Latest

Latest

Latest

Latest

Latest

Latest

ఈ యూనివర్సిటీ పట్టాలు చెల్లవు గందరగోళంలో లక్షా 25 వేల మంది సర్టిఫికెట్లు

Posted by eGURUm tv on Wednesday, April 29, 2026

 ఈ యూనివర్సిటీ పట్టాలు చెల్లవు గందరగోళంలో లక్షా 25 వేల మంది సర్టిఫికెట్లు


• ఏఎన్‌యూ

• అర్హత విశ్వవిద్యాలయం తెలంగాణలో

స్టడీ సెంటర్ల నిర్వహణ వల్ల లక్షల మంది స్టూడెంట్స్


• లక్షలపై ప్రభావం ఆ సర్టిఫికెట్ల వల్ల

వారి భవిష్యత్ డౌట్


• ఇప్పటికీ ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగం, అడ్మిషన్లు,

విద్య కొనసాగింపు


• 1,24,524 మంది చదివినట్లు, వివరాలు తెలంగాణ ప్రభుత్వానికి ఏఎన్‌యూ సమాచారం


• ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ


తెలంగాణలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) పరిధిలో నడిచిన స్టడీ సెంటర్లలో చదివిన 1,24,524 మంది విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడింది. ఏఎన్‌యూ తన పరిధిలో నడిపిన స్టడీ సెంటర్ల ద్వారా ఇచ్చిన సర్టిఫికెట్లు చెల్లవని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో లక్షలాది మంది విద్యార్థులు ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు, అడ్మిషన్లు పొందిన వారు ఆందోళన చెందుతున్నారు. 2014 నుంచి విశ్వవిద్యాలయం తెలంగాణలో వందలాది స్టడీ సెంటర్లు నడిపింది. ఇవన్నీ ప్రభుత్వ అనుమతులతోనే నడిచాయి. వీటిలో లక్షల మంది చదివి సర్టిఫికెట్లు పొందారు.







ఇదంతా పక్కన పెడితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు అడ్మిషన్లు, పరీక్షలు, ప్రమోషన్లకు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో చాలా మంది విశ్వవిద్యాలయ స్టడీ సెంటర్లలో చేరి చదివారు. అయితే ఈ మధ్య యూజీసీ పలు నియమాలు, 2013లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం స్టడీ సెంటర్ల నిర్వహణపై చర్యలు తీసుకోవడంతో విశ్వవిద్యాలయం సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో చదివిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.


1,24,524 మంది భవిష్యత్ ఏంటి?


ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం 2014 ప్రకారం 95వ సెక్షన్‌లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలు రెండు రాష్ట్రాల్లో కూడా పని చేయవచ్చని నిబంధన ఉండగా, తెలంగాణలో స్టడీ సెంటర్లను నడిపిన విశ్వవిద్యాలయ సర్టిఫికెట్లను ఇప్పుడు చెల్లవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.


తెలంగాణ ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎడ్యుకేషన్)కి ఏఎన్‌యూ నివేదిక ఇచ్చింది. అందులో 2014 నుంచి 2020 మధ్య విశ్వవిద్యాలయం ద్వారా ఎన్ని కోర్సులు, ఎంతమంది అడ్మిషన్లు ఇచ్చిందనే వివరాలు పొందుపరిచింది. మొత్తం 25 కోర్సుల్లో 1,24,524 మంది అడ్మిషన్లు పొందినట్లు వెల్లడైంది.


వారందరి భవిష్యత్ గందరగోళంలో పడింది. చదివిన వారు ఉద్యోగాలు, అడ్మిషన్లు పొందిన వారు కూడా ఆందోళన చెందుతున్నారు.


ఆరు లక్షల మంది విద్యార్థులు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్లు పొందినట్లు అంచనా. అందులో చాలా మంది ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు పొందారు. ఇటీవల సర్వేలో అధికారికంగా వెల్లడైన సంఖ్య 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.


అక్కడ ఓ విధానం.. ఇక్కడ ఓ విధానం...


