హాల్దర్ నాగ్

అయ్యా ఢిల్లీ రావడానికి నావద్ద డబ్బులు లేవు. దయచేసి బహుమతిని పోస్టులో పంపండి. *హాల్ధర్ నాగ్*  పేరు ముందు ఇప్పటి వరకు ఎవ్వరూ శ్రీ పెట్టి పిలువలేదు.
      *మూడు జతల బట్టలు,  ఊడ తెగిన రబ్బరు చెప్పులు, ఒక కాడలు లేని కండ్లజోడు, జీవితంలో 732 రూపాయలు జమ చేసుకున్న గ్రామీణ భారతీయుడు పద్మశ్రీ పురస్కారం కొరకు ఎంపిక కాబడ్డాడు.* 
     వీరే కోస్లీ భాష  సుప్రసిద్ధ కవి, ఒడిస్సా రాష్ట్రానికి చెందిన హాల్ధార్ నాగ్. చెప్పుకోదగ్గ విషయమేమంటే వీరు ఇప్పటి వరకు రచించిన కవితలు, 20 మహాకావ్యాలు అన్ని వీరి నాలుక పై ఉంటాయి. ఇప్పుడు వీరి రచనా సంకలనం *హల్ధర్ గ్రంథావలీ-2* సంబల్పూర్ విశ్వవిద్యాలయంలో పాఠ్యఅంశము.
       సాదా-సీదా కట్టుబొట్టు, తెల్లని ధోవతి-బనీను ధరించే నాగ్ గారు చెప్పులు లేకుండానే తిరుగుతారు. ఇలాంటి వజ్రాన్ని కేంద్ర ప్రభుత్వం వెతికి పట్టుకుంది. 
      ఒడియా భాష జానపద కవి గురించి తెలుసుకుంటే  ప్రేరణతో ఉబ్బి-తబ్బిబ్బు అవుతారు. గ్రామీణ *దళిత కుటుంబంలో* జన్మించిన హాల్ధర్ 10వ ఏట  తల్లి-దండ్రులను కోల్పోయాడు. 3వ తరగతిలోనే చదువు ఆగిపోయింది. అనాధగా బతుకుతూ డాబా హోటళ్లలో ఎంగిలి ప్లేట్లు కడిగి ఆకలి తీర్చుకునేవారు. తర్వాత ఒక స్కూల్ లో వంట మనిషి పని దొరికింది. కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాంకు నుండి 1000 రూపాయలు అప్పు తీసుకొని కాపీలు-పెన్నులు-పెన్సిల్లు ఆమ్ముకోడానికి ఒక డబ్బా దుకాణం స్కూల్ ముందు పెట్టుకున్నారు. ఇది వారి ఆర్థిక స్థితి.
      వీరి సాహిత్య సేవల గురించి చెప్పుకుంటే 1995 కాలంలో స్థానిక ఒడియా భాష కోస్లీ లో
*రాం-శబరీ* పేరుతో కవిత్వాలు వ్రాసి-వ్రాసి ప్రజలకు వినిపించే వారు. భావయుక్త కవిత్వాలను ప్రజలు ఎంతో మెచ్చుకునే వారు. అలా ప్రసిద్ధి చెందిన హల్ధర్ నాగ్ గారు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా *పద్మశ్రీ పురస్కారం* సాదా-సీదా వేషధారణలో అందుకున్నారు.
       వీరు చదివింది మూడవ తరగతే!
అయినా వీరి రచనల పై విశ్వవిద్యాలయంలో 5 గురు విద్యార్థులు PHD చేస్తున్నారు.
    మీరు పుస్తకాల్లో ప్రకృతిని వెతుకుతారు.
పద్మశ్రీ గారు ప్రకృతిని నుండి పుస్తకాలు వెతికారు  🙏👍🙏

హిందీ నుండి తెలుగు అనువాదం.....

తెలంగాణ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్-1964 ప్రవర్తన నియమావళి.

ప్రతి ఉద్యోగి ఈ రూల్స్ కు లోబడి విధులు నిర్వహించాలి. వాటిలో కొన్ని....

రూల్-3A

👉🏿 ఏ ప్రభుత్వ ఉద్యోగి భారతదేశ సార్వభౌమత్వానికి సమగ్రతకు భంగం కలిగించే ఏ సంఘంలో సభ్యత్వం చేయరాదు.

రూల్-3B

👉🏿 ఏ ప్రభుత్వ ఉద్యోగి ఆ మర్యాదపూర్వకంగా ప్రవర్తించకూడదు.

రూల్-3C

👉🏿 ఏ పురుష ఉద్యోగి మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించరాదు.

రూల్-5

👉🏿 ఏ ప్రభుత్వ ఉద్యోగి భారతదేశ సార్వభౌమత్వానికి సమగ్రతకు భంగం కలిగించే ధర్నాలలో పాల్గొనకూడదు.

రూల్-6

👉🏿 ఏ ప్రభుత్వ ఉద్యోగి వారి కుటుంబ సభ్యులు ఎవరు నుండి బహుమతులు పొందరాదు.శంకుస్థాపనలు, రిబ్బన్ కటింగ్ వంటివి చేయరాదు.

రూల్-8

 *ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎలాంటి వ్యాపార లావాదేవీల్లో పాల్గొనకూడదు.* 

రూల్-12

👉🏿ఏ ప్రభుత్వ ఉద్యోగి తన ప్రభుత్వ విధులు మినహా మిగతా *ఏ ప్రైవేటు ఉద్యోగం ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదు.* 

రూల్-13

👉🏿ఏ ప్రభుత్వ ఉద్యోగి ముందస్తు అనుమతి లేకుండా సాంకేతిక, సాహిత్య, కళాత్మక ధోరణి లేని పుస్తకాలు ముద్రించరాదు.

రూల్-15

 *ఏ ప్రభుత్వ ఉద్యోగి పూర్తిగా గాని పాక్షికంగా గాని ఏ ప్రెస్ లో పనిచేయరాదు.* 

రూల్-16

👉🏿ముందస్తు అనుమతి లేకుండా రేడియో,టీవీలో పత్రికలలో ఎలాంటి ఆర్టికల్స్ గాని ప్రచురించకూడదు.

రూల్-17

 *ఏ ప్రభుత్వ ఉద్యోగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు గాని చర్యలు ను గాని విమర్శించరాదు.* 

👉🏿అయితే కేవలము ప్రభుత్వ ఉద్యోగులే పాల్గొన్న ప్రవేట్ సమావేశాల్లో గాని సంఘ సమావేశాల్లో గాని ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించవచ్చు.

రూల్-19

👉🏿ఏ ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ పార్టీలో సభ్యత్వం ఉండకూడదు.మరియు ఏ *రాజకీయ పార్టీ తరఫున ప్రచారము చేయకూడదు.* 

రూల్-20

 *ప్రభుత్వ ఉద్యోగి తన చర్యల ద్వారా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రకటనలు చేయరాదు.* 

రూల్-25

👉🏿ఏ ప్రభుత్వ ఉద్యోగి భార్య బ్రతికుండగా రెండో భార్యను చేసుకోరాదు.

రూల్-26

 *ఏ ప్రభుత్వ ఉద్యోగి మద్యం మత్తులో విధి నిర్వహణ చేయరాదు.* 
బహిరంగ మద్యo, మోతాదుకు మించిన మద్యం సేవించరాదు.

బ్యాంకు క్లర్కు కొలువు సాధిద్దాం!

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 6 వేలకు పైగా క్లర్కు పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 209, తెలంగాణలో 99 ఉద్యోగాల ఖాళీలు భర్తీకానున్నాయి. ఈ సంఖ్య మరింత పెరగొచ్ఛు నోటిఫికేషన్‌ విడుదల సమయంలో మొత్తం 11 బ్యాంకుల్లో నాలుగు బ్యాంకులు తమ ఖాళీల వివరాలను ఐబీపీఎస్‌కు తెలియజేయలేదు. మార్చి 31, 2023 వరకు ఖాళీల వివరాలను తెలిపే వీలుండటంతో ఆలోగా ఉండే పదవీ విరమణ.. తదితర కారణాలతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

బ్యాంకు క్లర్కు కొలువు సాధిద్దాం! వచ్చే ఏడాదిన్నరలో పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీచేసే ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాల్సిందిగా ప్రధాని ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఈమధ్య విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దానికి తగిన విధంగానే వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు ఖాళీల భర్తీకి సమాయత్తమవుతున్నాయి. స్టాఫ్‌సెలెక్షన్‌ కమిషన్‌ 70 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. రైల్వే, ఇతర శాఖల్లోని ఖాళీలను కూడా భర్తీ చేసే ప్రక్రియ మొదలు పెడుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలో రాబోతున్నాయి. ఐబీపీఎస్‌ ఇదివరకే ప్రకటించిన పరీక్షల క్యాలండర్‌ ప్రకారం త్వరలోనే పీవో, స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. ఎస్‌బీఐ నుంచి కూడా పీవో, క్లర్క్‌ నోటిఫికేషన్లు ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది.

గత ప్రశ్నపత్రాలు గమనిస్తే..

గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఏయే టాపిక్స్‌ నుంచి ఎన్నెన్ని ప్రశ్నలు వస్తున్నాయో...ఆ వెయిటేజి అర్థమవుతుంది. ఇంగ్లిష్‌ విభాగంలో గ్రామర్‌ ఆధార ప్రశ్నలు ఎక్కువ. ఉదాహరణకు జంబుల్డ్‌ సెంటెన్సెస్‌, ఎర్రర్‌ కరెక్షన్‌, ఫిల్లర్స్‌, రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ వర్డ్‌/ సెంటెన్స్‌, క్లోజ్‌ టెస్ట్‌ లాంటివి. ఇవి సాధించాలంటే గ్రామర్‌పై అవగాహన అవసరం. అయితే పాఠశాల స్థాయిలోనే అభ్యర్థులంతా ఇంగ్లిష్‌ గ్రామర్‌ నేర్చుకుని ఉంటారు. కాబట్టి వారికి దానిపై అవగాహన తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల పరీక్షలో వచ్చే ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేస్తూ సందేహమున్నప్పుడు సంబంధిత గ్రామర్‌ను చూసుకుంటే ఇంగ్లిష్‌ విభాగంలో ఎక్కువ ప్రశ్నలు సాధించవచ్ఛు అన్ని విభాగాల్లోని టాపిక్స్‌ని బాగా నేర్చుకుంటే ఆపై ప్రశ్నను వేగంగా సాధిచగలిగేలా వీలైనంత ప్రాక్టీస్‌ చేయాలి. సాధన చేస్తూ ఉంటేనే ప్రశ్నలను వేగంగా సాధించగలిగే మెలకువలు అర్థమవుతాయి.

