డిగ్రీ, బీఈడీ అర్హతతో ఏకలవ్య పాఠశాలల్లో 5660 టీజీటీ, 669 హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులు

ఖాళీలు 6329

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల (EMRS) లో డైరెక్ట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(NESTS) దరఖాస్తులు కోరుతోంది.

1. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(TGT): 5,660

సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లీష్‌, మేథ్స్‌, సోషల్‌ స్టడీస్‌, సైన్స్‌, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్‌, ఆర్ట్‌, పీఈటీ(మేల్‌), పీఈటీ(ఫిమేల్‌), లైబ్రేరియన్‌.

2. హాస్టల్‌ వార్డెన్‌(పురుషులు): 335
3. హాస్టల్‌ వార్డెన్‌(మహిళలు): 334

🔴 అర్హత: టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ; టీజీటీ లైబ్రేరియన్‌ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

🔴 వయోపరిమితి: 2023 ఆగస్టు 18 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి

🔴 జీతభత్యాలు: నెలకు టీజీటీ ఉద్యోగాలకు రూ.44,900 - 142400/ రూ.35400-112400; హాస్టల్‌ వార్డెన్‌కు రూ.29,200 - రూ.92,300 చెల్లిస్తారు.

🔴 ఎంపిక ప్రక్రియ: ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్‌ సెలెక్షన్‌ ఎగ్జామ్‌-2023, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔴 పరీక్ష విధానం: ఓఎంఆర్‌ ఆధారిత(పెన్‌ పేపర్‌) విధానంలో ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు అడుగుతారు. టీజీటీ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు), లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్టుకు 30 మార్కులు(30 ప్రశ్నలు) కేటాయించారు. హాస్టల్‌ వార్డెన్‌ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు) కేటాయించారు. టీజీటీ పరీక్షకు మూడు గంటలు, హాస్టల్‌ వార్డెన్‌ పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.

🔴 దరఖాస్తు రుసుము: టీజీటీ రూ.1500; హాస్టల్‌ వార్డెన్‌ రూ.1000. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 18

వెబ్‌సైట్‌: https://emrs.tribal.gov.in/

No comments:

Post a Comment

All Updates

TSLPRB Updates

TET DSC Gurukula Updadtes

Job Notifications

Important Links

Centran Jobs Updates

TSPSC VRO FInal Merit Lists and Cut off Marks

Important Links

TSPSCvro District wise Reservation wise Marks and Merit lists

Top