Showing posts with label Teaching. Show all posts
Showing posts with label Teaching. Show all posts

December లోనే DSC!


ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో డీఎస్సీ షెడ్యూలు ఎప్పుడు వెలువడుతుంది? నోటిఫికేషన్ ఎప్పుడు? పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు..? జిల్లాల వారీగా ఏయే పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులతో పాటు సెప్టెంబర్ 15న జరగబోయే టెట్ రాసేందుకు ప్రిపేరవుతున్న వారందరిలోనూ ఇదే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీచర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు రాష్ట్రంలో 6 లక్షల మందికిపైగా ఉన్నట్లు విద్యాశాఖ అంచనా వేసింది. వీరందరూ ప్రస్తుతం నిర్వహించబోయే డీఎస్సీలో పోటీ పడే అవకాశాలున్నాయి. ఎన్నికలు ముంచుకు రావటంతో రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించేందుకు మొగ్గు చూపినట్లు  స్పష్టమవుతోంది. దీంతో ఏళ్లకేళ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల కోరిక నెరవేరటంతో పాటు వచ్చే ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుతుందని భావించి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ వేసేందుకు సన్నద్ధమైంది.


రెండు రోజుల్లో టీచర్ల భర్తీకి సంబంధించిన విధివిధానాలను రెడీ చేయాలని సీఎం కేసీఆర్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో టీచర్ల భర్తీ విధివిధానాలు, ఖాళీల వివరాలను వచ్చే రెండు, మూడు రోజుల్లోనూ విడుదల చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరుగనుంది. 27వ తేదీన టెట్ ఫలితాలు వెల్లడవుతాయి. టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు టీచర్ పోస్టులకు అర్హులవుతారు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్, పరీక్షల తేదీలన్నీ ఇప్పుడు జరుగుతున్న టెట్ ను దృష్టిలో పెట్టుకొని ఖరారు చేయాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందుకే టీచర్ల భర్తీ విధివిధానాలు ఇప్పుడు సిద్ధం చేసినప్పటికీ.. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు వెలువడిన తర్వాత ఒకటీ రెండు రోజుల నుంచే డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 28 లేదా 29వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్లు స్వీకరించే అవకాశాలున్నాయి. అక్కణ్నుంచి అభ్యర్థులకు కనీసం 60 రోజుల ప్రిపరేషన్ టైమ్ ఉండేలా పరీక్ష తేదీని ఖరారు చేస్తారు. దీంతో డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ టెంటెటివ్ ప్లాన్ రెడీ చేసుకుంది. ఈలోగా రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూలు వెలువడితే.. దానికి అనుగుణంగా డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలుంటాయని అధికారులు తెలిపారు.

- నరేష్ కాపిల్ల
ప్రభుత్వ ఉపాధ్యాయుడు

DSC/ TRT Notification 2023

DSC Notification | పాఠశాల విద్యకు సంబంధించి టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి రెండ్రోజుల్లోనే నోటిఫికేషన్‌, విధివిధానాలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రెండ్రోజుల్లోనే జిల్లా కలెక్టర్లు డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తారన్నారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.

విద్యారంగంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. గురుకులాల్లో మనందరం గర్వపడేలా సత్ఫలితాలు వస్తున్నాయని అన్నారు. కొన్ని గురుకులాలను డిగ్రీ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేశామని తెలిపారు. గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 5,310 టీచర్‌ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని చెప్పారు. అన్ని స్థాయిల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ స్థాయిల్లో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మిగిలిన ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.



TS Gurukula Master QP 2023 with key


 

Master QP 2023 with key

TREIRB TGT Hall Ticket 2023 తెలంగాణ గురుకుల ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల

 TREIRB TGT Hall Ticket 2023 : తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ఈ ఉద్యోగాలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. హాల్‌టికెట్లు ఈ లింక్ ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.



CLICK Here : https://treirb.aptonline.in/UI/LoginPages/Login.aspx

ఈ లింక్ ను క్లిక్ చేసి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. అభ్యర్థులు తాము అప్లయ్‌ చేసిన పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు తమకు ఏఏ రోజుల్లో పరీక్షలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. తెలంగాణలో మొత్తం 9,210 టీచర్‌ ఉద్యోగాల‌ భర్తీకి తెలంగాణ గురుకుల విద్యాసంస్ధల నియామక బోర్డు (TREIRB) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ పోస్టుల‌కు ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు TREIRB ఇప్పటికే ప్రకటించింది.

అలాగే.. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్‌టికెట్లు https://treirb.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అప్లయ్‌ చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలతో TREIRB వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి దరఖాస్తు చేసిన సబ్జెక్టుల వారీగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొత్తం 9,210 పోస్టులకు గాను.. 2.63 లక్షల మందికి పైగా అభ్యర్ధులు అప్లయ్‌ చేసుకున్నారు. ఒక్క పోస్టుకు సగటున 29 మంది అభ్యర్ధులు పోటి పడుతుండటం విశేషం.

ప్రతిరోజూ మూడు షిప్టుల్లో TREIRB TGT పరీక్షలు :

TREIRB TGT పోస్టులకు సంబంధించి కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ఆగస్టు 1 నుంచి ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలుంటాయి. మొదటి షిఫ్టు ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, మూడో షిఫ్టు సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు నిర్వహిస్తారు.

శాసనాలు

🔥శాసనాలు::