బీఎస్‌ఐఆర్‌ పరీక్షలు.. ఒకటే సన్నద్ధత

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలైన బ్యాంకు, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, ఇన్సూరెన్స్‌, రైల్వే పరీక్షలు సబ్జెక్టుపరంగా, పరీక్ష విధాన పరంగా దాదాపు ఒకే విధంగా ఉంటాయి. పరీక్షలపరంగా ఉండే కొద్దిపాటి భేదాలను మినహాయిస్తే దాదాపు 70-80 శాతం ఒకేలా ఉంటాయి. కాబట్టి ఐబీపీఎస్‌ క్లర్క్‌ ప్రిపరేషన్‌ త్వరలో రాబోయే ఇతర బ్యాంకు పరీక్షలు, కేంద్ర ప్రభుత్వ పరీక్షలకు ఉపయుక్తం. బ్యాంకు పరీక్షలన్నీ ఒకేవిధంగా ఉంటాయి. ఈ ప్రిపరేషన్‌ వాటికీ సరిపోతుంది. ఇతర పరీక్షలకు వాటికి అదనంగా ఉండే సబ్జెక్టులపరంగా సన్నద్ధతలో మార్పులు చేసుకుంటే చాలు. అయితే ముందుగా ఐబీపీఎస్‌ క్లర్క్‌ పరీక్షకు పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలి.

ప్రిలిమినరీ పరీక్షను సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహిస్తారు. మెయిన్స్‌ పరీక్ష అక్టోబరులో ఉంటుంది. అంటే ప్రిలిమ్స్‌ పరీక్షకు కనీసం 60 రోజులు, మెయిన్స్‌కు 90 రోజుల సమయం ఉంటుంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు రెండింటిలోనూ ఉండే మొత్తం నాలుగు విభాగాల్లో.. మూడు రెండింటిలోనూ ఉమ్మడిగా ఉన్నాయి. కాబట్టి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండింటికీ కలిపే సన్నద్ధమవ్వాలి. ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ విభాగాలను హెచ్చు స్థాయిలోనే అధ్యయనం చేయాలి. మొదటిసారి రాసేవారు ముందుగా ఆప్టిట్యూడ్‌, రీజనింగుల్లోని టాపిక్స్‌ అన్నింటినీ బాగా నేర్చుకోవాలి. ఒక్కోదానిలో 10-15 టాపిక్స్‌ ఉంటాయి. ప్రతిరోజూ రెండింటిలో ఒక టాపిక్‌ను పూర్తిగా నేర్చుకోవాలి. పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు వచ్చే అంశాలను ముందుగా పూర్తిచేసి ఆ తర్వాత ఒక ప్రశ్న వచ్చే టాపిక్స్‌ నేర్చుకోవాలి. ఉదాహరణకు ఆప్టిట్యూడ్‌లో సింప్లిఫికేషన్స్‌ నుంచి కనీసం 10, నంబర్‌ సిరీస్‌ నుంచి 5, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ నుంచి 5, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి 5 ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని ముందుగా పూర్తిచేసుకుని ఆపై ఒక్కో ప్రశ్న వచ్చే అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌ నేర్చుకోవాలి. అదేవిధంగా రీజనింగ్‌లో సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్స్‌ టాపిక్స్‌ నుంచి 15-20 ప్రశ్నలు వస్తాయి. వీటిలోనే బ్లడ్‌ రిలేషన్స్‌తో కలిపి కొన్నిసార్లు ప్రశ్నలు వస్తాయి. ముందుగా వాటిని.. ఆ తర్వాత ఇతర టాపిక్స్‌ను నేర్చుకోవాలి.

మోడల్‌ టెస్ట్‌లు తప్పనిసరి

వీలైతే ప్రారంభం నుంచీ లేకపోతే టాపిక్స్‌ అన్నీ నేర్చుకున్న తర్వాత రోజూ తప్పనిసరిగా పరీక్షలోని పూర్తిస్థాయి మాదిరి ప్రశ్నపత్రం రాయాలి. ఆపై దాన్ని విశ్లేషిస్తే ప్రిపరేషన్‌ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మెరుగుపరుచుకోవాల్సిన టాపిక్స్‌/ విభాగాలను గుర్తించి తదనుగుణంగా సిద్ధమయ్యే అవకాశం కలుగుతుంది. నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలను సాధించగలుగుతున్నారో కూడా అర్థమై..ఆ సంఖ్యను పెంచేలా ప్రాక్టీస్‌లో మార్పులు చేసుకోవచ్చు.

కరెంట్‌ అఫైర్స్‌పై నోట్సు

ప్రారంభం నుంచే రోజూ వార్తాపత్రికను చదువుతూ అంతర్జాతీయ, జాతీయ, ఆర్థిక, బ్యాంకింగ్‌, సాంకేతికత మొదలైనవాటి ముఖ్య విషయాలను నోట్‌ చేసుకోవాలి. ప్రతివారం వాటన్నింటినీ తిరిగి చూసుకుంటే జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్‌ అయ్యే అవసరం ఉండదు. అయితే బ్యాంకింగ్‌ టర్మినాలజీ విషయాలు బాగా తెలుసుకోవాలి. దీంతోపాటే మెయిన్స్‌ పరీక్షలో రీజనింగ్‌ విభాగంలో ఉండే కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌లో కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా నేర్చుకోవాలి. పరీక్షలో దాని నుంచి ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయో గమనించి తదనుగుణంగా వాటిని నేర్చుకోవాలి. ఇవన్నీ కవరయ్యే విధంగా రోజూ తగిన సమయం కేటాయించుకుని చదవాలి. ఎంత సమయం చదివాం అని కాకుండా ఎంతమేర నేర్చుకున్నామనేది ముఖ్యం. ఐబీపీఎస్‌ క్లర్క్‌ పరీక్ష ప్రిపరేషన్‌ రాబోయే ఇతర పరీక్షలకూ ఉపయోగపడుతుంది.

నోటిఫికేషన్‌ వివరాలు

పోస్టుల సంఖ్య : 6035

విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు

(జనరల్‌ అభ్యర్థులకు) : 20-28 సంవత్సరాలు (01.07.22 నాటికి)

దరఖాస్తు ఫీజు : రూ. 175 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌) రూ.850 (ఇతరులు)

దరఖాస్తులకు చివరి తేది : 21.07.2022

పరీక్ష తేది : సెప్టెంబరు 2022-ప్రిలిమ్స్‌ అక్టోబరు 2022 - మెయిన్స్‌

వెబ్‌సైట్‌ : www.ibps.in

SSY: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతా గురించి సందేహాలా?.. సమాధానాలివిగో..!

సుకన్య స‌మృద్ధి యోజ‌న‌.. ఆడ‌పిల్ల‌ల భ‌విష్యత్‌ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం ఇది. 10 ఏళ్లలోపు వ‌య‌సున్న ఆడ‌పిల్ల‌ల త‌ల్లిదండ్రులు ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా త‌మ ఆడ‌పిల్ల‌ల‌ భవిష్య‌త్‌ (ఉన్న‌త చ‌దువులు, వివాహం) కోసం డ‌బ్బు స‌మ‌కూర్చుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం వార్షికంగా 7.60 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. కాబ‌ట్టి కాంపౌండింగ్ ప్ర‌భావంతో రిస్క్ లేకుండా ద్ర‌వ్యోల్బ‌ణానికి మించి రాబ‌డి పొంద‌వ‌చ్చు. ఈ ప‌థ‌కం గురించి పెట్టుబ‌డిదారుల‌కు త‌ర‌చూ వ‌చ్చే కొన్ని సందేహాల‌కు స‌మాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్ర‌శ్న‌..1: బాలిక పేరుపై ఎస్ఎస్‌వై ఖాతాను ఎవ‌రు తెర‌వచ్చు?
స‌మాధానం: 10 ఏళ్ల లోపు వ‌య‌సు గ‌ల బాలిక పేరుపై ఆమె త‌ల్లి లేదా తండ్రి లేదా చ‌ట్ట‌ప‌ర‌మైన గార్డియ‌న్ సుక‌న్య సమృద్ధి యోజ‌న ఖాతాను తెర‌వ‌చ్చు.

ప్ర‌శ్న‌..2: ఎస్ఎస్‌వై ఖాతాను ఎక్క‌డ తెరవాలి?

స‌మాధానం: మీ ద‌గ్గ‌ర‌లోని పోస్టాఫీసులో గానీ.. అధీకృత బ్యాంకులో గానీ తెర‌వ‌చ్చు.

ప్ర‌శ్న‌..3: భార‌త్‌లో ఎక్క‌డైనా ఎస్ఎస్‌వై ఖాతాను తెర‌వ‌చ్చా?

స‌మాధానం: తెర‌వ‌చ్చు. సుక‌న్య స‌మృద్ధి యోజ‌న కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కం. అందువ‌ల్ల ఇది భార‌త్‌లోని ప్ర‌తీ రాష్ట్రం, కేంద్ర‌పాలిత ప్రాంతంలో అందుబాటులో ఉంది. 

ప్ర‌శ్న‌..4: ఎస్ఎస్‌వై ఖాతా కాల‌ప‌రిమితి ఎంత‌?
స‌మాధానం: ఎస్ఎస్‌వై ఖాతాకు 21 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ పిరియ‌డ్ ఉంటుంది. అంటే, పాప‌కు 8 ఏళ్ల వ‌య‌సున్న‌ప్పుడు ఖాతాను ప్రారంభిస్తే 29 ఏళ్ల‌కు ఖాతా మెచ్యూర్ అవుతుంది.

ప్ర‌శ్న‌..5: ఎస్ఎస్‌వై ఖాతాలో మెచ్యూరిటీ వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టాలా?

స‌మాధానం: ఎస్ఎస్‌వై ఖాతాకు 21 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ పిరియ‌డ్ ఉన్న‌ప్ప‌టికీ, ఖాతా తెరిచిన నాటి నుంచి 15 సంవ‌త్స‌రాల పాటు పెట్టుబ‌డులు పెడితే స‌రిపోతుంది.

