తెలంగాణ గ్రూప్ -1 ప్రిమినరి పరీక్ష మళ్లీ రద్దు అయింది. జూన్ 11న జరిగిన గ్రూప్ -1 పరీక్షలను హై కోర్టు రద్దు చేసింది. బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీటు ఇవ్వడంపై గ్రూప్-1 అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక, గ్రూప్ -1 పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన హైకోర్టు పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. గతంలో పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ -1 పరీక్ష రద్దు కాగా తాజాగా హైకోర్టు ఆదేశాలతో రెండోసారి రద్దయింది. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment