అగ్నిపథ్ పథకం అంటే ఏంటి? జీతం ఎంత? ఎవరు అర్హులు?

సైన్యంలో చేరడానికి కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. దాని పేరు అగ్నిపథ్. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించారు.

అగ్నిపథ్ పథకం అంటే?
ర శాఖ చెప్పిన వివరాల ప్రకారం సైన్యంలో యువతకు అవకాశం ఇచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ఇది. అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీరులు అంటారు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేయొచ్చు. ఆ తర్వాత వారి పనితీరును సమీక్షిస్తారు. మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. అంటే ప్రతి 100 మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్లు 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు.

జీతం ఎంత?
అగ్నిపథ్‌ కింద సైన్యంలో చేరేవారికి మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల జీతం ఇస్తారు. ఇందులో చేతికి 21 వేలు వస్తాయి. మిగిలిన 9 వేల రూపాయలు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమచేస్తారు. రెండో ఏడాది నెలకు 33 వేల రూపాయల జీతం వస్తుంది. అందులో 30 శాతం అంటే 9900 రూపాయలు కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. మూడో ఏడాదిలో ప్రతి నెలా ఇచ్చే 36500లో 10980 కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. నాలుగో ఏడాది నెలకు 40 వేలు జీతం ఇస్తారు. ఇందులో 12000 కార్పస్ ఫండ్‌కి వెళ్తుంది. ఇలా నాలుగేళ్లలో మొత్తం 5లక్షల రెండు వేల రూపాయలు కార్పస్‌ ఫండ్‌లో జమ అవుతాయి. దీనికి మరో 5 లక్షల 2 వేల రూపాయలు అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలుపుకుని నాలుగేళ్ల తర్వాత 11.71 వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్మీ నిబంధనల ప్రకారం ఇతర రాయితీలు, సౌకర్యాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సమగ్ర ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది.

ఎవరు అర్హులు?
పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అగ్నిపథ్‌ పథకం ద్వారా సైన్యంలో చేరవచ్చు. పదో తరగతి లేదా ఇంటర్ పాసైన యువతీ యువకులు అర్హులు. అయితే, ప్రస్తుతం అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. అనంతరం అమ్మాయిలకు కూడా ఈ అవకాశం ఇస్తామని చెబుతున్నారు. అర్హతలను బట్టి ఆర్మీ, వైమానిక దళం, నేవీలో పని చేయవచ్చు.

సైన్యంలో ఉండగా చనిపోతే..
సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా 48 లక్షల జీవిత బీమా ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కోసం అభ్యర్థులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తారు.

వైకల్యం సంభవిస్తే..
సైన్యంలో ఉండగా శారీరక వైకల్యం సంభవిస్తే పరిహారం అందిస్తారు. వైకల్యం 100 శాతం ఉంటే 44 లక్షలు, 75 శాతమైతే 25 లక్షలు, 50 శాతమైతే 15 లక్షల రూపాయల పరిహారం ఇస్తారు.

రక్షణమంత్రి ఏమన్నారు?
ఈ పథకం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటూ దేశ రక్షణ బలోపేతం అవుతుందని రక్షణమంత్రి అన్నారు. సైన్యంలో చేరాలన్న చాలామంది యువకుల కల సాకారమవుతుందని చెప్పారు. భారత సైన్యాన్ని మరింత యూత్‌ఫుల్‌గా, టెక్ సావీగా తీర్చిదిద్దడం కోసం యువత సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సైనికాధికారులు తెలిపారు.

Indian Post office Postman and Mail guard Recruitment 2022


నిరుద్యోగులకు కేంద్ర కొలువులు సాధించే అద్భుత అవకాశం! భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్‌ (India Post) దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 23 సర్కిళ్లకుగానూ ఖాళీల వివరాలను తెలియజేస్తూ షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం పోస్ట్‌ మ్యాన్‌ పోస్టులు 59,099, మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 1445, మల్టీ టాస్కింగ్‌ పోస్టులు 37,539 వరకు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భరీగా ఖాళీలున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీల వివరాలు..