ప్ర‌శ్న‌..6: మెచ్యూరిటీకి ముందే ఎస్ఎస్‌వై నుంచి డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చా?

స‌మాధానం: లేదు. కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో త‌ప్ప.. పాప‌కు 18 సంవ‌త్స‌రాలు నిండ‌క ముందు, ముంద‌స్తు విత్‌డ్రాల‌ను అనుమితించ‌రు. బాలికకు 18 సంవ‌త్స‌రాలు నిండిన త‌ర్వాత ఉన్న‌త‌ విద్య‌, వివాహం వంటి కారణాల‌తో 50 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

ప్ర‌శ్న‌..7: ఏయే సంద‌ర్భాల్లో ఖాతాను పూర్తిగా మూసివేయ‌వ‌చ్చు?

స‌మాధానం: ఈ కింది సంద‌ర్భాల్లో ఖాతా తెరిచిన 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఖాతాను పూర్తిగా మూసివేయ‌వ‌చ్చు
* ఏదైనా అనుకోని కారణాల చేత ఖాతాదారు మరణిస్తే వెంటనే మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఖాతాను మూసివేయవచ్చు.
* ఖాతాదారు ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డిన‌ప్పుడు
* ఖాతా నిర్వ‌హిస్తున్న గార్డియ‌న్ మ‌ర‌ణించిన‌ప్పుడు
పై సంద‌ర్భాల్లో ఖాతాను మూసివేయాల‌నుకుంటే.. ద‌ర‌ఖాస్తు ఫారంతో పాటు, పాస్‌బుక్‌, ఇత‌ర కావాల్సిన అన్ని ప‌త్రాల‌ను ఖాతా ఉన్న పోస్టాఫీసు/బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది.  

    ఖాతాదారులకి 18 సంవత్సరాల వయస్సు పూర్తై, ఆమెకు వివాహం జరిగినట్లయితే ముందస్తు మూసివేతకు అవకాశం ఉంటుంది. వివాహానికి ఒక నెల ముందు లేదా మూడు నెలల తర్వాత ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. 21 ఏళ్లు వచ్చాక ఖాతాను పూర్తిగా ముగించవచ్చు.

ప్ర‌శ్న‌..8: ఒక వ్య‌క్తి ఎన్ని ఎస్ఎస్‌వై ఖాతాలు తెర‌వ‌చ్చు?
స‌మాధానం: ఒక ఆడ‌పిల్ల పేరుపై ఒక ఖాతాను తెరిచే వీలుంది. కాబ‌ట్టి, ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు ఉన్న‌వారు వారి ఇద్ద‌రి పిల్ల‌ల పేరుపై ఒక్కో ఖాతా చొప్పున రెండు ఖాతాలు తెర‌వ‌చ్చు. ఒక‌వేళ మొద‌టి సంతానం ఆడ‌పిల్ల అయివుండి రెండోసారి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు (క‌వ‌ల‌లుగా) జ‌న్మించిన‌ట్ల‌యితే అప్పుడు మూడో ఖాతాను కూడా తెర‌వ‌చ్చు.

ప్ర‌శ్న‌..9: పాప పేరుతో ఎస్ఎస్‌వై ఖాతా ప్రారంభించిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే?
స‌మాధానం: ఒక‌వేళ పాప పేరుతో ఎస్ఎస్‌వైలో పెట్టుబ‌డి పెడ‌తున్న వ్య‌క్తి (త‌ల్లి లేదా తండ్రి లేదా చ‌ట్ట‌ప‌ర‌మైన గార్డియ‌న్) మ‌ర‌ణిస్తే ఖాతాను మూసివేయ‌వ‌చ్చు. లేదా పాప కుటుంబంలోని వేరొక వ్య‌క్తి ఖాతా భాద్య‌త తీసుకోవ‌చ్చు. లేదా ఖాతాలో అప్ప‌టి వ‌ర‌కు జ‌మైన మొత్తంతో పాప‌కు 21 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు ఖాతా కొనసాగించ‌వ‌చ్చు. ఖాతాను కొన‌సాగించినంత‌కాలం ఖాతాలో జ‌మైన మొత్తంపై వ‌డ్డీ వ‌స్తుంది.

ప్ర‌శ్న‌..10: సాధార‌ణ బ్యాంకు ఖాతాను ఎస్ఎస్‌వై ఖాతాగా మార్చుకోవ‌చ్చా?
స‌మాధానం: లేదు. ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్ అందుబాటులో లేదు. సుక‌న్య స‌మృద్ధి యోజ‌న అనేది ఆడ‌పిల్ల‌ల ఆర్థిక స్థితిని పెంపొందించే ల‌క్ష్యంతో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ప‌థ‌కం. అందువ‌ల్ల దీన్ని ప్ర‌త్యేకంగా తెర‌వాల్సి ఉంటుంది.

ప్ర‌శ్న‌..11: ఖాతాను ఒక‌ చోటి నుంచి మ‌రొక చోటుకు బ‌దిలీ చేసుకోవ‌చ్చా?
స‌మాధానం: ఒక ప్రాంతం నుంచి మ‌రొక ప్రాంతానికి బ‌దిలీ చేసుకోవ‌చ్చు. పోస్టాఫీసులో ఒక బ్రాంచి నుంచి మ‌రొక బ్రాంచికి గానీ, పోస్టాఫీసు నుంచి అధీకృత బ్యాంకుకు గానీ, బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు గానీ, ఒక‌ బ్యాంకు నుంచి మ‌రొక బ్యాంకుకు గానీ బ‌దిలీ చేసుకోవ‌చ్చు. బాలిక‌లు వారి చ‌దువుల కోసం లేదా ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఒక చోటి నుంచి మ‌రొక చోటికి మారే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి ఈ ఫీచ‌ర్‌ను అందుబాటులో ఉంచారు.

ప్ర‌శ్న‌..12: ఖాతా పెట్టుబ‌డులు పెట్టేందుకు క‌నిష్ఠ‌, గ‌రిష్ఠ ప‌రిమితులు ఎంత‌?
స‌మాధానం: ఎస్ఎస్‌వై ఖాతాలో ఖాతా నిర్వ‌హ‌ణ కోసం ఏడాదికి కనీసం రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గ‌రిష్ఠంగా రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

ప్ర‌శ్న‌..13: పెట్టుబ‌డి మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయాలా?
స‌మాధానం: ఎస్ఎస్‌వై ఖాతాలో ఒక ఏడాదికి అనుమితించిన గరిష్ఠ ప‌రిమితుల‌కు లోబ‌డి ఎన్ని సార్లైనా డ‌బ్బు డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

ప్ర‌శ్న‌..14: గ‌రిష్ఠ ప‌రిమితి మించి డిపాజిట్ చేయ‌వ‌చ్చా?ఒక‌వేళ చేస్తే ఆ మొత్తంపై వ‌డ్డీ వ‌ర్తిస్తుందా?
స‌మాధానం: ఎస్ఎస్‌వై ఖాతాలో అనుమితించిన గ‌రిష్ఠ ప‌రిమితిని మించి డిపాజిట్ చేసినా.. అద‌న‌పు మొత్తంపై వ‌డ్డీ వ‌ర్తించ‌దు. అలాగే, అద‌న‌పు మొత్తంపై ప‌న్ను ప్ర‌యోజ‌నాలు వ‌ర్తించ‌వు.

ప్ర‌శ్న‌..15: క‌నీస మొత్తాన్ని డిపాజిట్ చేయ‌క‌పోతే..?
స‌మాధానం: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతాలో ఏడాదికి క‌నీసం రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయడంలో విఫ‌లం అయితే రూ.50 జ‌రిమానా విధిస్తారు. 

ప్ర‌శ్న‌..16: ఎస్ఎస్‌వై ఖాతా నుంచి రుణం తీసుకోవ‌చ్చా?
స‌మాధానం: లేదు. సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతాలో జ‌మ చేసిన మొత్తం నుంచి రుణం తీసుకునే వెసులుబాటు లేదు. 

ప్ర‌శ్న‌..17: ఎన్నారైలు ఎస్ఎస్‌వై ఖాతాను తెర‌వ‌చ్చా?
స‌మాధానం: ఎన్నారైలు భార‌త‌దేశం వెలుప‌ల నివ‌సిస్తున్నంత వ‌ర‌కు ఎస్ఎస్‌వై ఖాతా తెరిచేందుకు వీలుండ‌దు. ఒక‌సారి భార‌త‌దేశం వ‌చ్చి స్థిర‌ప‌డిన త‌ర్వాత ఖాతాను తెర‌వ‌చ్చు. 

ప్ర‌శ్న‌..18: ఇప్ప‌టికే ఎస్ఎస్‌వై ఖాతా ఉన్న‌వారు విదేశాలకు వెళ్లిన త‌ర్వాత ఖాతా కొన‌సాగించ‌వచ్చా?
స‌మాధానం: బాలిక‌కు భార‌తీయ పౌర‌స‌త్వం ఉన్నంత‌వ‌ర‌కు ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు. ఎన్నారైగా మారితే ఖాతాను ర‌ద్దు చేస్తారు.

ప్ర‌శ్న‌..19: ఎస్ఎస్‌వై ఖాతాపై ఎంత వ‌రకు ప‌న్ను ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది?
స‌మాధానం: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తంపై సెక్ష‌న్ 80సి కింద ఏడాదికి రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు. 

ప్ర‌శ్న‌..20: సుక‌న్య స‌మృద్ధి ఖాతా నుంచి వ‌చ్చే వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తిస్తుందా?
స‌మాధానం: ఎస్ఎస్‌వై ఖాతాపై 'ఈఈఈ' ప‌న్ను ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. ఖాతాలో పెట్టుబ‌డి పెట్టిన మొత్తం, ఆర్జించిన వ‌డ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది.

తల్లిదండ్రులు.......

‘‘ఏమండీ, రాత్రి మామయ్యగారు ఫోన్‌ చేశారు- మీరెప్పుడొస్తారని. 

మీరేమో నా సెల్‌ నంబరు ఇచ్చారు. వాళ్ళు నాకే చేస్తున్నారు. మీ నంబరివ్వచ్చు కదా’’ 

హాల్లో కూర్చుని పేపర్‌ చదువుతున్న మాధవ దగ్గరకు కాఫీ తీసుకుని వస్తూ అంది రజని.