చాలా మంది విద్యార్థులు విశ్వవిద్యాలయం ద్వారా ఏపీలో చదివి తెలంగాణలో ఉద్యోగాలు పొందారు. అక్కడ బీఈడ్ అయితే ఇక్కడ ఎంఈడ్‌గా గుర్తింపు లభించింది. ఈ విషయంలో విద్యార్థులు అసమానత ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


ఏపీ ప్రభుత్వ స్టడీ సెంటర్లు.. అభ్యంతరం లేదు


2014 నుంచి 2024 వరకు ఏపీ ప్రభుత్వం ఏఎన్‌యూ స్టడీ సెంటర్లను అనుమతించింది. చాలా మంది సర్టిఫికెట్లు పొందారు. అక్కడ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

ఇప్పుడు తెలంగాణలో మాత్రం ఎందుకు అన్నది విద్యార్థుల ప్రశ్న.


ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ


ఏఎన్‌యూ ద్వారా చదివిన విద్యార్థుల పెద్ద సంఖ్య ఉండడంతో ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వారందరి భవిష్యత్, ఉద్యోగాలు, సర్టిఫికెట్ల చెల్లుబాటు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది.


AP Reorganization 2014 section 95 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనివర్సిటీలకు(ఆచార్య నాగార్జున) చెందిన తెలంగాణ రాష్ట్రంలోని స్టడీ సెంటర్ల ద్వారా దూర విద్యా విధానంలో 2014 నుండి చదువుకున్న 1,24,524 మంది తెలంగాణ విద్యార్థుల జీవితాలకు న్యాయం చేయుట కొరకు విన్నపం.

   పై విషయానుసారం తమతో విన్నవించునది ఏమనగా మేము తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులము ఈ సందర్భంగా మా యొక్క డిగ్రీ మరియు పీజీ దూర విద్యా సర్టిఫికెట్ ల చెల్లుబాటు విషయంలో కొన్ని ముఖ్యమైన విషయాలను తమరి దృష్టికి తీసుకువస్తున్నాం.


1. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 1,24,524 మంది విద్యార్థులు రాష్ట్ర విభజన  తర్వాత 2014 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనివర్సిటీ అయిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి డిస్టెన్స్ విధానంలో తెలంగాణ స్టడీ సెంటర్ ల ద్వారా వివిధ కోర్సులలో అడ్మిషన్ తీసుకొని పూర్తి చేయడం జరిగింది.

2. అడ్మిషన్లు తీసుకునే సందర్భంలో 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 95 ప్రకారమే 10 సంవత్సరాల పాటు APGOMS 178 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో తమ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చని అని బహిరంగ ప్రకటన విడుదల చేసింది మరియు తన అధికారిక వెబ్సైట్లో ప్రచురించింది

3. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాకతీయ యూనివర్సిటీ కూడా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 95 ప్రకారం AP GOMS 178 ఆధారంగా ఇదే పద్ధతి అవలంబించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన దూర విద్యా విధానం కోసం స్టడీ సెంటర్లు నిర్వహించింది

4. ఈ విషయంలో TSCHE ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు,అందువల్ల తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులము లక్షలాది మంది అందుబాటులో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టడీ సెంటర్ల ద్వారా అనేక కోర్సులు పూర్తి చేశారు.

5. ఈ విధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ద్వారా డిస్టెన్స్ విధానంలో పూర్తి చేసిన (a )డిగ్రీల ద్వారా వేలాది మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఉన్నత మండలి అనుమతితో రెగ్యులర్ విధానంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీ ల నుండి వివిధ రకాల పీజీ లు మరియు బి. ఎడ్ వంటి కోర్సులు పూర్తి చేశారు.

6. మరియు ఆచార్య నాగార్జున నుండి దూర విద్యా విధానం  ద్వారా పొందిన పీజీ ల ద్వారా తెలంగాణ రాష్ట్ర అత్యున్నత పరీక్ష అయిన TG సెట్ క్వాలిఫై అయ్యి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ద్వారా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని ధృవీకరణ పత్రాలు కూడా పొందడం జరిగింది.ఈ సందర్భంలో కూడా TSCHE ఎటువంటి అభ్యంతరం  చెప్పలేదు.

