తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీకి
అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శాఖ పరమైన కమిటీతో ఈ
పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే
నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు
తెలంగాణ
రాష్ట్రంలో కొత్తగా నియమించనున్న 9,355 పంచాయతీ
కార్యదర్శుల ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికనే ఉంటాయని, ఒప్పంద
ఉద్యోగాలు కావని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి
కృష్ణారావుతెలిపారు. సోమవారం
(జులై 30) సచివాలయంలో
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ పద్ధతిలోనే
నియమిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి మూడేళ్ల పాటు ప్రొబేషన్
పీరియడ్ ఉంటుందని మంత్రి తెలిపారు. ఎంపిక విధానాలపై కసరత్తు చేస్తున్నట్టు జూపల్లి
పేర్కొన్నారు.
రాష్ట్రంలో
ఆగస్టు 2 నుంచి 4,383
పంచాయతీలు ఒకేసారి ఉనికిలోకి రానున్న నేపథ్యంలో సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ప్రత్యేకాధికారులకు
మంత్రి జూపల్లి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. స్వాతంత్య్రానంతరం
దేశంలో ఒకేసారి 4 వేలకు పైగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన ఘనత
రాష్ట్ర సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని జూపల్లి అన్నారు. మంగళ వాయిద్యాలు, మామిడి
తోరణాలతో గ్రామంలో పండగ వాతావరణంలో నూతన పంచాయతీలు ఆవిర్భవించబోతున్నాయని
మంత్రి అన్నారు.
9,355 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి
-శాఖాపరమైన కమిటీతో నియామకం.. త్వరలో నోటిఫికేషన్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలకు తప్పకుండా
కార్యదర్శులుండాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకానుంది. 9,355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి అనుమతిస్తూ ఆర్థికశాఖ
గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నియామక ప్రక్రియను శాఖాపరమైన కమిటీతో
పూర్తిచేయాలని పేర్కొంది. ఖాళీల జాబితాను అనుసరించి ఈ నియామక ప్రక్రియను
చేపట్టనున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, నిబంధనలకు లోబడి
నియామక ప్రక్రియకు ఏర్పాట్లు చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖకు సూచించింది. ప్రొబేషన్
సమయం, సర్వీస్‌రూల్స్, రోస్టర్ విధానాలను సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. నూతన పంచాయతీరాజ్
చట్టం ప్రకారం రాష్ట్రంలో 12,751 గ్రామపంచాయతీలు ఏర్పాటయిన విషయం
తెలిసిందే.
గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నూతన
పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి తీసుకువచ్చామని, గ్రామాలకు పంచాయతీ కార్యదర్శుల కొరత ఉండరాదంటూ సీఎం కేసీఆర్ ప్రతి
గ్రామానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శిని నియామకం చేస్తామని ప్రకటించారు. కొత్త
జోనల్ వ్యవస్థపై కేంద్రం, రాష్ట్రపతి నుంచి ఆమోదం రావాల్సి
ఉండటంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతున్నది.
స్థానికత ఆధారంగా కొత్తగా ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఈ
నేపథ్యంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ఆర్థికశాఖ అనుమతి లభించింది.
టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా
శాఖాపరమైన కమిటీతో నియామకం చేపట్టాలని సూచించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు
చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలిచ్చింది. దీంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల
భర్తీ ప్రక్రియ ప్రారంభంకానుంది. త్వరలోనే పూర్తి విధివిధానాలతో నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు
పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment