Latest

Latest

Latest

Latest

Latest

Latest

ఉద్యోగుల సందేహాలు - సమాధానాలు

Posted by eGURUm tv on Saturday, June 25, 2022


1. సందేహం:
*నేను సంక్రాంతి సెలవులు అనంతరం సెలవు పెట్టాలని అనుకొనుచున్నాను. సెలవు పెట్టవచ్చా?*

సమాధానం:
*సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇస్తున్నారు. మీరు 1 రోజు సెలవు పెడితే మొత్తం సెలవులు 11 రోజులు అవుతాయి. కాబట్టి CL ఇవ్వటం కుదరదు. మీరు గనక సెలవు పెడితే మొత్తం సెలవులకు eligible leave పెట్టుకోవలసి ఉంటుంది.*


2. సందేహం:
*ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి?*

సమాధానం:
*మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.*


3. సందేహం:
*ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు. ఆ కాలానికి ELs ఎలా ఇవ్వాలి.?*

సమాధానం:
*Aplr 1933 లోని రూల్ 4 ప్రకారం ELs ను డ్యూటీ పీరియడ్ పై మాత్రమే లెక్కించాలి. ఏ విధమైన ఆకస్మికేతర సెలవు కూడా డ్యూటీ గా పరిగణించబడదు. కనుక 3 ELs జమ చేయకూడదు.*


4. సందేహం:
*ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.*

సమాధానం:
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్ ఎయిడ్, ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.*


5. సందేహం:
*ఫిబ్రవరి 29న విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి ఇవ్వాలి?*

సమాధానం:
*మార్చి1 నుండి ఇవ్వాలి. AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్ సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.*
Blog, Updated at: June 25, 2022

3 Comments:

  1. Sir tgt physical science and tgt Telugu exams వెరియస్ డేట్ ల లో వుంటాయా లేదా ఒకే రోజు వుంటాయా

    ReplyDelete
  2. ఫైనల్ exams , యెందుకంటే. డిగ్రీ మూడు సవత్సరాల లో తెలుగు లిటరేచర్ చేశాను కావున మీరు చెప్పినట్టు tgt Telugu kuda రాసుకోవచ్చు మరియు డిగ్రీ మూడు సవత్సరాల లో ఫిజిక్స్ మరియు chemistry kuda vundi కావున
    Physical science కూడ రాసుకోవచ్చు కావున ఈ రెండు exams వేరే వేరే dates lalo వుంటాయా లేదా అనేది నా డౌట్స్

    Tthank you.



    ReplyDelete
  3. TGT. PGT
    Age relaxation
    గురించి వివరాలు తెలియచేయండి సార్.

    ReplyDelete