తెలంగాణ ప్రభుత్వానికి టెట్ అభ్యర్థి లేఖ

గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. కె.చంద్రశేఖర్ గార్కి, విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ.సబితా ఇంద్రారెడ్డి గారికి టెట్ అభ్యర్థి రాస్తున్న లేఖ

విషయం : టెట్ పేపర్ -2లో సైన్స్ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయం గురించి వివరణ కోరుతూ...విన్నపం 

అయ్యా....

నా పేరు పి. గోపాల్ రావు. ఎంఏ.బీఎడ్ పూర్తి చేశాను. ప్రస్తుతం ఓ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాను. 
 
తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యావిధానంలో మార్పు వస్తుందని, నిరుద్యోగులకు త్వరగా ఉద్యోగాలు వస్తాయని భావించిన వారిలో నేనొకడిని. అయితే ఉపాధ్యాయ ఎంపిక కోసం ప్రభుత్వం ముందస్తుగా  నిర్వహిస్తున్న టెట్(టీచర్స్ ఎలిజబులిటీ టెస్ట్) పరీక్షపై నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. చాలా సందేహాలున్నాయి. దయచేసి వాటిని మీ దృష్టికి తీసుకువస్తే నా సందేహాలను నివృత్తి చేస్తారని, వీలైతే న్యాయం చేస్తారని భావించి ఈ లేఖ రాస్తున్నాను.  

• అసలు టెట్ పరీక్ష ఎందుకు ?

• ఏ ఉద్దేశంతో ప్రభుత్వం టెట్ నిర్వహిస్తున్నారు?

• ఉపాధ్యాయ శిక్షణ కోసం డీఈడీ, బీఈడీ లాంటి కోర్సులకు ఎంట్రెన్స్ లు రాసి సెలెక్ట్ అయి కోర్సు పూర్తి చేయడానికి మళ్లీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారిని ప్రత్యేకంగా పరీక్షించేదేముంది?

•   ట్రైనింగ్ చేసిన అభ్యర్థి ఆల్రెడీ ఎన్నో పరీక్షలు రాసి ఉత్తీర్ణుడైతే గానీ ఆ స్థాయికి రాడు.. అలాంటి అభ్యర్థులను మళ్లీ టెట్ లో మీరు కొత్తగా పరీక్షించాల్సిందేముంది?

• టెట్-2 (సైన్స్ అండ్ మ్యాథ్స్) పేపర్ వల్ల సైన్స్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్న విషయం మీకు తెలుసా ? ఎప్పుడైనా ఈ విషయం మీరు గమనించారా ?

• 150 మార్కులుండే టెట్ పేపర్ -2 లో తెలుగుకు 30 మార్కులు, ఇంగ్లీష్ కు 30 మార్కులు, ఛైల్డ్ సైకాలజీ(పెడగాజీ)కి 30 మార్కులు కేటాయించారు.బాగానే ఉంది. కాన సైన్స్ అభ్యర్థికి తను చదువుకున్న సైన్స్ లో 15 మార్కులు ఇచ్చి, అసలు సైన్స్ అభ్యర్థికి ఎందుకూ ఉపయోగపడని మ్యాథ్స్ కు 30 మార్కులు, ఫిజికల్ సైన్స్ కు 15 మార్కులు కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ ? దీని వల్ల కేవలం మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అభ్యర్థులు మాత్రమే ఎక్కువ శాతం ఉత్తీర్ణులు కాగలుగుతున్నారు. బయోలాజికల్ సైన్స్ అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గుతుందో మీరు ఆలోచించి ఉంటే ఈ విషయం మీదాకా వచ్చేది!

• సైన్స్ టీచరయ్యే అభ్యర్థికి మీరిచ్చేవి  15  మార్కులా? అంటే అతడి సబ్జెక్ట్ పై అవగాహన ఉండాల్సిన అవసరం లేదనా మీ ఉద్ధేశం ?

• స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ టీచరయ్యే అవకాశం మాకున్నప్పుడు, బోధించేది సైన్స్ అయినప్పుడు మాకు మ్యాథ్స్ , ఫిజిక్స్ నేర్చుకోని ఏం చేయాలి ? భవిష్యత్తులో సైన్స్ అభ్యర్థిని వేరే రకంగా ఉపయోగించుకునే ఆలోచన ఉందా?

• టెట్-2 లో సైన్స్ పరీక్ష రాసి క్వాలిఫై అయి డీఎస్సీలో మంచి మార్కులతో భవిష్యత్తులో ఉద్యోగం సాధించే సైన్స్ అభ్యర్థికి మ్యాథ్స్ తో పనేముంది మాకు క్లారిటీ ఇవ్వండి? 

• సైన్స్ అభ్యర్థికి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చదవడం వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో చెప్పండి?

• సైన్స్ అభ్యర్థిలో మ్యాథ్స్ నైపుణ్యాలు ఉన్నాయా అని పరీక్షించడం ఎంత వరకు న్యాయం ?

• టెట్-2 పేపర్లో మీరు సైన్స్(జీవశాస్త్రం) అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొనే మీరు మార్గదర్శకాలు తయారు చేశారా?

• మ్యాథ్స్ అంటే భయముండే ఇంటర్ లో బైపీసీ గ్రూప్ ఎంచుకున్నాం. డిగ్రీలో బీజెడ్సీ సైన్స్ చదివాం..బీఈడీలో సైన్స్ తీసుకున్నాం..పదవ తరగతి తర్వాత మాకు మ్యాథ్స్ పై అసలు పట్టే లేదు..అలాంటప్పుడు టెట్ లో సైన్స్ అభ్యర్థికి మ్యాథ్స్ ఎందుకు పెట్టినట్లు ?

• సోషల్ అభ్యర్థులకు టెట్ -2లో సోషల్ మెథడ్ కు 60 మార్కులు ఇచ్చారు. మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ వారికి 45 మార్కులు ఇచ్చారు.మరి సైన్స్ అభ్యర్థులు మీ ప్రభుత్వానికి ఏం ద్రోహం చేశారని కేవలం 15 మార్కులే కేటాయించారు..దీనిపై వివరణ ఇవ్వండి?

• పైగా ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 60 శాతం మార్కులు వస్తేనే క్వాలిఫై అంటున్నారు. మీరు తయారు చేసిన పేపర్లలో, మీరు పొందుపరిచిన సబ్జెక్ట్ లతో సైన్స్ చదివిన ఒక ఓసీ అభ్యర్థి ఓపెన్ కేటగిరిలో క్వాలిఫై ఎలా అవుతాడు ? 150 మార్కులకు 90 మార్కులు ఎలా వస్తాయి? 

• టెట్ పరీక్షే శుద్ధ దండగ అనుకుంటే అందులో ఇలాంటి మార్గదర్శకాలేంటి ?

• టెట్ విధానాన్ని రూపొందించింది ఎవరో తెలియదు కానీ వారికి సబ్జెక్ట్స్ పై అవగాహన లేదని అర్థమవుతోంది. దయచేసి తెలంగాణ ప్రభుత్వంలోనైనా అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.

• ఇప్పటికే సైన్స్ అభ్యర్థులకు న్యాయం చేయండి మహాప్రభో అని నల్గొండ జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.. కనీస అవగాహనతో ఆలోచిస్తే టెట్ లో సైన్స్ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయలను పరిశీలించి వారికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. 

• వీలైతే పక్క రాష్ట్రంలో పెడుతున్న మాదిరిగా టెట్, డీఎస్సీ కలిపి పెట్టండి. దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి!

• ఒక టీచర్ గా సెలెక్ట్ అవ్వడానికి ఇంత వ్యయప్రయాసలకోర్చి మేము చదువుకొంటుంటే మీరు చేస్తున్నదేమిటి ? మీ మార్గదర్శకాలను సవరించుకొనే హక్కు, అధికారాలు మీకు లేవా? అన్యాయం జరుగుతుందని తెలిసే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసం ?

• మీరు వేసే నోటిఫికేషన్ లో వేకెన్సీ ఉన్న పోస్టులనే నింపుతారు కదా. అలాంటప్పుడు టెట్ పరీక్ష పెట్టడం వల్ల మీకు శ్రమ, మాకు ఖర్చు దండగేననిపిస్తుంది. డైరెక్ట్ గా ఇంతకుముందున్నట్లు డీఎస్సీని నిర్వహిస్తే సరిపోతుంది కదా.

• చివరగా మీపై అభిమానంతో, గౌరవంతో అడుగుతున్నాం.టెట్ పరీక్షలో పేపర్ -2లో సైన్స్ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయాలపై కమిటీ వేసి న్యాయం జరిగేలా చూడండి. ఓసీలకు అర్హత మార్కుల శాతం తగ్గించండి. దీని కోసం కూడా ఉద్యమాలు చేయడం మా వల్ల కాదు...ఇప్పటికే చాలా జీవితాన్ని, విలువైన సమయాన్ని కోల్పోయాం..జీవితంలో స్థిరపడే దశలో ఉన్న మాకు ఈ అయోమయస్థితిని కట్టబెట్టిన మీరే న్యాయం చేయాలి.

ఇట్లు
టెట్ అభ్యర్థి
పి.గోపాల్ రావు
9494 273 373

No comments:

Post a Comment

All Updates

TSLPRB Updates

TET DSC Gurukula Updadtes

Job Notifications

Important Links

Centran Jobs Updates

TSPSC VRO FInal Merit Lists and Cut off Marks

Important Links

TSPSCvro District wise Reservation wise Marks and Merit lists

Top