Home
Central
General
halltickets
jobs
latest update
latest updates
notifications
results
Teaching
teaching tslprb
TSLPRB
TSPSC
Update
Updates
December లోనే DSC!
December లోనే DSC!
Posted by eGURUm tv on Saturday, August 26, 2023
ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో డీఎస్సీ షెడ్యూలు ఎప్పుడు వెలువడుతుంది? నోటిఫికేషన్ ఎప్పుడు? పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు..? జిల్లాల వారీగా ఏయే పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులతో పాటు సెప్టెంబర్ 15న జరగబోయే టెట్ రాసేందుకు ప్రిపేరవుతున్న వారందరిలోనూ ఇదే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీచర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు రాష్ట్రంలో 6 లక్షల మందికిపైగా ఉన్నట్లు విద్యాశాఖ అంచనా వేసింది. వీరందరూ ప్రస్తుతం నిర్వహించబోయే డీఎస్సీలో పోటీ పడే అవకాశాలున్నాయి. ఎన్నికలు ముంచుకు రావటంతో రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించేందుకు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. దీంతో ఏళ్లకేళ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల కోరిక నెరవేరటంతో పాటు వచ్చే ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుతుందని భావించి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ వేసేందుకు సన్నద్ధమైంది.
రెండు రోజుల్లో టీచర్ల భర్తీకి సంబంధించిన విధివిధానాలను రెడీ చేయాలని సీఎం కేసీఆర్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో టీచర్ల భర్తీ విధివిధానాలు, ఖాళీల వివరాలను వచ్చే రెండు, మూడు రోజుల్లోనూ విడుదల చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.మరోవైపు సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరుగనుంది. 27వ తేదీన టెట్ ఫలితాలు వెల్లడవుతాయి. టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు టీచర్ పోస్టులకు అర్హులవుతారు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్, పరీక్షల తేదీలన్నీ ఇప్పుడు జరుగుతున్న టెట్ ను దృష్టిలో పెట్టుకొని ఖరారు చేయాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందుకే టీచర్ల భర్తీ విధివిధానాలు ఇప్పుడు సిద్ధం చేసినప్పటికీ.. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు వెలువడిన తర్వాత ఒకటీ రెండు రోజుల నుంచే డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 28 లేదా 29వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్లు స్వీకరించే అవకాశాలున్నాయి. అక్కణ్నుంచి అభ్యర్థులకు కనీసం 60 రోజుల ప్రిపరేషన్ టైమ్ ఉండేలా పరీక్ష తేదీని ఖరారు చేస్తారు. దీంతో డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ టెంటెటివ్ ప్లాన్ రెడీ చేసుకుంది. ఈలోగా రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూలు వెలువడితే.. దానికి అనుగుణంగా డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలుంటాయని అధికారులు తెలిపారు.
- నరేష్ కాపిల్ల
ప్రభుత్వ ఉపాధ్యాయుడు
You may also like these Posts
Blog, Updated at: August 26, 2023



0 Comments:
Post a Comment