🔥నానాఘాట్ శాసనం-దేవి నాగానికా

🔥హథిగుంపా శాసనం-ఖారవేలుడు

🔥నాసిక్ శాసనం - గౌతమీ బాలశ్రీ

🔥అమరావతి శాసనం-రెండవ పులోమావి

🔥జునాఘడ్ శాసనం - శక రుద్రదాముడు

🔥భట్టిప్రోలు నిగమసభశాసనం- కుబేరుడు

🔥మ్యాకదోని శాసనం-
మూడవపులోమావి

🔥ఎర్రగడి శాసనం-. అశోకుడు

🔥రాజులమందగరి శాసనం-అశోకుడు

🔥గుమ్మడి దర్రుశాసనం-
ఎహుబల శాంతమూలడు

🔥మంచికల్లు శాసనం-
రుద్రపురుష దత్తుడు

🔥అల్లూరి శాసనం-
వీరపురుషదత్తుడు

🔥కొండముదితామ్ర శాసనం-
జయవర్మ 

🔥పెదవేగి శాసనం-రెండవ నందివర్మ

🔥కొల్లేరు శాసనం-రెండవ నందివర్మ

🔥మట్టిపాడు శాసనం-దామోదరవర్మ

🔥గోరెంట్ల శాసనం-అత్తివర్మ

🔥తుమ్మలగూడెం శాసనం-గోవిందవర్మ

🔥ఈవూరు శాసనం-మాదవవర్మ

🔥రామతీర్థం శాసనం-ఇంద్రవర్మ

🔥మైదవోలు తామ్రశాసనం- శివస్కందవర్మ

🔥కొడాలి శాసనం-విజయస్కందవర్మ

🔥పొట్లదుర్తి శాసనం- పుణ్యకుమారుడు

🔥విప్పర్లశాసరం-
మొదటి జయసింహవల్లభుడు

🔥అద్దంకి శాసనం-
పాండురంగడు

🔥చీపురుపల్లి శాసనం-
కుబ్జవిష్ణువర్థనుడు

🔥సతారా శాసనం-
రెండవ పులకేసి

🔥మాగల్లు శాసనం-
దానార్ణవుడు

🔥బయ్యారం శాసనం-మైలాంబ

🔥ఖాజీపేట శాసనం-
రెండవ బేతరాజు

🔥ఖాజీపేట దుర్గ శాసనం-
దుర్గరాజు

🔥హన్మకొండ శాసనం-
రుద్రదేవుడు

🔥మోటుపల్లి శాసనం-
గణపతి దేవుడు

🔥బీదరుకోట శాసనం-
రేచర్ల ప్రసాదిత్యుడు

🔥తేరాల శాసనం-
ప్రతాప రుద్రుడు

🔥మట్టివాడ శాసనం-
గణపతి దేవుడు

🔥విలాస తామ్రశాసనం-
ముసునూరి ప్రోలయనాయకుడు

🔥నెల్లూరి శాసనం-
మొదటి హారిహరరాయులు

🔥బిట్రగుంట శాసనం-
మొదటి బుక్కరాయలు

🔥మోటుపల్లి దానశాసనం-
మొదటి దేవరాయలు

🔥హంపీశాసనం , కొండవీడు‌,మంగళగిరి, పొట్నూరు,ఉదయగిరి శాసనాలు-
శ్రీ కృష్ణ దేవరాయలు


ఉపాధ్యాయుల బదిలీలు - పదోన్నతుల షెడ్యూల్ విడుదల

ఉపాధ్యాయుల బదిలీలు - పదోన్నతుల షెడ్యూల్ విడుదల

 •  *జనవరి 27 నుండి మార్చి 4 వరకు కొనసాగింపు.*

 •  *వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా పదోన్నతులు.*

*ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీలు, పదోన్నతుల కల్పనకు ఎట్టకేలకు కాలపట్టిక విడదలైంది. ఈ జాతర ఈనెల 27 నుండి మార్చి 4 వరకు కొనసాగుతుంది.*

 •  *జనవరి 27న అన్ని క్యాటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్లైన్ లో ప్రకటిస్తారు.* 

 •  *జనవరి 28 నుండి 30 వరకు బదిలీ దరఖాస్తులు ఆన్లైన్ లో స్వీకరిస్తారు.*

 •  *దరఖాస్తు హార్డ్ కాపీలను హైస్కూల్ ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓలకు, మండల పరిషత్ పిఎస్, యుపిఎస్ ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డిఈఓ కు జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 లోపు సమర్పించాలి.*

 •  *దరఖాస్తుల హార్డ్ కాపీలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు డిఈఓ కార్యాలయంలో సమర్పించడం, పరిశీలన, ఆన్లైన్ లో ఆమోదించటం ఫిబ్రవరి 3 నుండి 6 వరకు*

 •  *ఫిబ్రవరి 7న డిఈఓ/ ఆర్జేడీ వెబ్ సైట్లలో బదిలీ పాయింట్లతో ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాలు మరియు పదోన్నతుల సీనియారిటీ జాబితాల ప్రకటన*

 •  *ఫిబ్రవరి 8 నుండి 10 వరకు మూడు రోజులు అభ్యంతరాల స్వీకరణ పరిశీలన, పరిష్కారం.*

 •  *తుది సీనియారిటీ జాబితాల ప్రకటన మరియు ప్రధానోపాధ్యాయులు బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు ఫిబ్రవరి 11,12 తేదీలు.*

 •   *మల్టీ జోనల్ స్థాయిలో* *ప్రధానోపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునః పరిశీలన ఫిబ్రవరి 13.*

 •  *ఫిబ్రవరి 14న ఆర్జేడీలచే ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల విడుదల.*

 •  *ఫిబ్రవరి 15న బదిలీల అనంతరం మిగిలిన ఖాళీల ప్రకటన.*

 •  *ఫిబ్రవరి 16,17,18 తేదీల్లో అర్హత గలిగిన స్కూల్ అసిస్టెంట్స్ కు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సెలింగ్.*

 •  *ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సబ్జెక్ట్ వారీగా స్కూల్ అసిస్టెంట్స్ ఖాళీల ప్రకటన మరియు బదిలీ ఆప్షన్స్ నమోదు.*

 •  *ఫిబ్రవరి 21 న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలనకు అవకాశం*

 •  *ఫిబ్రవరి 22,23 తేదీల్లో డిఈఓలచే స్కూల్ అసిస్టెంట్స్ బదిలీ ఉత్తర్వులు విడుదల.*

 •  *ఫిబ్రవరి 24 న స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ప్రకటన*

 •  *ఫిబ్రవరి 25,26,27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు.* 

 •  *ఫిబ్రవరి 28, మార్చి 1,2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన మరియు వెబ్ ఆప్షన్స్ నమోదు.*

 •  *మార్చి 3న ఆప్షన్ల సవరణ, పునః పరిశీలన*

 • *మార్చి 4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల.*

 •  *మార్చి 5 నుండి 19 వరకు డిఈఓ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీల్స్, అభ్యంతరాలను ఆర్జేడీ కి, ఆర్జేడీ ఉత్తర్వులపై అప్పీల్స్/ అభ్యంతరాలను డియస్ఈ కి పంపుకోవాలి.*

*సంబంధిత అధికారులు 15 రోజుల్లో వాటిని పరిష్కరించాలి.*

తెలుగు అక్షరమాలతో అద్భుతమైన వాక్యాలు


అ:- అన్వేషించడం మొదలుపెట్టు...
ఆ:- ఆత్మవిశ్వాసానికి పదునుపెట్టు...
ఇ:- ఇష్టపడటం నేర్చుకో...
ఈ:- ఈర్ష్యపడటం మానుకో...
ఉ:- ఉన్నతంగా ఆలోచించు...
ఊ:- ఊహకు అందేలా ఆచరించు...
ఋ:- ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు...
ఎ:- ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు...
ఏ:- ఏకాగ్రతను అసలు కోల్పోకు...
ఐ:- ఐక్యమత్యాన్ని సాధించడం మర్చిపోకు...
ఒ:- ఒంటరి జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది...
ఓ:- ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒక రోజు గెలుపుకు బాటలు వేస్తాయి...
ఔ:- ఔన్నత్యానికి గెలుపోటములు నీ పునాదులు అని మరువకు...
అం:- అందని ఎత్తుకు ఎదగాలంటే...
అః:- అఃర్నిశలుగా ఇప్పటి నుండి శ్రమించాలని తెలుసుకో....
క:- కష్టపడి పనిచేయడం నేర్చుకో...
ఖ:- ఖచ్చితత్వం అలవరుచుకో....
గ:- గమ్యాన్ని ఎంచుకొని పయనించు...
ఘా:- ఘాటుగా స్పందించడం నేర్చుకో...
జ్ఞ:- జ్ఞాపకాలను గుర్తుంచుకొని మసలుకో...
చ:- చతురతను ప్రతి విషయంలో నేర్పుగా వ్యవహరించు...
ఛ:- ఛత్రపతిలా జీవితాన్ని సార్ధకం చేసుకో....
జ:- జగడాలకు దూరంగా ఉండు..
ఝ:- ఝుమ్మంది నాదంగా మారు...
ణ:- జనగణమన గీతాన్ని మర్చిపోకు..
త:- తర తమ బేధాలను అణగదొక్కు.
థ:- థదేకంగా ధ్యానించు....
ద:- దయాదాక్షిణ్యాలు కలిగివుండు...
ధ:- ధర్మమును ఎల్లప్పుడూ ఆచరించు...
న:- నట జీవితం నేర్చుకోకు...
ప:- పరిహాసమాడకు...
ఫ:- ఫలితాలను సమంగా చూడు...
బ:- బలముతో అన్ని పనులు నెరవేరవు...
భ:- భయాన్ని దరిచేర నీయకు...
మ:- మర్యాదగా వ్యవహారించు...
య:- యవ్వనాన్ని అపహాస్యం చేయకు...
ర:- రంగురంగుల జీవితంలో పడి మోసపోకు...
ల:- లక్షణమైన జీవితాన్ని ఏర్పరుచుకో...
వ:- వంచనకు గురికాకు, గురిచేయకు...
శ:- శిరస్సును వంచుకునే పనిచేయకు...
ష:- షడ్రుచులను ఆస్వాదించు...
స:- సన్నిహితులను ఏర్పరుచుకో...
హ:- హానికరమైన పనులు ఏనాడు చేయకు...
ళ:- అవహేళన చేయకు...
క్ష:- క్షణికావేశానికి లోనుకాకు...
ఱ:- ఱణాన ఎదురు నిలువు.....

