అగ్నిపథ్ పథకంపై ఎందుకంత గందరగోళం.. ఈ స్కీమ్‌పై ఉన్న అపోహలు, వాస్తవాలు...


దేశానికి సేవలు అందించాలనే ఆసక్తిగల యువత (Youth)ను త్రివిధ దళాలలో నియమించేందుకు కేంద్రం తాజాగా అగ్నిపథ్ (Agneepath) పథకం ప్రకటించింది...! 

⛔️అపోహ :- అగ్నిపథ్ పధకం వలన దేశ యువతకు, దేశరక్షణకు ఎటువంటి ఉపయోగం లేదు...?

✅️వాస్తవం:- అగ్నిపథ్ ఆర్మీలో షార్ట్ టర్మ్ సర్వీస్ కోసం యువతకు ప్రకటించిన పథకం. ఈ స్కీం కింద ఆర్మీ, నేవి, వైమానిక దళాల్లో నిర్ణీత కాలం పాటు సేవలు అందించడానికి యువతను రిక్రూట్‌మెంట్ చేసుకునే పథకం. ఈ పథకం కింద రిక్రూట్ చేసుకున్న యువతకు శిక్షణ ఇచ్చి త్రివిధ దళాల్లో నాలుగేళ్లపాటు బాధ్యతలు ఇస్తారు. ఈ పథకం కింద రిక్రూట్ అయినవారినే అగ్నివీర్స్ (Agniveer) అంటారు.

⛔️అపోహ :- అగ్నివీరుల భవిష్యత్తు పదిలంగా ఉండదు. వీరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది...!

✅️వాస్తవం:- సాయుధ బలగాల్లో 4 ఏళ్లు సర్వీస్ చేసిన వారు పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటే కేంద్రం వారికి ఆర్థిక ప్యాకేజీ, బ్యాంకు రుణ పథకం అందజేస్తుంది. పైచదువులు చదవాలనుకునే వారికి 12 తరగతికి సమానమైన సర్టిఫికేట్ ప్రదానం చేస్తుంది. అంతేకాదు, తదుపరి చదువుల కోసం బ్రిడ్జింగ్ కోర్సును ఆఫర్ చేస్తుంది. ఉద్యోగాలు పొందాలనుకునే వారికి కూడా ఈ నాలుగేళ్ల సర్వీస్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ సర్వీస్‌లో పాల్గొన్న యువతకు సీఏపీఎఫ్(CAPF), రాష్ట్ర పోలీసుల నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇతర రంగాలలో కూడా వారికి అనేక అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది. ఇలా వారి భవిష్యత్తు చాలా సురక్షితంగా ఉంటుంది.

⛔️అపోహ :- ఆడుతూ పాడుతూ కాలేజ్ జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాల్సిన వయసులో యువతను అగ్నిపథ్ పధకం ద్వారా కష్టింపచేయడం యువశక్తిని నిర్విర్యం చేయడమే...?

✅️వాస్తవం:- మనిషి జీవితంలో టీనేజ్ అనేది ఒక ముఖ్యమైన దశ., ఈ వయసు నుండే యువత భవిష్యత్ కు పునాదులు పడతాయి. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల లోపున్న అభ్యర్థులు ఈ స్కీం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ స్కీం కింద ఎంపికైన వారికి కఠిన శిక్షణ ఇస్తారు. ఎలాంటి భౌగోళిక వాతావరణంలోనైనా అంటే ఎడారులు, కొండలు, సముద్రంతోపాటు ఆకాశంలో విధులు నిర్వర్తించడానికి ఎంచుకోవచ్చు. అయితే, మహిళలకు ఇప్పుడే అవకాశం లేదు. త్వరలోనే వారు కూడా ఈ స్కీం కింద దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తారు.

⛔️అపోహ:- అగ్నిపథ్ వల్ల యువతకు అవకాశాలు తగ్గుతాయి...?

✅️వాస్తవం:- నిజానికి నాలుగేళ్లపాటు దేశానికి సేవలందించే యువతీ యువకులకు సాయుధ దళాలలో పనిచేసే అవకాశాలు మెరుగుపడతాయి. కొన్నేళ్లలో సాయుధ దళాలలో ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్‌మెంట్ల కంటే అగ్నివీరుల రిక్రూట్‌మెంట్లు మూడు రెట్లు పెరుగుతాయి.

⛔️అపోహ:- అగ్నిపథ్ పధకం వల్ల అగ్నివీరులకు భవిష్యత్ ప్రభుత్వ నియామకాలలో అవకాశాలు ఉండవు...?

✅️వాస్తవం:-ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీలో నాలుగేళ్ల సర్వీస్‌ ఉంటుందని, నాలుగేళ్ల సర్వీస్‌ అనంతరం అగ్నివీర్‌ సర్టిఫికేట్‌ అందించనున్నట్లు చెప్పారు. అగ్నివీర్‌ సర్వీస్‌ తర్వాత ఇతర ఉద్యోగాలకూ అవకాశం ఉంటుందని వెల్లడించారు.

⛔️అపోహ:- అగ్నిపథ్ పధకంలో అగ్నివీరుల చేత వెట్టిచాకిరీ చేయించుకొని, కనీస వేతనాలు కూడా ఇవ్వరు..?

✅️వాస్తవం:- అగ్నివీరులకు ఏడాదికి రూ.11 లక్షల వేతనం ఉంటుంది, 15ఏళ్ల సర్వీస్‌ అనంతరం పెన్షన్‌ సదుపాయం ఉంటుంది. అగ్నివీరులకు నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు జీతం ఉంటుంది, అలాగే రూ.48 లక్షల వరకు జీవిత బీమా కల్పిస్తున్నారు...!

⛔️అపోహ:- అగ్నిపథ్ పథకం కారణంగా రెజిమెంటల్ బాండింగ్ (regimental bonding)పై ప్రభావం పడుతుంది..?

✅వాస్తవం:-అగ్నిపథ్ పథకం వల్ల రెజిమెంటల్ వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండదు.అగ్నివీర్‌ విభాగానికి కొత్త లోగో, కొత్త యూనిఫాం ఉంటుంది. నిజానికి ఈ పథకం వల్ల అగ్నివీరులలో అత్యుత్తమమైన యువత సెలెక్ట్ అవుతారు. తద్వారా సాయుధ బలగాల బృందం సమన్వయాన్ని మరింత పెంచినట్లు అవుతుంది...

⛔️అపోహ:- అగ్నిపథ్ పథకం కారణంగా సాయుధ బలగాల సామర్థ్యం క్షీణిస్తుంది...?

✅వాస్తవం:- ఈ తరహా స్వల్పకాలిక నియామక విధానం
అమెరికా, బ్రిటన్, ఇజ్రాయిల్, సింగపూర్ వంటి చాలా దేశాలలో ఉంది.
ఈ విధానాన్ని ఇప్పటికే చాలాచోట్ల విజయవంతంగా పరీక్షించడం జరిగింది. యువత, శక్తివంతమైన సైన్యాన్ని పెంచాలంటే ఈ విధానమే ఉత్తమంగా నిలుస్తుంది. మొదటి సంవత్సరంలో రిక్రూట్ అయ్యే అగ్నివీరుల సంఖ్య సాయుధ దళాలలో 3% మాత్రమే ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత సైన్యంలోకి శాశ్వతంగా యువతను తీసుకునే ముందు అగ్నివీరుల పనితీరును పరీక్షిస్తారు. అందువల్ల ఆర్మీ పర్యవేక్షక ర్యాంక్‌ల కోసం అనుభవం, అర్హత ఉన్న సిబ్బందిని పొందడం సాధ్యమవుతుంది.

⛔️అపోహ:- అగ్నిపథ్ పథకంలో ప్రవేశానికి అప్లై చేయడం కఠినంగా ఉంటుంది...?

✅వాస్తవం:- వైద్యపరీక్షల్లో ఉత్తీర్ణత, ఇతర అర్హతలు ఉన్నవారికే అగ్నిపథ్‌లో ప్రవేశం లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు కేంద్ర డేటాబేస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఎంపికలు ఆటోమేటెడ్‌ పద్ధతిలో జరుగుతాయి. ఎంపికైన వారందరికీ రెగ్యులర్‌ కేడర్‌లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది.
అగ్నిపథ్ పథకం కోసం దరఖాస్తులను త్వరలోనే స్వీకరిస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల అవుతున్నది. అగ్నిపథ్ పథకం కింద ఖాళీలు, జాయినింగ్ ప్రాసెస్ వివరాలు https://joinindianarmy.nic.in/ లేదా https://joinindiannavy.gov.in/ లేదా https://careerindianairforce.cdac.in/ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు...!

⛔️అపోహ:- అగ్నిపథ్ పథకంలో అగ్నివీరుల పదవీకాలం ఎంత ఉంటుంది...?

✅వాస్తవం:- అగ్నిపథ్ స్కీం కింద రిక్రూట్ చేసుకున్నవారు నాలుగేళ్లపాటు ఆర్మీలో సేవలు అందించవచ్చు. ఆ తర్వాత పర్మినెంట్ క్యాడర్ కోసం కూడా స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్ల కాలంలో వారి ప్రదర్శన, మెరిట్ల ఆధారంగా పర్మినెంట్ సర్వీస్ కోసం ఎంపిక చేస్తారు. 25 శాతం దరఖాస్తులను పర్మినెంట్ క్యాడర్ కోసం పరిగణిస్తారు...!

No comments:

Post a Comment

All Updates

TSLPRB Updates

TET DSC Gurukula Updadtes

Job Notifications

Important Links

Centran Jobs Updates

TSPSC VRO FInal Merit Lists and Cut off Marks

Important Links

TSPSCvro District wise Reservation wise Marks and Merit lists

Top