Latest

Latest

Latest

Latest

Latest

Latest

Singareni Junior Assistant Notification 2022 || SCCL Jr Assistant Notification 2022

Posted by eGURUm tv on Thursday, June 16, 2022

 సింగరేణిలో 177 ఎక్స్ టర్నల్ క్లర్కు పోస్టులకు నోటిఫికేషన్



ఈ నెల 20 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) శ్రీ ఎన్.బలరామ్ వెల్లడి
సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 (క్లర్కు) పోస్టుల భర్తీకోసం గురువారం (జూన్ 16వ తేదీ) నాడు యాజమాన్యం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగరేణిలో గల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సంస్థ సి అండ్ ఎం.డి. శ్రీ ఎన్.శ్రీధర్ ఆదేశించిన నేపథ్యంలో డైరెక్టర్ పర్సనల్ శ్రీ ఎన్.బలరామ్ సారథ్యంలో ఖాళీలను గుర్తించి ఎక్స్ టర్నల్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.


ఇటీవల ఇంటర్నల్ అభ్యర్థుల కోసం కూడా ప్రకటించిన పోస్టులకు ఇవి అదనం. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను www.scclmines.com లో Careers విభాగంలో పొందుపరిచారు. కనీస బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్స్/ ఐ.టి. ఒక సబెక్టుగా ఉన్న వారు లేదా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండి కంప్యూటర్స్ లో డిగ్రీ లేదా డిప్లొమా లేదా 6 నెలల సర్టిఫికేట్ కోర్సు విధిగా పాసై ఉండాలి. గరిష్ట వయసు 30 ఏళ్లు, ఎస్.సి, ఎస్.టి., బి.సి. లకు 5 సంవత్సరాల మినహాయింపు ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పై ఉద్యోగాల్లో 95 శాతం లోకల్ అభ్యర్థులకు అనగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన 5 శాతం పోస్టులు అన్ రిజర్వుడు కోటాకింద ఓపెన్ టు ఆల్ (అందరికీ అవకాశంగా) తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఎంపిక ఉంటుందని డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) శ్రీ ఎన్. బలరామ్ తెలిపారు.
దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ నుండి ఆన్ లైన్ ద్వారా స్వీకరిస్తారన్నారు. అలాగే దరఖాస్తుల స్వీకరణకు జులై 10 తేదీని తుది గడువుగా నిర్ణయించామన్నారు. ఇంకా ఇతర వివరాలు సింగరేణి వెబ్ సైట్లో పొందుపరిచామని, వెబ్ సైట్ ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు.
చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్

Blog, Updated at: June 16, 2022

2 Comments:

  1. Hello sir Naku 1st to 3rd study certificates levu sir 4th to 10th, Application form lo nenu 1st to 3rd private ani option pettocha na application reject avuthunda pls answer
    thank you

    ReplyDelete
  2. Hello sir Naku 1st to 3rd study certificates levu sir 4th to 10th unnay, SCCL Jr Assistant Application form lo nenu 1st to 3rd private ani option pettocha na application reject avuthunda pls answer
    thank you

    ReplyDelete