TSPSC Group-2, 3 Exam Pattern and Syllabus In Telugu

 TSPSC Group-2 Exam Pattern and Syllabus In Telugu

eGURUm tv (ఇగురం టీవీ) YouTube Channel

పేపర్‌

సబ్జెక్ట్‌

ప్రశ్నలు

సమయం (గంటలు)

మార్కులు

1

జనరల్‌ స్టడీస్, జనరల్‌ సైన్స్‌

150

2 1/2

150

2

హిస్టరీ, పాలిటీ  అండ్‌ సొసైటీ

1.      భారతదేశ మరియు తెలంగాణ సామాజిక సాంస్కతిక చరిత్ర

2.      భారత రాజ్యాంగం మరియు రాజకీయాల పర్యావలోకనం (ఓవర్‌ వ్యూ)

3.      సోషల్‌ స్ట్రక్చర్, ఇష్యూస్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీస్‌

150

2 1/2

150

3

ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌

1.      భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్లు

2.      తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి

3.      ఇష్యూస్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఛేంజెస్‌

150

2 1/2

150

4

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం

1.      తెలంగాణ ఆలోచన పుట్టుక (1948–1970)

2.      మద్దతు కూడగట్టే దశ (1971–1990)

3.      తెలంగాణ ఏర్పాటు దిశగా..(1991–2014)

150

2 1/2

150

 

eGURUm tv (ఇగురం టీవీ) YouTube Channel

  

పేపర్ 1: జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ

 

  1. 1.       కరెంట్ అఫైర్స్ – ప్రాంతీయ, జాతీయ & అంతర్జాతీయ.
  2. 2.       అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు.
  3. 3.       జనరల్ సైన్స్; సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు.
  4. 4.       పర్యావరణ సమస్యలు; విపత్తు నిర్వహణ- నివారణ మరియు ఉపశమనం వ్యూహాలు.
  5. 5.       ప్రపంచ భూగోళ శాస్త్రం, భారతీయ భౌగోళిక శాస్త్రం మరియు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక శాస్త్రం.
  6. 6.       భారతదేశ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం.
  7. 7.       తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం.
  8. 8.       తెలంగాణ రాష్ట్ర విధానాలు.
  9. 9.       సామాజిక మినహాయింపు, హక్కుల సమస్యలు మరియు సమగ్ర విధానాలు.
  10. 10.   లాజికల్ రీజనింగ్; అనలిటికల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్‌ప్రెటేషన్.
  11. 11.    ప్రాథమిక ఇంగ్లీష్. (10వ తరగతి ప్రమాణం)

 

పేపర్-II: హిస్టరీ, పాలిటీ మరియు సొసైటీ

చరిత్ర, రాజకీయాలు మరియు సమాజం

eGURUm tv (ఇగురం టీవీ) YouTube Channel

1 ) భారతదేశం మరియు తెలంగాణ యొక్క సామాజిక-సాంస్కృతిక చరిత్ర.


