్చు.

సైన్యంలో ఉండగా చనిపోతే..
సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా 48 లక్షల జీవిత బీమా ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కోసం అభ్యర్థులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తారు.

వైకల్యం సంభవిస్తే..
సైన్యంలో ఉండగా శారీరక వైకల్యం సంభవిస్తే పరిహారం అందిస్తారు. వైకల్యం 100 శాతం ఉంటే 44 లక్షలు, 75 శాతమైతే 25 లక్షలు, 50 శాతమైతే 15 లక్షల రూపాయల పరిహారం ఇస్తారు.

రక్షణమంత్రి ఏమన్నారు?
ఈ పథకం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటూ దేశ రక్షణ బలోపేతం అవుతుందని రక్షణమంత్రి అన్నారు. సైన్యంలో చేరాలన్న చాలామంది యువకుల కల సాకారమవుతుందని చెప్పారు. భారత సైన్యాన్ని మరింత యూత్‌ఫుల్‌గా, టెక్ సావీగా తీర్చిదిద్దడం కోసం యువత సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సైనికాధికారులు తెలిపారు.

All Updates

TSLPRB Updates

TET DSC Gurukula Updadtes

Job Notifications

Important Links

Centran Jobs Updates

TSPSC VRO FInal Merit Lists and Cut off Marks

Important Links

TSPSCvro District wise Reservation wise Marks and Merit lists

Top