విద్యారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. గురుకులాల్లో మనందరం గర్వపడేలా సత్ఫలితాలు వస్తున్నాయని అన్నారు. కొన్ని గురుకులాలను డిగ్రీ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు. గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 5,310 టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని చెప్పారు. అన్ని స్థాయిల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మిగిలిన ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.
DSC/ TRT Notification 2023
DSC Notification | పాఠశాల విద్యకు సంబంధించి టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి రెండ్రోజుల్లోనే నోటిఫికేషన్, విధివిధానాలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రెండ్రోజుల్లోనే జిల్లా కలెక్టర్లు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తారన్నారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.
Subscribe to:
Post Comments (Atom)
అసలు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడకండి పూటకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అయోమయం చేయకండి మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు తస్మాత్ జాగ్రత్త ఛాత్రు ఉపాధ్యాయులందరూ మరో భారీ ఉద్యమానికి తెర లేపుదాం ఉద్యమం ద్వారానే మన హక్కును సాధించుకుందాం
ReplyDeletehttps://youtu.be/X0If6-kELKk?si=DxLr5xGv0CVjd7lf
ReplyDelete