  • 1.       సింధులోయ నాగరికత యొక్క ముఖ్య లక్షణాలు: సమాజం మరియు సంస్కృతి. – ప్రారంభ మరియు తరువాత వేద నాగరికతలు; ఆరవ శతాబ్దం లో మతపరమైన ఉద్యమాలు – జైన మతం మరియు బౌద్ధమతం. మౌర్యులు, గుప్తులు, పల్లవుల సామాజిక, సాంస్కృతిక సహకారం, చాళుక్యులు, చోళుల కళ మరియు వాస్తుశిల్పం – హర్ష మరియు రాజపుత్ర యుగం.
  • 2.       ఇస్లాం యొక్క ఆగమనం మరియు ఢిల్లీ సుల్తానేట్ రాజ్య స్థాపన-సామాజిక, సాంస్కృతిక సూఫీ మరియు భక్తి ఉద్యమాల పాలనలో పరిస్థితులు. మొఘలుల కాలంలో: సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితులు; భాష, సాహిత్యం, కళ
  • 3.       మరియు వాస్తుశిల్పి. మరాఠాల పోరాటం మరియు సంస్కృతికి వారి సహకారం; దక్కన్ ప్రాంతంలో బహమనీల  మరియు విజయనగరం  పాలనలో సామాజిక సాంస్కృతిక పరిస్థితులు- సాహిత్యం, కళ మరియు వాస్తుశిల్పి.
  • 4.       యూరోపియన్ల ఆగమనం: బ్రిటిష్ పాలన యొక్క పెరుగుదల మరియు విస్తరణ: సామాజిక-సాంస్కృతిక విధానాలు – కార్న్‌వాలిస్, వెల్లెస్లీ, విలియం బెంటింక్, డల్హౌసీ మరియు ఇతరులు. 19 వ శతాబ్దంలో సామాజిక-మత సంస్కరణ ఉద్యమాల పెరుగుదల. సామాజిక భారతదేశంలో నిరసన ఉద్యమాలు -జ్యోతిభా మరియు సావిత్రిబాయి ఫూలే, అయ్యంకాళి, నారాయణ గురువు, పెరియార్ రామస్వామి నాయకర్, గాంధీ, అంబేద్కర్ తదితరులు.
  • 5.       ప్రాచీన తెలంగాణలో సామాజిక-సాంస్కృతిక పరిస్థితులు- శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ముదిగొండ, వేములవాడ చాళుక్యులు. మతం, భాష, సాహిత్యం, కళ మరియు వాస్తుశిల్పి ; మధ్యయుగ తెలంగాణ – సహకారం కాకతీయులు, రాచకొండ మరియు దేవరకొండ వెలమలు, కుతుబ్ షాహీలు; సామాజిక – సాంస్కృతిక పరిణామాలు: మిశ్రమ సంస్కృతి యొక్క ఆవిర్భావం. జాతరలు, పండుగలు, మొహర్రం, ఉర్సు, జాతరలు మొదలైనవి.
  • 6.       అసఫ్ జాహీ రాజవంశం పునాది- నిజాం-ఉల్-ముల్క్ నుండి మీర్ ఒసామాన్ అలీ ఖాన్ వరకు – సాలార్‌జంగ్ సంస్కరణలు సామాజిక వ్యవస్థ మరియు సామాజిక పరిస్థితులు-జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్‌ముక్‌లు మరియు దొరలు- వెట్టి మరియు భగేలా వ్యవస్థ. తెలంగాణలో సామాజిక-సాంస్కృతిక ఉద్యమాల పెరుగుదల: ఆర్యసమాజ్, ఆంధ్ర మహా సభ, ఆంధ్ర మహిళా సభ, ఆది-హిందూ ఉద్యమాలు, సాహిత్యం మరియు లైబ్రరీ ఉద్యమాలు. గిరిజన మరియు రైతుల తిరుగుబాట్లు: రామ్‌జీ గోండ్, కుమరమ్ భీముడు, మరియు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం – పోలీసు చర్య మరియు ముగింపు నిజాం పాలన.

 

2 ) భారత రాజ్యాంగం యొక్క అవలోకనం మరియు రాజకీయాలు.