• పోస్ట్‌ మ్యాన్‌ పోస్టులు 2289

• మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 108

• మల్టీ టాస్కింగ్‌ పోస్టులు 1166

తెలంగాణ సర్కిల్‌లో ఖాళీలు..

• పోస్ట్‌ మ్యాన్‌ పోస్టులు 1553

• మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 82

• మల్టీ టాస్కింగ్‌ పోస్టులు 878

పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నైపుణ్యాలు కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 32 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే ఖాళీల వివరాలను తెలుపు పోస్టల్ శాఖ షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానం వంటి ఇతర సమాచారం వివరణాత్మక అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.తెలంగాణలో మొత్తం మండలాల సంఖ్య - 610

🌎 *కాళేశ్వరం జోన్ - 67*
------------------------------------
కుమ్రంభీం ఆసీఫాబాద్ 15
మంచిర్యాల 18
పెద్దపల్లి 14
జయశంకర్ భూపాలపల్లి 11
ములుగు 9

🌎 *బాసర జోన్ - 89*
-------------------------------
ఆదిలాబాద్ 18
నిర్మల్ 19 
నిజామాబాద్ 32
జగిత్యాల 20

🌎 *రాజన్న జోన్ - 99*
--------------------------------
కామారెడ్డి 23
సిరిసిల్ల 13
సిద్దిపేట 26
మెదక్ 21
కరీంనగర్ 16

🌎 *భద్రాద్రి జోన్ - 89*
--------------------------------
హనుమకొండ 14
వరంగల్ 13
మహబూబాబాద్ 18
కొత్తగూడెం భద్రాద్రి 23
ఖమ్మం 21

🌎 *యాదాద్రి జోన్ - 84*
-----------------------------------
యాదాద్రి భువనగిరి 17
జనగామ 12
సూర్యాపేట 23
నల్గొండ 32

🌎 *చార్మినార్ జోన్ -106*
-------------------------------------
హైదరాబాద్ 16
రంగారెడ్డి 27
మేడ్చల్ 15
వికారాబాద్ 20
సంగారెడ్డి 28

🌎 *జోగులాంబ జోన్ - 76*
-------------------------------------
మహబూబ్ నగర్ 17
నాగర్ కర్నూల్ 20
వనపర్తి 14
గద్వాల్ 12
నారాయణపేట్ 13

Selection of Part Time Subject Associates in COEs of TSWREIS, TTWREIS & TSES for the Academic year 2022-2023

 TELANGANA SOCIAL, TRIBAL WELFARE & EKALAVYA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES: HYDERABAD

Web Notification

Rc.No.0245/OSD/OPE/2021,                                                Date: 13.07.2022

 

 

Selection of Part Time Subject Associates in COEs of TSWREIS, TTWREIS & TSES for the Academic year 2022-2023

 

The TSWREI, TTWREI & TS Ekalavya Societies have started certain COEs for providing quality coaching for JEE Mains/Advanced, NEET and EAMCET to the marginalized SC/ST students.

In this regard certain Subject Associates are required in certain COEs of TSWREIS, TTWREIS and TSES. The meritorious candidates in the Screening Test and Interview will be given opportunity to work in COEs with remuneration of Rs.25000/- per month fixed.

The Subject wise tentative requirement of Subject Associates in TSWR, TTWR & EMRS COEs/SOEs is as follows:

 

Maths

Physics

Chemistry

Botany

Zoology

Total Vacancies

26

29

32

30

32

149

ELIGIBILITY FOR SUBJECT ASSOCIATES:

 

1.    Candidates having PG with first class along with B.Ed.

2.    Experience in teaching JEE Mains/Advanced, NEET and EAMCET is essential.

3.    Achievements, if any, related to the number of students secured seats in JEE Mains/Advanced, NEET and EAMCET will be given preference.

4.    One candidate can apply for one subject only.


TERMS & CONDITIONS:

 

1.    The right of allocation of the candidates to the 03 Societies (TSWREIS, TTWREIS & TSES) lies with the Secretary TTWREIS and TSWREIS.

