PGHM మరియు PSHM (LFLHM) కు TET అవసరం లేదు
ఎందుకంటే ఇవి రెండు 100 శాతం పదోన్నతి ద్వారా ఇచ్చే పోస్టులు. నియామకం అనేది ఉండదు. మరియు అన్ని రకాల సబ్జెక్టు ఉన్న ఉపాధ్యాయులు ఇందులో పదోన్నతి పొందే అవకాశం ఉంది
టెట్ అనేది SGT మరియు స్కూల్ అసిస్టెంట్ కేడర్ లకి సంబంధించినదిగా మాత్రమే నోటిఫికేషన్ లో ఉంది. ఎక్కడ PGHM మరియు PSHM అనేది ప్రస్తావన లేదు. మరియు LFLHM అనేది అయా రాష్ట్రాల్లో వేరు వేరు పేర్లతో పిలుస్తారు.
PSHM జాబ్ చార్ట్ అనేది ఎక్కడ నిర్ణయం కాలేదు.వారు కూడా కేవలం SGT కి ఉండే బాధ్యతలు విధులు మాత్రమే నిర్వహిస్తారు. జీతాలు చేసే అధికారం లేదు. కేవలం తన బడులోని సిబ్బందికి క్యాజువల్ సెలవు మంజూరు చేసే అధికారం మాత్రమే ఇంది. ఈ పని చాలా పాఠశాలలలో SGT కూడా మంజూరు చేస్తారు. ఇక PGHM విషయానికి వస్తె EOT, GOT మరియు స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది వారి బాధ్యతల నిర్వహణ నేపథ్యంలో తప్పనిసరి అనేది ఉందనే ఉంది.
ఏ పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఇక టెట్ విషయానికి వస్తె అది కేవలం ఉపాధ్యాయ అర్హత పరీక్ష మాత్రమే. నూతన విద్యా విధానంలో పదోన్నతుల కోసం అర్హత పరీక్ష ఉండాలి అని ప్రతిపాదించిన విషయం వాస్తవమే అయినా ఆ విధానం అమలు చేస్తామని ఇప్పటి వరకు ముందుకు వచ్చిన రాష్ట్రాలు కేవలం రెండు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కనుక నూతన విద్యా విధానంలో ఉన్న పాలసీలు మనకు అమలులోకి రావు. కనుక ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న ఎవరికి అంటే ఏ క్యాడర్ లో పని చేసినా టెట్ అనేది కొలమానం కాదు. అలాగే విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో నిర్ణయాలు తీసుకునే అధికారం వెసులుబాటు ఎలాగూ రాష్ట్రాలకు ఉంది.
అదే సమయంలో ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను అంచనా వేయడానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మరియు ఉపాధ్యాయ విద్యా ఆధ్వర్యంలో దిశా అనే ప్లాట్ ఫామ్ ద్వారా శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాలను అన్ని విషయాలలో మదింపు చేశారు. నూతనంగా విద్యలో వచ్చిన విప్లవాత్మక మార్పులను కూడా జోడించి పిల్లల సైకాలజీ, inclusive education వంటి అంశాలను చేర్చి వారికి మదింపు చేసి వారి నైపుణ్యాల స్థాయికి గ్రేడింగ్ ఇస్తు సర్టిఫికెట్లు అనగా ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. ప్రస్తుతం ఒక్కొక్క ఉపాధ్యాయుడు వద్ద 12 పత్రాలు ఉన్నాయి. ఎవరైతే ఈ పరీక్షలో పూర్తి స్థాయి సామర్థ్యాలు సాధించలేదు వారికి మరి కొన్ని గంటల విడియో పాఠాలు అందుబాటులోకి తెచ్చి, ప్రత్యక్ష తరగతులు హాజరు కాని వారికి మళ్లీ ప్రత్యక్ష తరగతులు నిర్వహించి ఈ పరీక్షలు ఒక కట్ ఆఫ్ తేదీలోగా పొందాలనీ నియమం పెట్టీ అందరినీ నైపుణ్యవంతులను చేశారు.
అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన FLN తొలిమెట్టు కార్యక్రమంలో కూడా ప్రత్యక్ష శిక్షణ కు ముందు ప్రారంభ పరీక్ష మరియు శిక్షణ అనంతరం అంత్య పరీక్ష నిర్వహించారు.
ఇవి ప్రభుత్వం వద్ద రికార్డ్ రూపంలో నమోదు చేసి ఉన్నారు. అలాగే ఎక్కడ ఎవరికి అయితే అవసరమో డిపార్ట్మెంట్ పరంగా ఆయా పరీక్షలు నిర్వహిస్తూ అవి పాస్ అయిన వారితో మాత్రమే పదిన్నతులు ఇవ్వడం జరుగుతున్నది.
ఇటీవల కాలంలో డిజిటల్ మాధ్యమం ద్వారా బోధన అంశాలను కూడా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, వారి ద్వారా ఈ మెయిల్ క్రియేట్ చేయించడం, కేయాన్ ఆపరేట్ చేయించడం, డిజిటల్ బోర్డు వినియోగం అంశాలు నేర్పించడం జరిగింది. ఇవి పదోన్నతి అర్హతలు కాకుండా ఎలా పోతాయి.
టెట్ వాలిడిటీ ఉద్యోగ ప్రవేశం వరకు మాత్రమే
టెట్ వాలిడిటీ మొదట్లో కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండగా తాజాగా జీవితకాలం అని మార్చారు. అయితే ఇది ఉద్యోగంలో ప్రవేశించే వరకు మాత్రమే ఉంటుంది. అభ్యర్థి ఒకసారి ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత సర్వీసు నియమ నిబంధనలు రిజిష్టర్ నిర్వహణ పథకాల వివరాలు బోధనలో వస్తున్న మార్పులు అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా నేర్చుకున్న ఆయా సబ్జెక్టుల సమాచారం ఉద్యోగంలో కొనసాగడానికి ఎలాంటి అర్హత కాదు. ఎందుకంటే అధి నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలలో మాత్రమే ఉన్నది. కానీ ఇన్ సర్వీస్ టీచర్లకు పదోన్నతి నిమిత్తం అవసరం అనుకున్న యెడల ఇన్ సర్వీస్ ఉత్తర్వులు ఆయా పరీక్షలు అవసరం అని ఎక్కడ విడుదల కాలేదు. మరియు ఆ పరీక్షల్లో ఉన్న సిలబస్ పూర్తిగా ఇన్ సర్వీస్ వారికి ఔట్ డేటెడ్ అవుతుంది. కనుక సిలబస్ ప్రక్షాళన చేసి పదోన్నతి నిమిత్తం అర్హత పరీక్షలు నిర్వహించాలి. అంత వరకు టెట్ అనేది మినహాయింపు ఇవ్వాలి.
లేదా 3 లేదా 5 సంవత్సరాల గడువు ఇస్తు Conditional Promotion కు అర్హత ఇవ్వాలి.
Mani kumar
ReplyDelete