9200 పంచాయతీ కార్యదర్శుల నియామకాలు 2018
కొత్త పంచాయితీ కార్యదర్శులకు మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉండాలి. పనితీరు ఆధారంగా వారిని క్రమబద్దీకరించాలి. ప్రొబేషన్ సమయంలో నెలకు రూ.15 వేల చొప్పున జీతం ఇవ్వాలి. పంచాయితీ కార్యదర్శుల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే, జిల్లా కేడర్ లో నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. ప్రస్తుతం 3,562 పంచాయితీలకు మాత్రమే కార్యదర్శులున్నారు. ఇన్‌ఛార్జ్ పంచాయితీ కార్యదర్శి విధానానికి స్వస్తి పలకాలి. పంచాయితీ కార్యదర్శుల విధులు, బాధ్యతలపై విధి విధానాలు రూపొందించాలని తెలిపారు.
ప్రొబేషన్ పీరియడ్‌లో నెలకు రూ.15 వేల జీతం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో ఇప్పటికే 3,562 పంచాయతీలకు కార్యదర్శులు ఉన్నారని సీఎం పేర్కొన్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలను కలిపి అన్నింటికీ కార్యదర్శులను నియమించాలని ఆదేశించారు. ఒక్కో కార్యదర్శి రెండు గ్రామ పంచాయతీలకు ఇంచార్జిలుగా ఉండే విధానానికి స్వస్తి పలకాలని సీఎం సూచించారు. పంచాయతీ కార్యదర్శుల నియామకం, బాధ్యతలపై విధి, విధానాలను రూపొందించాల్సిందిగా మంత్రి జూపల్లిని అధికారులను సీఎం ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో ఆమోదించనున్నట్టు సీఎం వెల్లడించారు. కనీసం రెండు జనాభా కలిగిన గ్రామానికి కూడా ప్రత్యేకంగా కార్యదర్శిని నియమించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి