tslprb si constable events from February 11, 2019 hall tickets download here
హైదరాబాద్:
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు
ఫిబ్రవరి 11వ తేదీ నుంచి
దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టిఎస్ఎల్పిఆర్బి)
చైర్మన్ వి.వి శ్రీనివాసరావు
గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షల నిమిత్తం రాష్ట్రం వ్యాప్తంగా 13 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని
ఉమ్మడి జిల్లా కేంద్రాలల్లోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో
ఒక్కో కేంద్రం చొప్పున మొత్తం 13 కేంద్రాలను అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ పరీక్షలను 35 నుంచి
40 పనిదినాలలో పూర్తిచేస్తామన్నారు. అభ్యర్థులు ఈ నెల 5వ
తేదీ ఉదయం నుంచి 9వ
తేదీ వరకు ఆన్లైన్లో తమ అడ్మిట్
కార్డులను
(www.tslprb.in ) వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
No comments:
Post a Comment