7. అదే విధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి డిస్టెన్స్ PG లు పూర్తి చేసిన కొందరు తెలంగాణ విద్యార్థులు Ugc అత్యున్నత పరీక్షలు అయిన ugc net మరియు వంటి పరీక్షలు క్వాలిఫై అయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని వివిధ రకాల PHd కోర్సులలో కూడా రెగ్యులర్ విధానంలో అడ్మిషన్ పొందారు,ఈ సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు

8. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 2017లో వివిధ డిపార్ట్మెంట్ లలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ  TGPSC కి అప్పగించడం జరిగింది ఈ ప్రక్రియలో భాగంగా 13/2017 TGT, PGT14/2017,PET16/17,School librarian 20/2017,Degree lecturers 22/2017,  librarian degree colleges 24/2017, juniour lecturers27/2017,Juniour clollege librarian 28/2017 వంటి అనేక నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది.

9. పైన పేర్కొన్న నియామక ప్రక్రియలో భాగంగా ugc public notice 2013 territorial jurisdiction కి సంబంధించిన UGC నిబంధనలు పాటించి ,ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 95 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనివర్శిటీలు దూర విద్యా విధానంలో తెలంగాణ ప్రాదేశిక పరిధిలో తమ కార్యకలాపాలు 10 సంవత్సరాల పాటు కొనసాగించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనివర్సిటీలకు ugc territorial jurisdiction విషయంలో మినహాయింపు  ఇచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనివర్సిటీల లో డిస్టెన్స్ విధానంలో  2014 తర్వాత వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న వందలాది మందిని అనేక ఉద్యోగాలకు అర్హత కల్పించి ఉద్యోగాలు ఇచ్చింది మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల దూర విద్యా విధానం ద్వారా కోర్సు లు పూర్తి చేసిన విద్యార్థులను అనర్హులుగా ప్రకటించింది.

10. అదే విధముగా 2018 సంవత్సరంలో TREIB ద్వారా జరిగిన గురుకుల నియామకాలలో కూడా ugc territorial jurisdiction విధానం పాటించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి డిగ్రీ మరియు పీజీ లు పూర్తి చేసిన అనేక మంది విద్యార్థులకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది.

11. 2022 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి గాని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా సర్టిఫికెట్ ల విషయంలో ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు 2014 నుండి 2022 వరకు 124524 మంది తెలంగాణ విద్యార్థులు తమ కోర్సు లో పూర్తి చేసుకున్నారు.

12. 2014 నుండి 2022 మధ్య జరిగిన అన్ని నియామక ప్రక్రియలు మరియు అన్ని రకాల ప్రమోషన్లలో ఆచార్య నాగార్జున university ద్వారా డిస్టెన్స్ లో చదివిన విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది.

13. ఈ సందర్బంలో తెలంగాణ ఉన్నత మండలి లో జరిగిన పరిణామాల వలన 2022లో  కొందరు విద్యార్థులను UGC territorial jurisdiction rule కింద  ఆచార్య నాగార్జున యూనివర్సిటీలలో డిగ్రీ పూర్తి చేసిన వారు పీజీ లు మరియు బి.ఎడ్ కోర్సులు చేయడానికి మొట్ట మొదటి సారి అనుమతి నిరాకరించింది.ఇదే విషయంలో వారు కోర్టు ను సంప్రదించగా,అడ్మిషన్ కోరుకున్న నలుగురు విద్యార్థులు గతంలో జరిగిన అడ్మిషన్ విధానం,కాకతీయ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న విషయం,మరియు అప్పటి వరకు జరిగిన అన్ని నియామకాలు మరియు ప్రమోషన్స్ లలో జరిగిన ఆధారాలు గౌరవ కోర్టు వారికి సమర్పించక పోవడం వలన  ఏపీ Reorganization సెక్షన్ 95 దూర విద్యా విధానమునకు వర్తించదు అని నలుగురు విద్యార్థులకు అడ్మిషన్ నిరాకరించారు.

14. ఇదే విషయమై  అన్ని ఆధారాలతో అప్పటికే వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న 124524 మంది విద్యార్థులు అప్పటి ప్రభుత్వం మంత్రులను మరియు అప్పటి pcc అధ్యక్షులు మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ.రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది,అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యార్థులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

15. తర్వాత 2023 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన జూనియర్ లెక్చరర్ అన్ని రకాల ప్రమోషన్స్ విషయంలో ఆచార్య నాగార్జున విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది.

16. 2024 treib ద్వారా జరిగిన గురుకుల నియామకాల్లో కూడా ఆచార్య నాగార్జున దూర విద్యా విధానం లో చదివిన విద్యార్థులను ఎంపిక చేసి నియామక పత్రాలు అందించడం జరిగింది.

17. అయితే 2014 నుండి 2022 వరకు ఎటువంటి అభ్యంతరం తెలుపని TGPSC హఠాత్తుగా UGC territorial jurisdiction public notice-2103 ప్రకారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దూర విద్యా విధానం లో చదివిన విద్యార్థులు TGPSC ప్రకటించే ఉద్యోగాలకి అనర్హులు అని ప్రకటించింది,గతంలో ఇదే ugc రూల్ ప్రకారం ఆచార్య నాగార్జున సర్టిఫికెట్స్ అనుమతించింది.

18. ఇదే అంశం మీద గౌరవ హై కోర్ట్ వారిని సంప్రదించగా రిట్ పిటిషన్ నెంబర్ 25837,25531,22496 ఆఫ్ 2024 లలో సుదీర్ఘ విచారణ జరిపి 12-12-2025 నాడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ద్వారా డిస్టెన్స్ విధానంలో తెలంగాణ స్టడీ సెంటర్లలో  2014 నుండి చదువుకున్న విద్యార్థులకు అన్ని రకాల నియామకాల్లో, ప్రమోషన్ మరియు అడ్మిషన్ లలో అవకాశం ఇచ్చి ఇప్పుడు అర్హులు కాదు అనడం వివక్ష కిందకే వస్తుంది అని ఆచార్య నాగార్జున విద్యార్థులను సెలెక్ట్ చేయాలి అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.

19. తర్వాత ఈ జడ్జిమెంట్ మీద TGPSC అప్పీల్ వెళ్లడం జరిగింది 02/04/2026 న గౌరవ డివిజన్ బెంచ్ గతంలో జరిగిన అన్ని రకాల ప్రక్రియలు విస్మరించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు అనర్హులుగా పేర్కోవడం జరిగింది...

👉 ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థులు అయిన మేము స్వరాష్ట్ర ఏర్పాటు కొరకు మా వంతు పోరాటం చేసిన వారిగా మా ప్రజా ప్రభుత్వానికి మా విన్నపం

1.దయచేసి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 , సెక్షన్ 95 ప్రకారం 10 సంవత్సరాల  పాటు ఇరు రాష్ట్రాల విద్యార్థులకు ఉమ్మడి విద్యా అవకాశాలు 10 సంవత్సరాల పాటు కొనసాగుతాయి అనే అంశం దూర విద్యా విధానానికి కూడా వర్తిస్తుంది అని ప్రభుత్వం తరపున స్పష్టమైన ప్రకటన చేయండి.

2.ఇదే అంశం ఆధారంగానే 2014 నుండి నియామకాలు,అడ్మిషన్లు, ప్రమోషన్స్ జరిగాయి అన్న వాస్తవాన్ని గుర్తించండి.

3.తెలంగాణ ఉన్నత విద్యా మండలి గాని TGPSC గానీ 2014 నుండి 2022 వరకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు అధికారిక సమాచారం తీసుకోండి.

4.గౌరవ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు మీద ప్రభుత్వం తరపున అప్పీల్ చేసి స్వరాష్ట్రం కోసం పోరాడిన తెలంగాణ విద్యార్థుల హక్కులు కాపాడండి.

5.ఒకవేళ 2022 లో వచ్చిన కోర్టు తీర్పు పాటిస్తాం అని వారు పేర్కొంటే 2022 వరకు అడ్మిషన్లు తీసుకొని వివిధ కోర్సులు పూర్తి చేసిన వారికి న్యాయం చేసే చర్యలు చేపట్టండి.

👉ముఖ్యముగా ఇది వ్యవస్థ తప్పిదమే కానీ విద్యార్థుల తప్పు కాదు కావున మానవీయ కోణంలో ఆలోచించి 1,24,524 మంది తెలంగాణ విద్యార్థుల జీవితాలు కాపాడండి, స్వరాష్ట్ర ఏర్పాటే తమకు ఇబ్బంది అయింది అనే భావన రాకుండా దయచేసి ప్రభుత్వం తరపున అన్ని చర్యలు చేపట్టగలరు

Blog, Updated at: April 29, 2026

1 Comments:

  1. Good morning sir. ఒక సారి open నాగార్జున యూనివర్సిటీ హై కోర్ట్ జడ్జి మెంట్ కాపీ పెట్టండి sir

    ReplyDelete