ఆమె దగ్గర నుండి కప్పు అందుకుని మళ్ళీ పేపర్‌లో తల దూర్చిన భర్తతో ‘‘ఏంటండీ, ఏం మాట్లాడరు... ఏమాలోచించారు, 

వాళ్ళ విషయం గురించి. ఇలా మీరేమీ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజూ ఫోన్‌ చేస్తూనే ఉంటారు. 

వూరికే నాన్చక ఏదో ఒకటి తేల్చండి’’ అంది.

ఇవాళ ఆదివారం. ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని బాగా ప్రిపేరయి ఉంది తను. 

పేపర్‌లో నుంచి తల పైకెత్తి ‘‘ఇందులో తేల్చేదేముందోయ్‌, అమ్మా నాన్నా ‘ఇక ఆ పల్లెటూళ్ళొ ఒంటరిగా ఉండలేం, ఇక్కడకు వచ్చేస్తా’మంటున్నారు, 

అంతేకదా! పెద్ద వయసయ్యాక కొడుకు దగ్గరే కదా ఉండాలి. 

వాళ్ళేదో అడగకూడని విషయమేదో అడిగినట్లు మాట్లాడతావేంటీ’’ అన్నాడు.

అతని మాటలు విని అక్కడే సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న పిల్లలు ‘

‘ఏంటీ, తాతయ్య, నానమ్మ ఇక్కడకే వచ్చేస్తున్నారా, భలేభలే! 

తాతయ్య కథలు చాలా బాగా చెపుతాడు. 

నానమ్మయితే మాకు స్నానం చేయిస్తుంది, అన్నం తినిపిస్తుంది. 

ఇంక రోజూ మేం తాతయ్యా నానమ్మ దగ్గరే పడుకుంటాం. తొందరగా రమ్మనండి డాడీ’’ అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

పిల్లలు కూడా అలా అనటంతో కోపం వచ్చింది రజనికి. ‘‘చాల్లే నోరు ముయ్యండి, వాళ్ళ దగ్గరైతే మీ వేషాలన్నీ సాగుతాయని మీ సంతోషం’’ అని భర్త వైపు తిరిగి, 

‘‘ఏంటండీ రానిచ్చేది, ఇక్కడ మనమెలా ఉంటున్నాం, మీ అమ్మా నాన్నా ఎలా ఉంటారు?

 ఆ పల్లెటూరి మాటలూ, చేతలూ ఎలా ఉంటాయో మీకు తెలుసుగా! మనింటికి పెద్దపెద్ద వాళ్ళందరూ వస్తారు. 

వాళ్ళు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు. పోయినసారి మనింట్లో ఫంక్షన్‌కి వచ్చినప్పుడు మీ అమ్మని చూసి మీ మేనేజరుగారి భార్య ఏమందో తెలుసా... ‘

ఈవిడ మీ అత్తగారా! నేను మీ వంటమనిషనుకున్నాను’ అంది. 

నాకు తల కొట్టేసినట్లయింది. కావాలంటే ఆ పల్లెటూళ్ళొనే ఉండమనండి. 

కావాల్సినంతమంది పనివాళ్ళని పెడదాం. లేదూ ఇక్కడికే వస్తామంటే ఏ ఓల్డేజ్‌హోమ్‌లోనైనా చేర్పించండి. 

డబ్బెంతైనా కట్టగల స్తోమత మనకుందిగా. అంతేకానీ, ఇక్కడకు మాత్రం తీసుకొస్తానని అనకండి’’ అంది.

ఆమె మాటలు పూర్తి అయ్యీ కాకముందే ‘‘ఇక ఆపుతావా నీ గోల. 

ఏంటీ, మాట్లాడితే మా అమ్మానాన్నలను పల్లెటూరివాళ్ళంటావు. అలాగైతే నేనూ పల్లెటూరివాణ్ణేగా,

 నువ్వు మాత్రం పల్లెటూరిదానివి కాదా? కాకపోతే సిటీలో మీ బాబాయి ఉండటంతో నువ్వూ మీ అన్నా అక్కడ చదువు వెలగబెట్టారు. 

మీ అమ్మానాన్నా పల్లెటూరివాళ్ళు కాదా? మన పెళ్ళప్పుడు వాళ్ళుమాత్రం ఎలా ఉన్నారు? 

మీ అన్నయ్యకు ఉద్యోగమొచ్చి పెళ్ళయ్యాక వాళ్ళని తనతో తీసుకెళ్ళటంతో కొంచెం సిటీలైఫ్‌ వాళ్ళకి అలవాటైంది.

 నేనే ఇన్ని రోజులూ అశ్రద్ధ చేశాను. మావాళ్ళని కూడా అప్పుడే తెచ్చుంటే బాగానే ఉండేది. మా అమ్మేదో మొహమాటానికి ‘ఇప్పుడే మీ దగ్గరకెందుకులేరా! రేపు చేసుకోగలిగే ఓపిక లేనిరోజున ఎలాగూ మీ దగ్గరికే రావాలిగా’ అన్నదని, ‘

ఔను అత్తయ్యగారూ, మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు- తొందరేముందీ! పైగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఉండే మీరు, ఆ సిటీలో ఇరుకు అద్దె ఇళ్ళలో ఉండలేరు. 

మీ అబ్బాయి ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నారు కూడా! మన సొంతిల్లయితే ఏ సమస్య రాదు అంటూ వాళ్ళను నువ్వే రానీకుండా అడ్డుపుల్ల వేశావు. 

ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండి వస్తామంటుంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు. 

ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఒక గదిలో ఉంటే నీకేమైనా అడ్డమా! 

అన్నిటికీ పనివాళ్ళు ఉన్నారు. నువ్వేదో వాళ్ళకి బండచాకిరి చేయాలన్నట్లు మాట్లాడుతున్నావు. 

పైగా ఓల్డేజ్‌హోమ్‌లో చేర్చమని ఉచిత సలహాలు ఇస్తున్నావా? నేను వాళ్ళ కన్నకొడుకును. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి, ఉంటారు కూడా అంతే. 

రేపు ముసలిదానివయ్యాక నువ్వు ఉందువుగానీలే ఓల్డేజ్‌హోమ్‌లో’’ అంటూ లేచి వెళ్ళి షర్ట్‌ వేసుకుని బయటికెళ్ళిపోయాడు కోపంగా.

భర్త తన మాట కాదనటంతో ఏం చేయాలో అర్థంకాలేదామెకి. 

ఇక ఏ విధంగా చెప్పినా అతన్ని మార్చటం కుదరదని తేలిపోయింది. 

పైగా పిల్లలు కూడా తండ్రినే సపోర్ట్‌ చేయటంతో తన మాటనెలా నెగ్గించుకోవాలో తోచలేదు. 

అత్తగారూ, మామగారూ మంచివాళ్ళే కానీ, కలిసుంటే తప్పక తేడాలొస్తాయనీ తగవులౌతాయనీ భయం. 

తన క్లోజ్‌ఫ్రెండ్‌ సుభద్ర అలా జరిగే, గొడవలు తీవ్రమై ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ భయమింకా బలపడింది. 

చివరికి పల్లెటూరివాళ్ళని ఏదో వంక చెప్పి వాళ్ళను రాకుండా చేద్దామన్నా కుదరలేదు.

పైగా భర్తకి కూడా అమ్మానాన్నలంటే ఒకింత ప్రేమ ఎక్కువే. 

కొడుకు ఇల్లు కట్టేటప్పుడూ ఇతరత్రా అవసరాలపుడూ అతను అడగకుండానే డబ్బులూ బంగారం అంతా ఇచ్చేశారు. 

అప్పుడప్పుడూ వచ్చి నాల్రోజులుండి వెళ్ళేవాళ్ళు. ఇక ఇప్పుడు పూర్తిగా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. 

ఆలోచించుకుంటూనే వంట ప్రయత్నంలో పడింది. మధ్యాహ్నం భోజనాల దగ్గర కానీ రాత్రికి కానీ ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. 

తెల్లారిపొద్దున లేచి తయారవుతున్న భర్తను ‘ఎక్కడికి’ అని అడుగుదామనిపించి కూడా అహం అడ్డొచ్చి ‘ఆయనే చెపుతార్లే’ అనుకుని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది.

కాఫీ అందుకుని ‘‘రజనీ, నేను వీరాపురం వెళ్తున్నాను. పొలం కౌలు, ఇంటి గురించీ మాట్లాడి అన్నీ సర్దుకుని అమ్మానాన్నలను తీసుకుని సాయంత్రానికల్లా వస్తాను’’ అంటూ, ఆమె సమాధానం చెప్పేలోపునే కారు దగ్గరకెళ్ళిపోయాడు.

ఆమెకు అతన్ని ఆపలేకపోయానని ఉక్రోషం ఎక్కువై దుఃఖంగా మారింది. 

కాసేపటికి తన బాధనెవరితోనైనా పంచుకోవాలనిపించింది. 

వెంటనే సెల్‌ తీసుకుని అన్నకు ఫోన్‌ చేసింది. ఆమె అన్న వినోద్‌ నాలుగైదు సిటీలలో జాబ్‌ చేసి, చివరికి ఢిల్లీలో స్థిరపడ్డాడు. 

వెళ్ళి సంవత్సరమైంది. పెద్ద ఇంజినీర్‌గా బాగా సంపాదిస్తున్నాడు. తమని రమ్మని చాలాసార్లు ఫోన్‌ చేశాడు కానీ వెళ్ళటానికి కుదరలేదు. 

అమ్మానాన్నలను చూడటానికైనా ఈ సమ్మర్‌లో వెళ్ళాలని అనుకుంటోంది. ఫోన్‌ రింగ్‌ మొత్తం అయిపోయింది- వినోద్‌ ఫోన్‌ తీయలేదు. 

అమ్మావాళ్ళకి చేద్దామంటే వాళ్ళకి ఫోన్‌ లేదు. అన్నయ్య ఫోన్‌లోనుండే మాట్లాడతారు. ‘ఒక ఫోన్‌ తీసుకోవచ్చు కదమ్మా’ అంటే, ‘అదంతా మాకు తెలియదమ్మా. ఇక్కడ అంతా హిందీ కదా... అన్నయ్య ఉన్నాడుగా అంటుంది.’

ఇంతలో ఫోన్‌ మోగింది. చూస్తే అన్నయ్యే! ఫోనెత్తగానే ‘‘రజనీ, నేను వేరేచోట మీటింగ్‌లో ఉన్నారా. 

