TREIRB TGT Hall Ticket 2023 : తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. ఈ ఉద్యోగాలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. హాల్‌టికెట్లు ఈ లింక్ ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CLICK Here : https://treirb.aptonline.in/UI/LoginPages/Login.aspx
ఈ లింక్ ను క్లిక్ చేసి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. అభ్యర్థులు తాము అప్లయ్ చేసిన పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు తమకు ఏఏ రోజుల్లో పరీక్షలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. తెలంగాణలో మొత్తం 9,210 టీచర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యాసంస్ధల నియామక బోర్డు (TREIRB) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు TREIRB ఇప్పటికే ప్రకటించింది.
అలాగే.. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు https://treirb.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలతో TREIRB వెబ్‌సైట్‌లో లాగిన్ అయి దరఖాస్తు చేసిన సబ్జెక్టుల వారీగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 9,210 పోస్టులకు గాను.. 2.63 లక్షల మందికి పైగా అభ్యర్ధులు అప్లయ్ చేసుకున్నారు. ఒక్క పోస్టుకు సగటున 29 మంది అభ్యర్ధులు పోటి పడుతుండటం విశేషం.
ప్రతిరోజూ మూడు షిప్టుల్లో TREIRB TGT పరీక్షలు :
TREIRB TGT పోస్టులకు సంబంధించి కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ఆగస్టు 1 నుంచి ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలుంటాయి. మొదటి షిఫ్టు ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, మూడో షిఫ్టు సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు నిర్వహిస్తారు.
sir naku hall ticket raledu asalu download option kuda vastaledu ofter log in
ReplyDelete