తెలంగాణ లో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం సంతోషకరమైన వార్త చెప్పింది. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎట్టకేలకు ఏడాది తర్వాత టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ 2023 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డీఎస్సీ లేదా టీఆర్టీలో ఈ టెట్ లో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. టెట్ 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో విద్యను బోధించే ఉపాధ్యాయులకు ఎన్సీటీఈ (NCTE) టీచర్ ఎలిజిబులిటీ టెస్టును తప్పనిసరి చేసింది. 2011 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ టెట్ నిర్వహిస్తున్నారు. దీనిని ప్రతి ఆరు నెలలకు ఓసారి నిర్వహించాలనే నిబంధనలు ఉన్నాయి. తెలంగాణ ఎస్సీఈఆర్టీ ఆదేశాల మేరకు గతేదాడి జూన్లో టెట్ పరీక్షను నిర్వహించారు. మళ్లీ ఏడాది తర్వాత ఈ ఆగస్ట్ 01న టెట్ నోటిఫికేషన్ వచ్చింది. గతేడాది నుంచి బీఈడీ వారికి కూడా తెలంగాణ టెట్ పేపర్-1 రాసేందుకు అర్హతను కల్పించారు.
టెట్ పరీక్షను 150 మార్కులకు నిర్వహిస్తారు.
జనరల్ అభ్యర్థులు 60 శాతం, బీసీ అభ్యర్థులు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 40 శాతం మార్కులు సాధించాలి. టెట్లో ఒకసారి అర్హత సాధిస్తే.. జీవితకాలం పాటు వ్యాలిడిటీ ఉంటుంది.(గతంలో 7 సం.లు ఉండేది) టెట్ పరీక్షలో సాధించిన మార్కులకు గాను డీఎస్సీ లేదా టీఆర్టీలో 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు.
టెట్-2023 షెడ్యూల్
ఆగస్ట్ 01 - నోటిఫికేషన్ విడుదల
ఆగస్ట్ 02 నుంచి 16 వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష
సెప్టెంబర్ 27న ఫలితాల విడుదల
రాతపరీక్ష తేదీ సెప్టెంబర్ 15
పేపర్-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
పేపర్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
పరీక్ష ఫీజు: రూ.400
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
వెబ్‌సైట్: https://tstet.cgg.gov.in
టెట్ అర్హతలు ఇవే..
టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ పేపర్-1, పేపర్-2 రెండు విభాగాల్లో నిర్వహిస్తారు. టెట్ పేపర్-1కు డీఈడీ తో పాటు బీఈడీ చేసిన వారు అర్హులవుతారు. పేపర్-2 కు కేవలం బీఈడీ చేసిన వారు అర్హత కలిగి ఉంటారు. స్పెషల్ బీఈడీ, స్పెషల్ డీఈడీ చేసిన వారు కూడా టెట్కు దరఖాస్తు చేసుకోవచ్చు
టెట్ పరీక్ష విధానం
టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ -1 లో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లతో పాటు మ్యాథ్స్, ఈవీఎస్ సబ్జెక్టులు, వాటికి సంబంధించిన మెథడాలజీ
ఉంటుంది.
టెట్ పేపర్-1 (మొత్తం 150 మార్కులు)
సైకాలజీ- 30 మార్కులు
తెలుగు కంటెంట్+ మెథడాలజీ-24+6=30 మార్కులు
ఇంగ్లీష్ కంటెంట్+మెథడాలజీ-24+6=30 మార్కులు
మ్యాథ్స్ కంటెంట్+మెథడాలజీ-24+6=30 మార్కులు
ఈవీఎస్ కంటెంట్+మెథడాలజీ-24+6=30 మార్కులు
టెట్ పేపర్ -2 (మొత్తం 150 మార్కులు)
సైకాలజీ - 30 మార్కులు
తెలుగు కంటెంట్+మెథడాలజీ-30 మార్కులు
మ్యాథ్స్ + సైన్స్-60 మార్కులు ( మ్యాథ్స్ + సైన్స్ అభ్యర్థులకు)
సోషల్ కంటెంట్+మెథడాలజీ= 60 మార్కులు ( సోషల్ అభ్యర్థులకు మాత్రమే.
అప్లికేషన్ చేసుకునే విధానం పూర్తిగా ఈ వీడియోలో.....
Full Notification need
ReplyDelete