 

  • 1.       భారత రాజ్యాంగం యొక్క పరిణామం – స్వభావం మరియు ముఖ్యమైన లక్షణాలు – ప్రవేశిక.
  • 2.       ప్రాథమిక హక్కులు – రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు – ప్రాథమిక విధులు.
  • 3.       ఇండియన్ ఫెడరలిజం యొక్క విశిష్ట లక్షణాలు – శాసనాల పంపిణీ మరియు యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య పరిపాలనా అధికారాలు.
  • 4.       కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు – అధ్యక్షుడు – ప్రధాన మంత్రి మరియు కౌన్సిల్ ఆఫ్ మంత్రులు; గవర్నర్, ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి – అధికారాలు మరియు విధులు.
  • 5.       73వ మరియు 74వ ప్రత్యేక సూచనతో గ్రామీణ మరియు పట్టణ పాలన సవరణలు.
  • 6.       ఎన్నికల వ్యవస్థ: ఉచిత మరియు న్యాయమైన ఎన్నికలు, అక్రమాలు; ఎన్నికల సంఘం; ఎన్నికల సంస్కరణలు మరియు రాజకీయ పార్టీలు.
  • 7.       భారతదేశంలో న్యాయ వ్యవస్థ – న్యాయపరమైన క్రియాశీలత.
  • 8.       ఎ) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వారికి ప్రత్యేక నిబంధనలు తరగతులు, మహిళలు మరియు మైనారిటీలు.
  • బి) వెల్ఫేర్ మెకానిజం ఫర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ – నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ మరియు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్.
  • 9.       భారత రాజ్యాంగం: కొత్త సవాళ్లు. 

3 ) సామాజిక నిర్మాణం, సమస్యలు మరియు పబ్లిక్ పాలసీలు. 

  • 1)       భారతీయ సామాజిక నిర్మాణం: భారతీయ సమాజంలోని ముఖ్య లక్షణాలు: కులం, కుటుంబం, వివాహం, బంధుత్వం, మతం, తెగ, స్త్రీలు, మధ్య తరగతి – తెలంగాణ సమాజం యొక్క సామాజిక-సాంస్కృతిక లక్షణాలు.
  • 2)      సామాజిక సమస్యలు: అసమానత మరియు బహిష్కరణ: కులతత్వం, మతతత్వం, ప్రాంతీయవాదం, హింస మహిళలు, బాల కార్మికులు, మానవ అక్రమ రవాణా, వైకల్యం మరియు వృద్ధులకు వ్యతిరేకంగా.
  • 3)      సామాజిక ఉద్యమాలు:  రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ప్రాంతీయ స్వయంప్రతిపత్తి ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు.
  • 4)      తెలంగాణ నిర్దిష్ట సామాజిక సమస్యలు: వెట్టి, జోగిని, దేవదాసి వ్యవస్థ, బాల కార్మికులు, ఆడపిల్లలు, ఫ్లోరోసిస్, వలసలు, రైతు  మరియు నేత కార్మికుల కష్టాలు.
  • 5)      సామాజిక విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు: SCలు, STలు, OBC, మహిళలు, మైనారిటీలు, కార్మికులు, వికలాంగుల కోసం నిశ్చయాత్మక విధానాలు మరియు పిల్లలు; సంక్షేమ కార్యక్రమాలు; ఉపాధి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు; గ్రామీణ మరియు పట్టణ స్త్రీ మరియు శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం.