2.    The right of place of posting lies with the Secretary TSWREIS and TTWREIS.

3.   The selected faculty have to perform all the residential pattern duties assigned to them by the Principal.

4.   The selected candidates have no right to claim for regularization.

5.   This is purely temporary post and for every 3 months performance of the Subject Associates will be reviewed by Principals and other Academic Officers.

6.    If the candidate’s performance is either academically or personally not satisfactory, then their services will be terminated at any time.

7.   Women faculty will be given priority to work in girls COEs.

8.   Mere applying for the post shall not entitle the candidates for any claim to the selection in respective post for subject associates.

 

SELECTION CRITERIA:

 

a

Proficiency

In concerned subject

b

Communicative Skills

Exclusively in English

C

Intensive teaching abilities in

JEE/NEET /EAMCET examination pattern.

Any new innovative new methods will be encouraged

 

·         Total marks for selection of Subject Associates - 150 marks Written test -100 marks

Demo - 25 marks Interview - 25 marks.

·         The candidates have to attend the Screening test in their concerned Subject.

·         The candidates who have applied for Subject Associates have to attend written test. After the test there will be a Demo and interview @1:3 ratio.

·         There will be negative ½ mark for every wrong answer in written test. Each question carries 2 marks. There will be 50 questions in every subject.

·         The duration of the exam is 60 minutes.

·         The services of the selected candidate will be utilized from the date of his / her reporting in the institution.


IMPORTANT DATES:

 

1

Notification will be issued on

15.07.2022

2

Online applications starts from

16.07.2022

3

Last date for submission of

 

Online applications

 

23.07.2022

4

Date of written test

31.07.2022 (Sunday)

5

Demo/interview

08.08.2022

6

Posting will be given on or before

10.08.2022

7

Exam Fee (through online)

Rs.500/-

 

 

 

HOW TO APPLY:

 

Interested candidates have to apply through online for TTWREIS & TSWREIS www.tgtwgurukulam.telangana.gov.in and www.tswreis.ac.in

 


Note:


The candidates can download their hall tickets from the website.

 

 

 

 

Sd/- Secretary

TSWREIS, TTWREIS & TSES

Hyderabad

CTET - 2022 Public Notice in Telugu || CTET 2022 Notification in Telugu

No.: CBSE/CTET/Dec-2022                                                                        Dated: 14.07.2022

PUBLIC NOTICE 

The Central Board of Secondary Education will conduct the 16th edition of Central Teacher Eligibility Test (CTET) in CBT (Computer Based Test) mode in December 2022(exact date will be intimated on the admit card of the candidate). The test will be conducted in 20 (Twenty) languages throughout the country. The detailed Information Bulletin containing details of examination, syllabus, languages, eligibility criteria, examination fee, examination cities and important dates will be available on CTET official website https://ctet.nic.in shortly and the aspiring candidates are requested to download the Information Bulletin from the above mentioned website only and read the same carefully before applying. The aspiring candidates have to apply online only through CTET website i.e. https://ctet.nic.in. The dates for online application-process will be intimated during the course of time. 

 The application fee applicable for CTET Dec-2022 is as under: 

  • Only Paper I or II : 
General/OBC Rs. 1000/-

SC/ST/Diff. Abled Person Rs. 500/-

  • Both Paper I & II 
 General/OBC Rs. 1200/-

 SC/ST/Diff. Abled Person Rs. 600/- 


భారత దేశాన్ని ఎవరు? ఎప్పుడు పరిపాలించారు? పూర్తి సమాచారం.

*బానిస రాజవంశం*
1 = 1193 ముహమ్మద్ ఘోరి
2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్
3 = 1210 అరామ్ షా
4 = 1211 ఇల్టుట్మిష్
5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్ షా
6 = 1236 రజియా సుల్తాన్
7 = 1240 ముయిజుద్దీన్ బహ్రమ్ షా
8 = 1242 అల్లావుద్దీన్ మసూద్ షా
9 = 1246 నాసిరుద్దీన్ మెహమూద్
10 = 1266 గియాసుడిన్ బల్బన్
11 = 1286 కై ఖుష్రో
12 = 1287 ముయిజుద్దీన్ కైకుబాద్
13 = 1290 షాముద్దీన్ కామర్స్
1290 బానిస రాజవంశం ముగుస్తుంది
(ప్రభుత్వ కాలం - సుమారు 97 సం.)

*ఖిల్జీ రాజవంశం*
1 = 1290 జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ
2 = 1296 అల్లాదీన్ ఖిల్జీ
4 = 1316 సహబుద్దీన్ ఒమర్ షా
5 = 1316 కుతుబుద్దీన్ ముబారక్ షా
6 = 1320 నాసిరుదిన్ ఖుస్రో షా
7 = 1320 ఖిల్జీ రాజవంశం ముగిసింది
(ప్రభుత్వ కాలం - సుమారు 30 సం.)

*తుగ్లక్ రాజవంశం*
1 = 1320 గయాసుద్దీన్ తుగ్లక్ I.
2 = 1325 ముహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ
3 = 1351 ఫిరోజ్ షా తుగ్లక్
4 = 1388 గయాసుద్దీన్ తుగ్లక్ రెండవ
5 = 1389 అబూబకర్ షా
6 = 1389 ముహమ్మద్ తుగ్లక్ మూడవ
7 = 1394 సికందర్ షా మొదటి
8 = 1394 నాసిరుదిన్ షా దుస్రా
9 = 1395 నస్రత్ షా
10 = 1399 నాసిరుద్దీన్ మహమ్మద్ షా వెంటాడే రెండవ స్థానంలో ఉన్నారు
11 = 1413 డోలత్ షా
1414 తుగ్లక్ రాజవంశం ముగుస్తుంది
(ప్రభుత్వ కాలం - సుమారు 94 సం.)

*సయ్యిద్ రాజవంశం*
1 = 1414 ఖిజ్ర్ ఖాన్
2 = 1421 ముయిజుద్దీన్ ముబారక్ షా రెండవ
3 = 1434 ముహమ్మద్ షా నాల్గవ
4 = 1445 అల్లావుద్దీన్ ఆలం షా
1451 సయీద్ రాజవంశం ముగుస్తుంది
(ప్రభుత్వ కాలం - సుమారు 37 సం.)

*అలోడి రాజవంశం*
1 = 1451 బహ్లోల్ లోడి
2 = 1489 అలెగ్జాండర్ లోడి రెండవది
3 = 1517 ఇబ్రహీం లోడి
1526 లోడి రాజవంశం ముగుస్తుంది
(ప్రభుత్వ కాలం - సుమారు 75 సం.)

*మొఘల్ రాజవంశం*
1 = 1526 జహ్రుదిన్ బాబర్
2 = 1530 హుమయూన్
1539 మొఘల్ రాజవంశం సమయం ముగిసింది

*సూరి రాజవంశం*
1 = 1539 షేర్ షా సూరి
2 = 1545 ఇస్లాం షా సూరి
3 = 1552 మహమూద్ షా సూరి
4 = 1553 ఇబ్రహీం సూరి
5 = 1554 ఫిరుజ్ షా సూరి
6 = 1554 ముబారక్ ఖాన్ సూరి
7 = 1555 అలెగ్జాండర్ సూరి
సూరి రాజవంశం ముగుస్తుంది, (పాలన -16 సంవత్సరాలు సుమారు)

*మొఘల్ రాజవంశం పున ప్రారంభించబడింది*
1 = 1555 హుమాయున్ మళ్ళీ సింహాసనం పైన
2 = 1556 జలాలుద్దీన్ అక్బర్
3 = 1605 జహంగీర్ సలీం
4 = 1628 షాజహాన్
5 = 1659 u రంగజేబు
6 = 1707 షా ఆలం మొదట
7 = 1712 జహదర్ షా
8 = 1713 ఫరూఖ్సియార్
9 = 1719 రైఫుడు రజత్
10 = 1719 రైఫుడ్ దౌలా
11 = 1719 నెకుషియార్
12 = 1719 మహమూద్ షా
13 = 1748 అహ్మద్ షా
14 = 1754 అలమ్‌గీర్
15 = 1759 షా ఆలం
16 = 1806 అక్బర్ షా
17 = 1837 బహదూర్ షా జాఫర్
1857 మొఘల్ రాజవంశం ముగుస్తుంది
(ప్రభుత్వ కాలం - సుమారు 315 సంవత్సరాలు.)