సాయంత్రం నేనే ఫోన్‌ చేస్తాను. ఉంటాను’’ అంటూ హడావుడిగా పెట్టేశాడు. 

‘అయ్యో, అన్నయ్యతో మాట్లాడటానికి కూడా కుదరలేదే’ అని నిట్టూరుస్తూ పిల్లల్ని స్కూలుకి తయారుచేయటానికి లేచింది.

సాయంత్రమయింది. పిల్లలు స్కూలు నుంచి వచ్చాక, వాళ్ళకి స్నాక్స్‌ పెట్టి, పాలు ఇచ్చి, టీవీ దగ్గర కూర్చుంది. 

రాత్రి ఎనిమిది గంటలైంది. మాధవవాళ్ళు వచ్చేసరికి ఎదురెళ్ళి అత్తగారి చేతిలోని బ్యాగు తీసుకుని ‘‘బాగున్నారా అత్తయ్యగారూ, ఆరోగ్యం బాగుందా మామయ్యగారూ’’ అంది రజని- తన మనసులోని భావం ముఖంలో కనపడనీయకుండా.

పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి ‘‘తాతయ్యా, నానమ్మా’’ అంటూ వాళ్ళని వాటేసుకున్నారు.

అమ్మా నాన్నా వచ్చినపుడు భార్య ‘ఏ మూడ్‌లో, ఎలా ఉంటుందో’ అని భయపడుతున్న మాధవ తేలికగా వూపిరి పీల్చుకున్నాడు. స్నానం చేసి వస్తానని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాడు.

అత్తమామలకు వాళ్ళ రూమ్‌ చూపించి బాత్‌రూమ్‌లో గీజర్‌ ఆన్‌ చేసింది. ‘‘అత్తయ్యగారూ, మీరూ మామయ్యగారూ స్నానం చేసి రండి. ఈలోపు నేను భోజనాలు రెడీ చెస్తాను’’ అంది.

‘‘అలాగేనమ్మా. మేము వస్తాములే, నువ్వెళ్ళి పనిచూసుకో’’ అంది మాధవ తల్లి సీతమ్మ.

అందరూ మాట్లాడుకుంటూ భోంచేసి, పడుకునేసరికి పదకొండయింది.

తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కాలింగ్‌బెల్‌ అదే పనిగా మోగుతోంది.

 ‘ఈ టైములో ఎవరై ఉంటారబ్బా’ అనుకుంటూ నిద్రకళ్ళతో వచ్చి తలుపు తీసింది.

ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే, ఆమె నిద్రమత్తంతా ఎగిరిపోయింది. 

ఆమె వెనుకే వచ్చిన మాధవ ఆశ్చర్యపోయినా ‘‘బాగున్నారా మామయ్యగారూ, అత్తయ్యగారూ’’ అంటూ వారిని పలకరించి, ‘‘ముందు లోపలికి రండి, చలిగా ఉంది’’ అని, ‘‘ఏంటలాగే నిలబడిపోయావు రజనీ, ముందు త్వరగా వెళ్ళి మీ అమ్మకీ నాన్నగారికీ కాఫీ కలిపి తీసుకురా త్వరగా’’ అన్నాడు.

‘‘రా అమ్మా, రండి నాన్నా’’ అంటూ వాళ్ళ దగ్గర బ్యాగులు తీసుకుని పక్కనపెట్టి, తలుపులు మూసి కిచెన్‌లోకి వెళ్ళింది. 

పెందలాడే లేచే అలవాటున్న మాధవ తల్లిదండ్రులు కూడా కాలింగ్‌బెల్‌ మోతకి లేచి హాల్లోకి వచ్చారు.

అందరి పలకరింపులయ్యేసరికి రజని అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది.

‘వీళ్ళేంటి ఇంత సడెన్‌గా వచ్చారు. మా అమ్మా నాన్నా విషయం గురించి ఏమైనా మాట్లాడటానికి రజనీనే ఫోన్‌చేసి పిలిపించి ఉంటుందా?’- 

అని ఒక నిమిషం సందేహపడ్డాడు మాధవ. 

కానీ ఆమె ముఖం చూస్తే ఆమెకు కూడా వాళ్ళ రాక గురించి తెలియదని అర్థమైంది. 

మౌనంగా కాఫీ తాగుతున్న అత్తమామలను గమనించాడు. కొంచెం తేడాగా కనిపించారతనికి.

ఇదివరకున్న సంతోషం, కళా, కాంతి వాళ్ళ ముఖాల్లో కనిపించటంలేదు. అతనికన్నా ముందుగానే, తల్లిదండ్రులను చూసిన మరునిమిషంలోనే వాళ్ళ ముఖాల్లోని తేడాని గమనించేసింది రజని. 
ఎంతైనా కూతురు గదా!

‘‘వదినగారూ, అంత దూరంనుండి మీ ఇద్దరే వచ్చారా!’’ అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ.

‘‘లేదొదినగారూ, మాతో వినోద్‌ వచ్చాడు. వాడికి బెంగళూరులో ఏవో మీటింగులు ఉన్నాయట. వెళ్తున్నానన్నాడు. 

‘మేమూ వస్తాంరా, అమ్మాయి దగ్గరికి’ అంటే తీసుకొచ్చాడు. మమ్మల్ని ఆటో ఎక్కించి, వాడు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాడు’’ అంది.

‘‘అన్నయ్య వచ్చాడా... అయితే ఇక్కడకి రాడటనా?’’ కోపంగా అంది రజని.

‘‘లేదమ్మా, ఎల్లుండి వస్తాడు. ఆరోజు రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతాం ముగ్గురమూ’’ అంది రజని తల్లి సావిత్రమ్మ.

‘‘అదేంటమ్మా, అంత దూరం నుండి వచ్చి ఒక్క పదిరోజులైనా ఉండకుండా ఎలా వెళ్తారు? మళ్ళీ మీరెప్పుడో వస్తారు. అదేం కుదరదు, అన్నయ్యను రానీ, నేనడుగుతాను’’ అంది.

‘‘వద్దమ్మా, అడగొద్దు. అన్నయ్య తోడు లేకుండా మేం ఒక్కళ్ళమూ మళ్ళీ అంత దూరం వెళ్ళలేంగా... అందుకని వెళతాంలే’’ అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి, ఏదో జరిగిందని అర్థమైంది రజనీకి.

మాధవ, పిల్లలు వెళ్ళిపోయాక తల్లితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది.

అందరూ వెళ్ళిపోయాక తల్లి గదిలోకి వెళ్ళింది. అక్కడే అత్తమామలు కూడా ఉండేసరికి, కాసేపు మాట్లాడి వచ్చేసింది.

ఇక మధ్యాహ్నం భోజనాలప్పుడూ తరవాత కూడా వాళ్ళ నలుగురూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇలా రాత్రి వరకూ కుదరలేదు.

రాత్రి భోజనాలయిన తరవాత మాధవ, పిల్లలు- అత్తమామల గదిలోకెళ్ళారు. అప్పుడు తల్లిదండ్రుల గదిలోకెళ్ళింది.

తల్లి ఒక్కతే ఉంది. ‘‘నాన్న ఏరమ్మా?’’ అంది.

‘‘మీ అత్తయ్యగారి గదిలోకెళ్ళారమ్మా. అబ్బాయీ పిల్లలూ కూడా అక్కడే ఉన్నారుగా- మాట్లాడుతున్నారు.’’

సరే, నాన్న లేకపోయినా ఫరవాలేదులే అనుకుని ‘‘అమ్మా, నువ్వూ నాన్నా అలా ఉన్నారేంటి? 

ఉదయం నుండీ ఈ విషయం అడగాలని ఎంత తపనపడ్డా మాట్లాడటానికి కుదరలేదు. ఏం జరిగిందమ్మా, చెప్పవా’’ అంది.

కూతురలా అడిగేసరికి ఆ తల్లికి దుఃఖం ఆగలేదు. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు రజనీకి. తన కళ్ళవెంట నీళ్ళొచ్చేశాయి.

కొంతసేపటికి ‘‘ఏం చెప్పను తల్లీ, మీ వదిన చాలా మారిపోయింది ఢిల్లీ వెళ్ళాక. 

ఇప్పుడు, ఇన్నాళ్ళకి- మీ వదినకి మేమూ మా మాటలూ చేతలూ నచ్చటం లేదు. 

ఇంటికి పెద్దపెద్ద ఆఫీసర్లూ కలెక్టర్లూ వస్తారట. పార్టీలు జరుగుతాయట. 

వాళ్ళల్లో మేముంటే బాగోదట. ఏం చెప్పిందో, ఏం చేసిందో వాడిని కూడా మార్చేసింది.

 ఆరునెలలక్రితం మమ్మల్ని ఓల్డేజ్‌హోమ్‌లో చేర్పించారు. 
అప్పటి నుండి అక్కడే ఉంటున్నాం. నిన్ను చూడాలని ఉందని ఎప్పటినుంచో అడుగుతుంటే, 

ఇప్పుడు వాడు పనిమీద ఇటు వస్తూ మమ్మల్ని తీసుకొచ్చాడు. రేపు వెళ్ళేటపుడు ఢిల్లీలో దిగగానే మమ్మల్ని హోమ్‌లో వదిలేసి, 

వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ జన్మలో ఏ పాపం చేశామోనమ్మా, దేవుడు మా నుదుటన ఇలా రాశాడు. 

చూడమ్మా రజనీ, ఎంతో ఆశతో బిడ్డల్ని కనీ, 
మరెంతో ప్రేమతో వాళ్ళని పెంచీ పెద్దచేసి, చదివించి, 
వాళ్ళు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు. 
పెళ్ళిచేసి వాళ్ళ పిల్లా పాపలతో ఆడుకుంటూ, 
కొడుకు దగ్గరే కన్ను మూయాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులయినా. 

కానీ, కొడుక్కి పెళ్ళిచేసి, కొడుకుని కోడలి చేతికప్పగిస్తే వాడు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి, 

తమను నిరాదరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధా వేదనా ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుస్తుంది. 

వాళ్ళ దుఃఖాన్నెవరూ తీర్చలేరు.

 ‘మీరు మాకు వద్దు, మా దగ్గర ఉండద్దు, మా ఇంటికి రావద్దు’ అంటే మేమే కాదు, ఈ వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులయినా ఎలా తట్టుకోగలరు’’ 

అంటుంటే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది.

