![]() |
తెలంగాణలో 700 వీఆర్వో పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు
వ్యక్తిగత వివరాల్లో దొర్లిన తప్పుల సవరణకు 'ఎడిట్' అవకాశమివ్వనున్నట్లు టీఎస్‌పీఎస్సీ
గురువారం (ఆగస్టు 23) ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు తమ
బయోడేటా, ఇతర వివరాలను అభ్యర్ధులు మార్చుకోవచ్చని
సూచించింది. ఆగస్టు 26 నుంచి 28 వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. ఒకసారి మాత్రమే ఈ
అవకాశం కల్పిస్తున్నందున అభ్యర్థులు జాగ్రత్తగా ఈ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని
టీఎస్‌పీఎస్పీ సూచించింది.
వీఆర్వో పోస్టులకు సెప్టెంబరు 16న రాతపరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను
బట్టి పరీక్షలను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
వీఆర్వో దరఖాస్తుల్లో తప్పులు దొర్లినట్లయితే సంబంధిత
అభ్యర్థులు వాటిని ఈ నెల 26 నుంచి 28 వరకు ఎడిట్ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ
పేర్కొన్నది. ఒకసారి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నందున అభ్యర్థులు జాగ్రత్తగా ఈ
ప్రక్రియను పూర్తిచేసుకోవాలని టీఎస్‌పీఎస్పీ సూచించింది.
అలాగే గురుకులాల్లోని
డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 28న టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన
నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నది. లైబ్రేరియన్ ఉద్యోగాలకు సెప్టెంబర్ 5 న పరీక్ష నిర్వహిస్తామని, త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ
తెలిపింది.


0 Comments:
Post a Comment