*బ్రిటిష్ రాజ్ (వైస్రాయ్)*
1 = 1858 లార్డ్ క్యానింగ్
2 = 1862 లార్డ్ జేమ్స్ బ్రూస్ ఎల్గిన్
3 = 1864 లార్డ్ జాహోన్ లోరెన్ష్
4 = 1869 లార్డ్ రిచర్డ్ మాయో
5 = 1872 లార్డ్ నార్త్‌బుక్
6 = 1876 లార్డ్ ఎడ్వర్డ్ లాటెన్లార్డ్
7 = 1880 లార్డ్ జార్జ్ రిపోన్
8 = 1884 లార్డ్ డఫెరిన్
9 = 1888 లార్డ్ హన్నీ లాన్స్‌డన్
10 = 1894 లార్డ్ విక్టర్ బ్రూస్ ఎల్గిన్
11 = 1899 లార్డ్ జార్జ్ కర్జన్
12 = 1905 లార్డ్ టివి గిల్బర్ట్ మింటో
13 = 1910 లార్డ్ చార్లెస్ హార్డింగ్
14 = 1916 లార్డ్ ఫ్రెడరిక్ సెల్మ్స్ఫోర్డ్
15 = 1921 లార్డ్ రూక్స్ ఐజాక్ రైడింగ్
16 = 1926 లార్డ్ ఎడ్వర్డ్ ఇర్విన్
17 = 1931 లార్డ్ ఫ్రీమాన్ వెల్లింగ్డన్
18 = 1936 లార్డ్ అలెగ్జాండర్ లిన్లిత్గో
19 = 1943 లార్డ్ ఆర్కిబాల్డ్ వేవెల్
20 = 1947 లార్డ్ మౌంట్ బాటన్

*బ్రిటిషర్స్ పాలన సుమారు 90 సంవత్సరాలు ముగిసింది.*

*ఆజాద్ ఇండియా, ప్రధాని*
1 = 1947 జవహర్‌లాల్ నెహ్రూ
2 = 1964 గుల్జారిలాల్ నందా
3 = 1964 లాల్ బహదూర్ శాస్త్రి
4 = 1966 గుల్జారిలాల్ నందా
5 = 1966 ఇందిరా గాంధీ
6 = 1977 మొరార్జీ దేశాయ్
7 = 1979 చరణ్ సింగ్
8 = 1980 ఇందిరా గాంధీ
9 = 1984 రాజీవ్ గాంధీ
10 = 1989 విశ్వనాథ్ ప్రతాప్సింగ్
11 = 1990 చంద్రశేఖర్
12 = 1991 పివి నరసింహారావు
13 = అటల్ బిహారీ వాజ్‌పేయి
14 = 1996 H.D. దేవేగౌడ
15 = 1997 ఐకె గుజ్రాల్
16 = 1998 అటల్ బిహారీ వాజ్‌పేయి
17 = 2004 డాక్టర్ మన్మోహన్ సింగ్
*18 = 2014 నుండి నరేంద్ర మోడీ*

*764 సంవత్సరాల తరువాత, పరదేశీ మరియు బ్రిటిష్ వారి బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందబడింది.*

*ఈ ముఖ్యమైన సమాచారాన్ని యువకులందరి దృష్టిలో వీలైనన్ని సమూహాలలో పంపండి...*

*మనం 1000 సంవత్సరాలు కొన్ని కోట్ల మంది పోరాటం ఫలితంగా ఈ దేశం ఇంకా  దేశంగా మనుగడలో ఉన్నది.*


*మన భారతీయ సంస్కృతి ని, ధర్మాన్ని అనుసరించి, కాపాడుకోవాలి. స్థిరంగా, దృఢంగా అభివృద్ధి సాధించాలి.*


చదువుకోండి చరిత్ర కోసం తెలుసుకోండి మరో పదిమందికి షేర్ చెయ్యండి.

