9200 పంచాయతీ కార్యదర్శుల నియామకాలు 2018 || 9200 village secretary jobs in telangana 2018
9200 పంచాయతీ కార్యదర్శుల నియామకాలు 2018
రాష్ట్రంలో కొత్తగా 9,200 పంచాయితీ కార్యదర్శుల నియామకాలు జరగనున్నాయి. త్వరలో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియ ప్రారంభించి, రెండు నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి ఒక పంచాయితీ కార్యదర్శి కచ్చితంగా ఉండాలని చెప్పారు. పల్లెసీమల అభివృద్ధిలో పంచాయితీ కార్యదర్శుల పాత్ర కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు.
కొత్త పంచాయితీ కార్యదర్శులకు మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉండాలి. పనితీరు ఆధారంగా వారిని క్రమబద్దీకరించాలి. ప్రొబేషన్ సమయంలో నెలకు రూ.15 వేల చొప్పున జీతం ఇవ్వాలి. పంచాయితీ కార్యదర్శుల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే, జిల్లా కేడర్ లో నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. ప్రస్తుతం 3,562 పంచాయితీలకు మాత్రమే కార్యదర్శులున్నారు. ఇన్‌ఛార్జ్ పంచాయితీ కార్యదర్శి విధానానికి స్వస్తి పలకాలి. పంచాయితీ కార్యదర్శుల విధులు, బాధ్యతలపై విధి విధానాలు రూపొందించాలని తెలిపారు.
అన్ని గ్రామ పంచాయతీలకు పంచాయతీ కార్యదర్శులను నియమించనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇప్పటికే పని చేస్తోన్న పంచాయతీ కార్శదర్శులకు అదనంగా 9,200 మంది కార్శదర్శులను నియమిస్తామని సీఎం అన్నారు. ఈ ప్రక్రియను వారం రోజుల్లో ప్రారంభించి రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ అంశంపై ఆదివారం ప్రగతి భవన్‌లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతు ప్రసాద్‌తో చర్చించారు. ఈ నియామకాలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం జరగాలని, ఎంపికైన కార్యదర్శులకు మూడు సంవత్సరాల పాటు ప్రొబేషనరీ పీరియడ్ పెట్టి ఆ తర్వాత పని తీరు ఆధారంగా రెగ్యులర్ చేయాలని సీఎం ఆదేశించారు. పని తీరు బాగా లేనిపక్షంలో రెగ్యులరైజ్ చేయకూడనీ విధానాన్ని రూపొందించాలన్నారు. ప్రొబేషన్ పీరియడ్‌లో నెలకు రూ.15 వేల జీతం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో ఇప్పటికే 3,562 పంచాయతీలకు కార్యదర్శులు ఉన్నారని సీఎం పేర్కొన్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలను కలిపి అన్నింటికీ కార్యదర్శులను నియమించాలని ఆదేశించారు. ఒక్కో కార్యదర్శి రెండు గ్రామ పంచాయతీలకు ఇంచార్జిలుగా ఉండే విధానానికి స్వస్తి పలకాలని సీఎం సూచించారు. పంచాయతీ కార్యదర్శుల నియామకం, బాధ్యతలపై విధి, విధానాలను రూపొందించాల్సిందిగా మంత్రి జూపల్లిని అధికారులను సీఎం ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో ఆమోదించనున్నట్టు సీఎం వెల్లడించారు. కనీసం రెండు జనాభా కలిగిన గ్రామానికి కూడా ప్రత్యేకంగా కార్యదర్శిని నియమించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
9200 పంచాయతీ కార్యదర్శుల నియామకాలు 2018 గురించి మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.
No comments:
Post a Comment