 ‘‘మీ అన్నలాగా డబ్బున్నవాళ్ళు వృద్ధాశ్రమాలలో పడేసి పోతున్నారు. 

డబ్బులేని వాళ్ళు ముసలివాళ్ళని వాళ్ళ ఖర్మానికి రోడ్లమీద వదిలేసి పోతున్నారు. 

పని చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఎలాగోలా పనిచేసుకుని బతుకీడుస్తున్నారు. 

పని చేయగలిగే శక్తి లేనివాళ్ళు పనిచేయలేక, 
తిండిలేక, 
అడుక్కోవటానికి ముఖం చెల్లక, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. 
ఇలా జరగటానికి కారణమేంటో తెలుసా తల్లీ! 

కొంతమంది, కొంతమందేంటి... చాలామంది కోడళ్ళు ‘అత్తమామలు కూడా తమ తల్లిదండ్రుల లాంటివారే కదా’ అని అనుకోకపోవటమే. 

అందుకే, ఇప్పుడు వృద్ధాశ్రమాలకి ఆదరణ ఎక్కువైంది. 

అక్కడ మేం బతికున్నాం అంటే, ఉన్నాం అంతే! 

మా మనసులెంత కుమిలిపోతున్నాయో నీ అన్నావదినలకు అక్కరలేదు. 

మాకు ఈ శిక్ష ఎందుకుపడిందో తెలీదు కానీ, 
మేమనుభవిస్తున్న ఈ వ్యధ ఇంకెవరికీ రాకూడదమ్మా’’ అంటూ, 

మళ్ళీ దుఃఖం ఉప్పెనలాగా ముంచుకురాగా కూతుర్ని కౌగిలించుకుని భోరుమంది ఆ తల్లి. 

తల్లి మాటలకు రజనీకి చెంపమీద ఛెళ్ళున చరిచినట్లనిపించింది అంత బాధలోనూ.

‘‘వూరుకోమ్మా, వూరుకో... అన్నయ్యిలా చేయడమేమిటి? వాడొచ్చాక నేను మాట్లాడతాను’’ అంది ఏడుస్తూ.

తల్లి బాధతో ఆమె హృదయం కోతకు గురైంది. 

దుఃఖం నుండి తేరుకున్న సావిత్రమ్మ, ‘‘మీ అత్తయ్యగారు వాళ్ళు రాత్రేనటగా వచ్చింది. 

వాడి పెంపకం విషయంలో మేమేదైనా పొరపాటు చేశామేమోగానీ, నీ విషయంలో మాకు చాలా తృప్తిగా ఉంది. 

నీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. మీరైనా ఆనందంగా ఉండండి, అది చాలు’’ అంది.

తల్లి మాటలకు గిల్టీగా ఫీలయింది రజని. 

ఇంకానయం, తను అన్నతోగానీ, తల్లితోగానీ మాట్లాడకపోవటమే మంచిదయిందనుకుంది. 

అంతలో మాధవ పిలవటంతో, ‘‘సరే, పడుకోండమ్మా, పొద్దుపోయింది’’ అంటూ వెళ్ళిపోయింది.

మూడోరోజు ఉదయం వినోద్‌ వచ్చాడు. అతను రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గటం గమనించింది. 

అన్నతో మాట్లాడాలన్నా అందరూ అతని చుట్టూ ఉన్నారు. సాయంత్రం వరకూ అలాగే జరిగిపోయింది.

సాయంత్రం అందరూ టీ తాగటం అయ్యాక, వినోద్‌- తల్లితో ‘‘అమ్మా, ఇక బయలుదేరుదాం. ఎనిమిది గంటలకు ట్రైన్‌ ఉంది’’ అన్నాడు.

అందరూ ఉన్నా అక్కడ ఒక క్షణం నిశ్శబ్దం ఆవరించింది.

అంతలో మాధవ గొంతు సవరించుకుని ‘‘చూడు వినోద్‌, ఇకనుండి 

అత్తయ్యగారూ మామయ్యగారూ మా ఇంట్లో, మా దగ్గరే ఉంటారు’’ అన్నాడు.

అతని మాటకు వినోద్‌, రజనీ, అత్తమామలూ విస్తుపోయి చూశారు. అది వాళ్ళకి వూహించని పరిణామం.

‘‘అదికాదు బావా!’’ అంటూ ఏదో చెప్పబోయాడు వినోద్‌.

‘‘ఇంకేం చెప్పకు, నీవక్కడకు తీసుకెళ్ళినా, హోమ్‌లోనే కదా వాళ్ళుండేది. 

ఇక్కడుంటే కూతురి దగ్గరున్నామన్న సంతోషమైనా ఉంటుంది వాళ్ళకి. 

ఇంటికి పెద్దదిక్కు ఎంత అవసరమో నీకు తెలీదు వినోద్‌. 

అమ్మానాన్నలంటే మనమెప్పటికీ తీర్చుకోలేని తీరని రుణం. 

పెద్దవారితో కలిసి ఉండాలి, 
వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి. 
అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి, సుఖం, సంతోషం ఉంటాయి. 

ఇలాంటి అభిప్రాయం మనమే మన పిల్లలకి కలిగించాలి. 

ఇప్పుడు నువ్వు మీ అమ్మానాన్నలని చేసినట్లే, రేపు నీ కొడుకులు నిన్ను చేయరా! 

దూరంగా ఉంచితే పెద్దవాళ్ళు పడే బాధ నీకప్పుడే అర్థంకాదులే. 

నేనేమీ కోపంగా చెప్పటం లేదు వినోద్‌. వాళ్ళిక్కడుంటే వాళ్ళకీ మనశ్శాంతిగా ఉంటుంది. 

మాకూ ఇంకో అమ్మానాన్నలకి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది. 

మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇక నువ్వేం ఆలోచించక బయల్దేరు’’ అన్నాడు.

వినోద్‌ తల దించుకుని వెళ్ళిపోయాడు.

మాధవ వైపు చూడటానికి ముఖం చెల్లలేదు రజనీకి. 

అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. 

గదిలోకి వెళ్ళటంతోనే మాధవ పాదాలమీద వాలిపోయింది రజని. 

‘‘ఏయ్‌ ఏంటిదీ, లే, లే...’’ అంటున్న అతనితో-

‘‘ఇన్నాళ్ళూ మీతో కలిసి కాపురంచేసి కూడా మీ మనసు అర్థంచేసుకోలేకపోయానండీ. 

అత్తయ్యా వాళ్ళవిషయంలో ఎంతో కఠినంగా మాట్లాడాను. 

నన్ను క్షమించండి. 

మీరెంతో పెద్ద మనసుతో మా అమ్మానాన్నలకు ఆశ్రయం ఇచ్చారు. 

మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను’’ అంది ఏడుస్తూ.

‘‘పిచ్చి రజనీ, నాకు మా అమ్మానాన్నా, మీ అమ్మానాన్నా వేరుకాదు. 

ఆరోజు మీ అమ్మ నీతో చెప్పినపుడే మీ నాన్నగారు మాకు చెప్పారు. 

అప్పుడే అమ్మానాన్నా నేనూ ఇలా నిర్ణయించుకున్నాం. 

నిన్ను సర్‌ప్రైజ్‌ చేద్దామని నీకు చెప్పలేదు. 

ఏదో చిరాకులో మాట్లాడతావుగానీ నీ మనసెలాంటిదో నాకు తెలీదా’’ అన్నాడు.

అతనికి తనపైగల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీలైంది. 

హాల్లోకొచ్చిన రజనీకి అత్తమామలు దేవతల్లాగా కనిపించారు. 

వెళ్ళి వాళ్ళ పాదాలకి దణ్ణం పెట్టుకుంది. తరవాత తల్లికీ తండ్రికీ కూడా.

‘‘ఇదేంటమ్మా, ఇప్పుడెందుకూ...’’ అని అడిగిన వాళ్ళకు, 

ఇవాళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని ‘ఈటీవీ శుభమస్తు’లో చెప్పారండీ’’ అంది.

‘మా కోడలెంత బంగారం’ అని అత్తమామలూ, ‘కూతురెంత పద్ధతికలదో’ అని తల్లిదండ్రులూ మురిసిపోతుంటే, 

గదిలోనుండి అది చూసిన మాధవ- రజని తెలివికి నవ్వుకున్నాడు..

@@@@@@@@@@@@@@@
 
ఇప్పుడు మనం ఏదయితే చేస్తామో అదే చివరకి మనకి జరుగుతోంది..

దయచేసి అర్థం చేసుకోగలరు.

మన ఉమ్మడి కుటుంబాలను మనం కాపాడుకుందాం..

మన పిల్లలకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తునిదాం....!!

🙏🙏ఓపికగా చదివి నందుకు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు....🙏🙏

ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల నిభందనలు ఇలా




ఇతర దేశాలకు వెళ్లినవారికి సెలవు మంజూరు సందర్భంగా ప్రిఫిక్స్, సఫిక్స్ అనుమతించరాదనే ప్రభుత్వ ఉత్తర్వులే లేవు. కేవలం అజ్ఞానంతోనే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిలో పలువురు డీఈఓలు సైతం ఉండడం మరీ దారుణం. ఎంఈఓలు, హైస్కూల్ హెడ్ మాస్టర్ లకు అవసరమైన సందర్భాలలో రూల్స్పై సూచనలిస్తూ గైడ్చే యాల్సిన డీఈఓలే తప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తే ఎలా? అయ్యా, ఆఫీసర్లూ! ఒక్కసారి టీఎస్ఎల్ఆర్-12 చదవండి. ఆ రూల్ తొమ్మిది లైన్లు మాత్రమే ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అర్థ వేతన సెలవులను (హెచ్పీఎల్), ఆర్జిత సెలవులను (ఈఎల్), అసాధారణ జీత నష్టపు సెలవులను (ఈఓఎల్ఎల్పీ) ఆకస్మికేతర సెలవులను (ఓసీఎల్) రెండు కారణాలతో మంజూరు చేస్తారు. అందులో మొదటిది వ్యక్తిగత అవసరాల కోసం కాగా, రెండవది మెడికల్ అవసరాల కోసం. ఆకస్మికేతర సెలవులకు ప్రిఫిక్స్, సఫిక్స్ నిబంధన వర్తిస్తుంది. ఉపాధ్యాయులు పని చేసేది వెకేషన్ డిపార్టుమెంటు కాబట్టి, వేసవి సెలవులను కలుపుకొని 180 రోజులు మించకుండా లీవ్ పెట్టిన ఉపాధ్యాయులకు విధిగా లీవ్ మంజూరు చేయాలి. ఈ మేరకు తెలంగాణ స్టేట్ లీవ్ రూల్స్- 1933(టీఎస్ఎల్ఆర్)లోని రూల్-12 చాలా స్పష్టంగా ఉంది. విద్యాశాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. టీచర్ల పిల్లలు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ తదితర దేశాలకు యేటా పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. తమ పిల్లలను చూసి రావడానికి మెజారిటీ టీచర్లు వేసవి సెలవులను కలుపుకొని, సమ్మర్కి ముందో, తర్వాతో తరచుగా విదేశాలకు వెళ్తున్నారు. విద్యా శాఖ కమిషనర్ వద్ద ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే విదేశాలకు వెళ్లి, నిర్దేశించిన గడువులోగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇలా వేసవి సెలవులను కలుపుకొని విదేశాలకు వెళ్లి, తిరిగి వచ్చిన టీచర్లకు సెలవు మంజూరులో కొంతమంది విద్యాశాఖాధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రిఫిక్స్, సఫిక్స్ అనుమతించాలి వేసవి సెలవులు కలుపుకొని 180 రోజులకు మించకుండా సెలవు పెట్టిన టీచర్లకు టీఎస్ఎల్ఆర్-12 ప్రకారం వేసవి సెలవులను విధిగా ప్రిఫిక్స్, సఫిక్స్ అనుమతించి మిగతా పీరియడ్కి మాత్రమే సెలవు మంజూరు చేయాలి. ఈ వెసులుబాటు లభించాలంటే, సదరు టీచర్లు విద్యా సంవత్సరం ముగింపు రోజు కానీ, పాఠశాలలు పునఃప్రారంభం
రోజు కానీ విధులకు హాజరైతే సరిపోతుంది. సమ్మర్ హాలిడేస్ లోనే విదేశాలకు వెళ్లి, హాలిడేస్ పూర్తి కాకముందే స్వదేశానికి తిరిగి వచ్చి, రీ ఓపెనింగ్ నాడు పాఠశాలకు హాజరయ్యే టీచర్లకు లీవ్ మంజూరే అవసరం లేదు. ఇలాంటి టీచర్లు విద్యాశాఖ కమిషనర్ నుంచి జస్ట్ పర్మిషన్ తీసుకుంటే చాలు. ఈ ఏడాది లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్
23 కాగా, రీ ఓపెనింగ్ డే జూన్ 13. ఏప్రిల్ 23 లేదా జూన్ 13 నాడు స్కూలుకి హాజరైన టీచర్లు, వేసవి సెలవులలో ఇండియాలో ఉన్నారా? లేక విదేశాలకు వెళ్లారా? అనే విషయంతో సంబంధం లేకుండా ప్రిఫిక్స్, సఫిక్స్ప ర్మిట్ చేయాలి. కానీ, కొందరు అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ టీచర్లను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. వేసవి సెలవులకు కూడా లీవ్ మంజూరు చేస్తామని అంటున్నారు. ఆ మేరకు దరఖాస్తు పెట్టుకోవాలని, లేదా
వేతనంలో కోత విధిస్తామని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కారణమేంటని అడిగితే, 'సదరు టీచర్ వేసవి సెలవులలో ఇండియాలోనే లేరు. విదేశాలకు వెళ్లి వచ్చినవారికి వేసవి సెలవులను ప్రిఫిక్స్, సఫిక్స్ ఎలా అనుమతిస్తాం? శాలరీ ఎలా చెల్లిస్తాం' అని అడ్డగోలు వాదనకు దిగుతున్నారు. ఇతర దేశాలకు వెళ్లినవారికి సెలవు మంజూరు సందర్భంగా ప్రిఫిక్స్, సఫిక్స్ అనుమతించరాదనే ప్రభుత్వ ఉత్తర్వులే లేవు. కేవలం అజ్ఞానంతోనే
అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిలో పలువురు డీఈఓలు సైతం ఉండడం మరీ దారుణం. ఎంఈఓలు, హైస్కూల్ హెడ్మాస్టర్లకు అవసరమైన సందర్భాలలో రూల్స్పై సూచనలిస్తూ గైడ్ చేయాల్సిన డీఈఓలే తప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తే ఎలా? అయ్యా, ఆఫీసర్లూ! ఒక్కసారి టీఎస్ఎల్ఎర్-12 చదవండి. ఆ రూల్ తొమ్మిది లైన్లు మాత్రమే ఉంది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి నిబంధనల ప్రకారం వేసవి సెలవులను ప్రిఫిక్స్, సఫిక్స్ అనుమతించకుండా నిరాకరించే అధికారులపై ముందుగా రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులతో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సైతం బాధిత టీచర్లు ఫిర్యాదు చేయాలి. దీంతో పాటు ఆర్టీఐ ద్వారా సెలవు మంజూరు అధికారికి ఏ ఉత్తర్వుల ప్రాతిపదికగా వేసవి సెలవులను ప్రిఫిక్స్, సఫిక్స్ చేయడం లేదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని లెటర్ పెట్టి సమాచారాన్ని లిఖితపూర్వకంగా తీసుకోవాలి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని కూడా ఇవ్వాలని కోరాలి. బాధితులలో మహిళా టీచర్లు ఉన్న పక్షంలో రాష్ట్ర మహిళా కమిషన్లో కూడా ఫిర్యాదు చేయాలి. ఈ ఫిర్యాదులు చేయడానికి ఒక్క పైసా ఖర్చు కాదు. అప్పటికీ న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్లడానికి సైతం వెనకాడొద్దు. ఎవరో ఒకరు తెగించి పూనుకోకపోతే, నిబంధనలు విస్మరించి, ఇష్టారాజ్యంగా వ్యవహరించే అధికారులు మారరు. సెలవుల మంజూరుకు అనుమతించకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, టీచర్లకు అన్యాయం చేస్తున్న విద్యాశాఖ అధికారులపై వచ్చే ఫిర్యాదులపై రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం సత్వరం స్పందించాలి. లీవ్ రూల్స్ లో ప్రభుత్వం పొందుపర్చిన వెసులుబాటు ఇవ్వడానికి నిరాకరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

ఆగ‌స్టు 1 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ఆగ‌స్టు 1 నుంచి నిర్వ‌హించనున్న‌రు. ఈ ప‌రీక్ష‌లు 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయి. ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు జులై 18వ తేదీ లోపు సంబంధిత పాఠ‌శాల‌ల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల టైం టేబుల్ ఇదే..

ఆగ‌స్టు 1 – ఫ‌స్ట్ లాంగ్వేజ్
ఆగ‌స్టు 2 – సెకండ్ లాంగ్వేజ్
ఆగ‌స్టు 3 – థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
ఆగ‌స్టు 4 – మ్యాథ‌మేటిక్స్
ఆగ‌స్టు 5 – జ‌న‌ర‌ల్ సైన్స్(ఫిజిక‌ల్ సైన్స్, బ‌యాల‌జీ)
ఆగ‌స్టు 6 – సోష‌ల్ స్ట‌డీస్
ఆగ‌స్టు 8 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1
ఆగ‌స్టు 10 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2

Telangana TET 2022 Results announced

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. జూన్ 12న జరిగిన టెట్ ఎగ్జామ్ కు టెట్ పేపర్ 1కు 3,18,506 మంది, పేపర్ 2కు 2,51,070 మంది హాజరయ్యారు. పేపర్ 1లో 32.68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. పేపర్ 2లో 49.64 శాతం మంది పాస్‌ అయ్యారు. పేపర్ 1లో 1,04.078 మంది అభ్యర్థులు.. పేపర్ 2లో 1, 24,535 అభ్యర్థులు పాస్ అయ్యారు.

ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ అధికారులు చెప్పిన సమయం దాటిన వెబ్ సైట్ మాత్రం ఓపెన్ కాలేదు. తర్వాత ఓపెన్ అయ్యింది. దీంతో కాసేపు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. టెట్ ఫలితాల విడుదలలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫలితాలను విద్యాశాఖ ఒకే వెబ్ సైట్ కు లింక్ చేసిందని.... గతంలో రెండు లేదా మూడు వెబ్ సైట్ లో ఫలితాలు విడుదల చేసేవారని వారు ఆరోపిస్తున్నారు. టెట్ లో ఎంత మంది క్వాలిఫై అయ్యారో కనీసం మీడియాకి కూడా సమాచారం ఇవ్వలేదని అభ్యర్థులు విద్యా శాఖపై విమర్శలు చేశారు.

sample

Candidates may check all the important aspects of the CTET Exam 2022 in the below-mentioned table.

CTET 2022 Notification PDF
Exam Name CTET (Central Teacher Eligibility Test)
Conducting Body CBSE
Application Mode Online
CTET Exam Mode Online
Official Website https://ctet.nic.in/
CTET Notification 2022

2022-23 పాఠశాల విద్యా క్యాలెండర్

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం (2022-23) మొత్తం 230 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం విద్యా క్యాలెండర్ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రోజూ స్కూల్ అసెంబ్లీకి ముందు లేదా తర్వాత తరగతి గదిలో విద్యార్థులకు 5
నిమిషాలపాటు యోగా, ధ్యానం నిర్వహించాలని ఆదేశించారు. ఈసారి 1-8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ప్రతివారం 'కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ 'ఇంగ్లిష్' పేరిట ఒక పిరియడ్ను నిర్వహిస్తారు. ఇందులో ఆంగ్ల పత్రికలు చదివించడం, కథలు చెప్పడం, కథల పుస్తకాలు చదవడం, డ్రామా, చిన్న నాటికలు వేయడం వంటి కార్యక్రమాలను అమలుచేస్తారు. రోజూ విద్యార్ధుల హాజరు 90 శాతానికిపైగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. వచ్చే జనవరి 10 నాటికి అన్ని తరగతులకు సిలబస్ పూర్తి చేస్తారు. 2020-21 జాతీయస్థాయి ఇన్స్పైర్ పోటీలు జులై / ఆగస్టులో జరుగుతాయి. 2021-22 సంవత్సరానికి సెప్టెంబరు/అక్టోబరులో జిల్లా స్థాయి, నవంబరు/డిసెంబరులో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు.

పరీక్షల కాలపట్టిక ఇదీ...

• ఫార్మేటివ్ అసెస్మెంట్-1: జులై 21 నాటికి పూర్తి
• ఎఫ్ఎ 2: సెప్టెంబరు 5వ తేదీలోపు
• సమ్మేటివ్ అసెస్మెంట్-1: నవంబరు 1 నుంచి 7వ తేదీ వరకు
• ఎఫ్ఎ3: డిసెంబరు 21 నాటికి పూర్తి
• ఎఫ్ 4: పదో తరగతికి 2023 జనవరి 31 నాటికి, మిగిలిన వాటికి ఫిబ్రవరి 28 నాటికి
• ఎస్ఏ-2 : 2023 ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ వరకు (1-9 తరగతులకు) పదో తరగతికి ప్రీ ఫైనల్ పరీక్షలు: 2023 ఫిబ్రవరి 28కి ముందు పదో తరగతి చివరి పరీక్షలు: 2023 మార్చిలో
• చివరి పనిదినం: 2023 ఏప్రిల్ 24.
• వేసవి సెలవులు: ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు
• మళ్లీ పాఠశాలల పునఃప్రారంభం: 2023 జూన్ 12వ తేదీ నుంచి

పండుగ సెలవులు
• దసరా: సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు 14 రోజులు
• క్రిస్మస్ (మిషనరీ పాఠశాలలకు): డిసెంబరు 22 నుంచి 28 వరకు 7 రోజులు
• సంక్రాంతి సెలవులు: 2023 జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు 5 రోజులు

నెలవారీగా పనిదినాలు .
• జూన్-16 రోజులు,
• జులై-24, 
• ఆగస్టు-22,
• సెప్టెంబరు-20, 
• అక్టోబరు-18,
• నవంబరు-24,
• డిసెంబరు 25,
• 2023 జనవరి- 21, 
• ఫిబ్రవరి - 22, 
• మార్చి-23,
• ఏప్రిల్ 15


ప్రతి మూడో శనివారం 'నో బ్యాగ్ డే...
ప్రతి నెలా మూడో శనివారం 'నో బ్యాగ్ డే'గా పాటించాలని నిర్ణయించారు. ఆ రోజు బాలసభ నిర్వహించాలని సూచించారు. దీంతో విద్యార్థికి పుస్తకాల మోత తప్పడంతో పాటు ఆటవిడుపుగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్న విషయాన్ని విద్యాశాఖ ఆమోదించినట్లయింది. దీంతోపాటు ప్రతి శుక్రవారం మాక్ డ్రిల్ నాలుగో శనివారం హరిత హారం కార్యక్రమం నిర్వహించాలి.

TS SSC Results | తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌.. 90 శాతం ఉత్తీర్ణ‌త‌

TS SSC Results | తెలంగాణ పదో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ఉద‌యం 11:30 గంట‌ల‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. మొత్తంగా టెన్త్ ఫ‌లితాల్లో 90 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక ప్ర‌యివేటు విద్యార్థుల విష‌యానికి వ‌స్తే 819 మంది హాజ‌రు కాగా, 425 మంది పాస‌య్యారు. 51.89 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. పరీక్ష ఫలి‌తా‌లను https://bse.telangana.gov.in/అనే వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు.

 ఈ ఏడాది మే 23 నుంచి జూన్‌ 1 వరకు పది పరీ‌క్షలు నిర్వ‌హిం‌చారు. మొత్తం 5,08,143 రెగ్యు‌లర్‌ విద్యా‌ర్థు‌లకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీ‌క్షలు రాశారు. 167 మంది ప్ర‌యివేటు విద్యా‌ర్థు‌లకు 87 మంది పరీ‌క్ష‌లకు హాజ‌ర‌య్యారు. జూన్ 28 ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

Courses After Intermediate: ఇంటర్ తర్వాత చేయదగిన 113 బెస్ట్ కోర్సులు ఇవే


ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఏ కోర్స్ చేయాలి, ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలో తెలియక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. జీవితంలో ఏ రంగంలో రాణించాలి, ఏ జాబ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నామో ఆ దిశగా ప్రయత్నాలు చేసేది ఇంటర్ తర్వాతి నుంచే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి భవిష్యత్ కోసం ఇంటర్మీడియట్‌లోనే కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇంటర్ పూర్తయి ఏ కోర్సు చేయాలో సతమతమవుతున్న విద్యార్థులకు ఏ కోర్సు తీసుకుంటే బెటరో, వాటిపై అవగాహన పొంది తమకు తగిన కోర్సును ఎంచుకుంటే అద్భుత కెరీర్ సొంతమవుతుంది. ఇంటర్ పూర్తయ్యాక తీసుకోవాల్సిన 113 కోర్సులు ఏవో తెలుసుకుందాం.

1. ఏరోనాటికల్ ఇంజినీరింగ్

2. ఏరోస్పేస్ ఇంజనీరింగ్

3. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్

4. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్

5. ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్

6. ఆటోమొబైల్ ఇంజనీరింగ్

7. బయో మెడికల్ ఇంజనీరింగ్

8. బయో టెక్నాలజీ ఇంజనీరింగ్

9. సెరామిక్స్ ఇంజనీరింగ్

10. కెమికల్ ఇంజనీరింగ్

11. సివిల్ ఇంజనీరింగ్

12. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

13. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

14. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

15. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్

16. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్

17. ఇంస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్

18. మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్

19. మెరైన్ ఇంజనీరింగ్

20. మెకానికల్ ఇంజనీరింగ్

21. మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

22. మెటాలర్జీ

23. మెటరాలజీ

24. మైనింగ్ ఇంజనీరింగ్

25. నావల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్

26. ఫిజికల్ సైన్సెస్

27. పాలీమర్ ఇంజనీరింగ్

28. రోబోటిక్స్

29. టెక్స్‌టైల్ ఇంజనీరింగ్

30. అగ్రికల్చర్ సైన్స్

31. బయోలాజికల్ సైన్స్

32. బయోటెక్నాలజీ

33. కంప్యూటర్ అప్లికేషన్స్

34. కంప్యూటర్ సైన్స్

35. సైబర్ సెక్యూరిటీ

36. ఎర్త్ సైన్స్ / జాగ్రఫీ

37. ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్

38. ఫిషరీస్

39. ఫ్లోరికల్చర్/హార్టికల్చర్

40. ఫుడ్ టెక్నాలజీ

41. ఫారెస్ట్రీ

42. ఓషియనోగ్రఫీ

43. స్టాటిస్టికల్ సైన్స్

44. వెటర్నరీ సైన్సెస్

45. వైల్డ్ లైఫ్ బయాలజీ

46. జువాలజీ

47. ఆయుర్వేద బీఏఎంఎస్

48. డెంటల్ బీడీఎస్

49. హోమియోపతి

50. న్యాచురోపతి

51. ఫార్మసీ

52. సిద్ధ

53. యునానీ

54. ఆంత్రోపాలజీ

55. ఆర్కియాలజీ

56. ఆర్ట్ రిస్టోరేషన్

57. క్యూరేషన్

58. ఎడ్యుకేషనల్/వొకేషనల్ స్కూల్ కౌన్సిలర్

59. మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్‌ రిస్టోరేషన్

60. మ్యూసియాలజీ

61. ఫిజియోథెరపీ

62. రిహ్యాబిలిటేషన్ సైకాలజీ

63. రిహ్యాబిలిటేషన్ థెరపీ

64. సోషల్ వర్క్

65. స్పెషల్ ఎడ్యుకేటర్

66. స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్

67. లా

68. అడ్వర్టైజింగ్

69. జర్నలిజం

70. మాస్ కమ్యూనికేషన్

71. పబ్లిక్ రిలేషన్స్

72. ఆర్ట్ డైరెక్షన్

73. కొరియోగ్రఫీ

74. డైరెక్షన్

75. ఫిల్మ్/డ్రామా ప్రొడక్షన్

76. ఫైన్ ఆర్ట్స్

77. పర్ఫామింగ్ ఆర్ట్స్

78. వోకల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్

79. యానిమేషన్

80. సినిమాటోగ్రఫీ

81. కమ్యూనికేషన్ డిజైన్

82. డిజైన్

83. గ్రాఫిక్ డిజైనింగ్

84. ఫోటోగ్రఫీ

85. యాక్చురియల్ సైన్సెస్

86. బ్యాంక్ మేనేజ్‌మెంట్

87. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్

88. బిజినెస్ మేనేజ్‌మెంట్

89. కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంట్స్

90. చార్టర్డ్ అకౌంటెన్సీ

91. చార్టర్డ్ ఫైనాన్షియల్ అనాలిసిస్

92. ఈవెంట్ మేనేజ్‌మెంట్

93. హాస్పిటల్ మేనేజ్‌మెంట్

94. హోటల్ మేనేజ్‌మెంట్

95. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్

96. ఇన్స్యూరెన్స్

97. లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్

98. మేనేజ్‌మెంట్

99. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్

100. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్

101. కార్పొరేట్ ఇంటెలిజెన్స్

102. డిటెక్టీవ్

103. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రీషియన్

104. ఫారిన్ లాంగ్వేజెస్

105. హోమ్ సైన్స్

106. ఇంటీరియర్ డిజైనింగ్

107. లిబరల్ స్టడీస్

108. లైబ్రసీ సైన్సెస్

109. మాంటెస్సరీ టీచింగ్

110. న్యూట్రీషియన్ అండ్ డైటెటిక్స్

111. ఫిజికల్ ఎడ్యుకేషన్

112. స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్

113. టూరిజం అండ్ ట్రావెల్స్

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం రూపొందించిన బుక్‌లెట్‌లో సీబీఎస్ఈ ప్రధానంగా వివరించిన 113 కోర్సులు ఇవి. ఇవే కాకుండా అనేక రంగాల్లో అనేక కోర్సులు ఉన్నాయి. అయితే విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా కోర్సుల్ని ఎంచుకుంటే కెరీర్ బాగుంటుంది.

All Updates

TSLPRB Updates

TET DSC Gurukula Updadtes

Job Notifications

Important Links

Centran Jobs Updates

TSPSC VRO FInal Merit Lists and Cut off Marks

Important Links

TSPSCvro District wise Reservation wise Marks and Merit lists

Top