ఒక ప్రభుత్వ టీచర్ చేసిన విశ్లేషణ .. తప్పకుండా ఆలోచించాల్సిన అంశాలు ......

ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రైవేటు విద్యా వ్యవస్థ మధ్య పోటీలో..* ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎలా *బలిపశువులు* చేసి చూపుతున్నారో, వాళ్ళు అలా ఎందుకు బలికావాల్సి వస్తుందో వివరించే *ప్రయత్నం నాది...*

       కొంత హిస్టరీలో కి వెళ్దాం... 

       30 సంవత్సరాలకు పూర్వం *అందరూ* ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించేవారు. 

       *డాక్టర్ కొడుకైనా, లాయర్ కొడుకైనా, ఇంజనీర్ కొడుకైన, టీచర్ కొడుకైనా, రాజకీయ నాయకుడి కొడుకైనా, రైతు కొడుకైనా, కూలి కొడుకైన ఎవరైనా ఒకే పాఠశాలలోనే చదవాల్సిందే..* 

       *అప్పుడు పాఠశాలలన్నీ తెలుగు మీడియంలోనే ఉండేవి..* 

       దాదాపు ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడేవి. 

       అప్పుడు కూడా *విద్యార్థులకు సరిపడే టీచర్లు కూడా ఉండేవారు కాదు.* 

       ఏ కొంత మంది విద్యార్థులకో *ప్రత్యేక తర్ఫీదు* లు ఉండేవి కాదు.  

       కానీ విద్యార్థులు వారి యొక్క సామర్ధ్యాన్ని బట్టి ముందు తరగతులకు వెళ్తూ ఉండేవారు. 

       తెలివైన విద్యార్థులు 5 నుండి 10 శాతం మంది ఉన్నత తరగతులు చదువుతూ కాలేజీల్లోనూ.. యూనివర్సిటీల్లోని సీట్లు సంపాదిస్తూ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు. 

       మిగతా 90 శాతం మంది విద్యార్థుల్లో ప్రాథమిక విద్యలో విద్యను ఆపేసిన వారు కొందరు, హైస్కూల్ స్థాయిలో విద్యను ఆపేసిన వారు కొందరు, కాలేజీ స్థాయిలో కొందరు, రకరకాల వృత్తులో స్థిరపడిన వారు కొందరు ఉండేవారు. 

       *అలా ఉన్న 90 శాతం మందిలో ఏ ఒక్కరు కూడా ఆ పాఠశాల వలనే మాకు చదువు రాలేదు అని ఎవరూ అనలేదు.* 

       *మేము చదువు మీద సరైన శ్రద్ధ చూపలేదు అని మాత్రమే అనేవారు.* 

       *వారికి చదువు చెప్తున్న ఏ ఉపాధ్యాయుని కూడా నిందించే వారు కూడా కాదు.* 

       తర్వాత *వాస్తవం లోకి వెళ్దాం ...*

       కాలంతో పాటు జనాభా కూడా పెరుగుతోంది. *గ్రామాల్లోని విద్యార్థులకు కూడా చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది*. 

       కానీ ప్రాథమిక విద్య తర్వాత హైస్కూల్ లో జాయిన్ చేయడానికి అందుబాటులో లేక చదువు మానేసిన వాళ్లు కొందరు. 

       దీనికి *కారణం ఉపాధ్యాయులా? ప్రభుత్వమా?* 

       ఏదోలా దూరాన ఉన్న హై స్కూల్లో చేరి హైస్కూలు చదువు పూర్తి చేసిన తర్వాత జూనియర్ కాలేజీలో చేరుదామనుకుంటే *రెండు, మూడు మండలాలకు కలిపి ఒక జూనియర్ కళాశాల దానిలో 100 నుంచి 200 సీట్లు ఉండేవి*. 