  

పేపర్-III: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్

భారతీయ ఆర్థిక వ్యవస్థ: సమస్యలు మరియు సవాళ్లు

  • 1)       పెరుగుదల మరియు అభివృద్ధి : కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ – పెరుగుదల మరియు అభివృద్ధి మధ్య సంబంధం.
  • 2)      ఆర్థిక వృద్ధికి సంబంధించిన చర్యలు: జాతీయ ఆదాయం- నిర్వచనం, భావనలు మరియు జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు; నామమాత్ర మరియు నిజమైన ఆదాయం.
  • 3)      పేదరికం మరియు నిరుద్యోగం : పేదరికం యొక్క భావనలు – ఆదాయ ఆధారిత పేదరికం మరియు ఆదాయం లేని పేదరికం; పేదరికం యొక్క కొలత; నిరుద్యోగం నిర్వచనం, నిరుద్యోగం రకాలు.
  • 4)      భారత ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక : లక్ష్యాలు, ప్రాధాన్యతలు, వ్యూహాలు మరియు పంచవర్ష ప్రణాళికల విజయాలు – 12FYP; సమ్మిళిత వృద్ధి – నీతి ఆయోగ్.

ఆర్థిక మరియు అభివృద్ధి తెలంగాణ

  • 1)       విభజన పూర్వ ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (1956-2014)- లేమిలు (నీరు (బచావత్ కమిటీ), ఆర్థిక వ్యవహారాలు (లలిత్, భార్గవ, వాంచు కమిటీలు) మరియు ఉపాధి(జై భారత్, గిర్గ్లానీ కమిటీలు)) మరియు కింద అభివృద్ధి.
  • 2)      తెలంగాణలో భూ సంస్కరణలు : మధ్యవర్తుల నిర్మూలన: జమీందారీ, జాగీర్దారీ మరియు ఇనామ్దారి;అద్దె సంస్కరణలు ;ల్యాండ్ సీలింగ్; షెడ్యూల్డ్‌లో భూమి అన్యాక్రాంతం ప్రాంతాలు.
  • 3)      వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు: వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటా. GSDP; భూమి హోల్డింగ్స్ పంపిణీ; వ్యవసాయంపై ఆధారపడటం; ఇరిగేషన్ నీటిపారుదల వనరులు; పొడి భూమి వ్యవసాయ సమస్యలు; వ్యవసాయ రుణం.
  • 4)      పరిశ్రమ మరియు సేవా రంగాలు: పారిశ్రామిక అభివృద్ధి; యొక్క నిర్మాణం మరియు పెరుగుదల పరిశ్రమల రంగం- సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME) రంగం; పారిశ్రామిక మౌలిక సదుపాయాలు; తెలంగాణ పారిశ్రామిక విధానం; నిర్మాణం మరియు పెరుగుదలసేవా రంగం.

 

అభివృద్ధి మరియు మార్పు సమస్యలు

 

  • 1.       డెవలప్‌మెంట్ డైనమిక్స్: భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు – సామాజిక అసమానతలు – కులం, జాతి (తెగ), లింగం మరియు మతం; వలస; పట్టణీకరణ.
  • 2.       అభివృద్ధి : భూ సేకరణ విధానం; పునరావాసం .
  • 3.       ఆర్థిక సంస్కరణలు: వృద్ధి, పేదరికం మరియు అసమానతలు – సామాజిక అభివృద్ధి (విద్య మరియు ఆరోగ్యం); సామాజిక పరివర్తన; సామాజిక భద్రత.
  • 4.       సస్టైనబుల్ డెవలప్మెంట్: కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్; సుస్థిరమైనది అభివృద్ధి లక్ష్యాలు.
  •  

పేపర్-IV: తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు

 

1.       తెలంగాణ ఆలోచన , తెలంగాణ తొలి దశ ఉద్యమం (1948-1970)

2.       సమీకరణ దశ (1971-1990)

3.       తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు (1991-2014)


Click Here to Download TSPSC Group-2 syllabus in Telugu PDF

Click Here to Download TSPSC Group-3 syllabus in Telugu  PDF

 

 

eGURUm tv (ఇగురం టీవీ) Youtube Channel

All Updates

TSLPRB Updates

TET DSC Gurukula Updadtes

Job Notifications

Important Links

Centran Jobs Updates

TSPSC VRO FInal Merit Lists and Cut off Marks

Important Links

TSPSCvro District wise Reservation wise Marks and Merit lists

Top