       *మరి మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి ? ప్రభుత్వాలు వాళ్లకి ఎందుకు చదువుకునే అవకాశాలు కల్పించలేకపోయింది?*

       అప్పుడే విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కళాశాలలు పుట్టుకొచ్చాయి. 

       ప్రభుత్వం కూడా *తన భారం తగ్గుతుంది కదా* అని పర్మిషన్ లు కూడా ఇచ్చేసేది. 

       కానీ *ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వాడు మాత్రమే ప్రైవేటు కళాశాలలో జాయిన్ అయ్యే వారు*. 

       కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వారి సంఖ్య పెరుగుతూ పోయింది. 

       కానీ *ప్రభుత్వ కళాశాలలు పెరగలేదు. వాటిల్లో సీట్ల సంఖ్య పెరగలేదు.* 

       ప్రైవేటు కళాశాలల సంఖ్య మాత్రం వారికి అనుగుణంగా పెరుగుతూ పోయింది. 

       *రేకుల షెడ్ ల లో నడుస్తున్న అపార్ట్ మెంట్ ల లో నడుస్తున్నా.. విద్యా ప్రమాణాలు పాటించకున్నా..* ప్రభుత్వం *తన మీద భారం లేదు కదా* అనుకుంటూ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోయింది.

       మరి ప్రాథమిక విద్య లో విద్యార్థులను ఆకర్షించడం ఎలా..? 

       వాళ్ల దగ్గర లేనిది మన దగ్గర ఏముంది?

       దానికి *సమాధానమే ఇంగ్లీష్ మీడియం...*

       ఇబ్బడి ముబ్బడిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభమయ్యాయి...  

కాస్త ధనవంతులు ఉన్నత తరగతి వ్యక్తులందరూ అటు వైపు ఆకర్షింపబడ్డారు. 

       ప్రభుత్వం *ప్రాథమిక విద్యని మాతృభాషలోనే బోధించాలని రూల్* ఏమి పెట్టలేదు. 

       అడిగిన వాళ్లందరికీ ఇంగ్లీష్ మీడియం *పర్మిషన్* ఇచ్చేసింది.

       కానీ *ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లోనే ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు.* 

       ప్రభుత్వం మీద భారం లేకుండా ఎవరికి వారే కదా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ గా చదివేస్తున్నారు.  

       *ప్రభుత్వానికి చాలా సంతోషించదగ్గ విషయమే కదా..! ప్రభుత్వ ఖర్చు లేకుండా ప్రజలు విద్యావంతులై పోతుంటే..!!*

       అలా ఉన్నత, మధ్య తరగతి విద్యార్థులు *ప్రైవేట్ స్కూల్* వైపు వెళ్ళిపో సాగారు. అది సమాజం లో *స్టేటస్ సింబల్* గా మారిపోయింది.  

       *‌ప్రభుత్వ పాఠశాలలు క్రమేపీ పేదల పాఠశాల లు గా మారిపోయింది. 

       కష్టం చేసుకునే ప్రజల పిల్లలు..  
ఇంటి దగ్గర కష్టపడుతూ స్కూల్ కి వచ్చి చదువుకునే పిల్లలు.. 

    ఏ మాత్రము చదువుకు సహకరించని తల్లిదండ్రులున్న పిల్లలు... ప్రభుత్వ పాఠశాలలకు దిక్కయ్యారు

       వాళ్లలో కూడా *తెలివైనవారిని* రెసిడెన్షియల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు లాంటివి పరీక్షలు పెట్టి తీసుకెళ్లిపోయారు.

       ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మీద భారం వేసి నీవల్లే ప్రభుత్వ పాఠశాల నాశనమయ్యిందంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మీద *దురభిప్రాయం* రుద్దింది.  

       *ఆకులు చిదిమేసి, కొమ్మలు నరికేసి, చెట్టు మొదలు కి నీరు పోసినట్టు..* 

       ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అని.. *తూతూమంత్రంగా* ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాయి. 

   పెట్టినా.. అందుకు *తగ్గట్టు వనరులు* సమకూర్చ లేకపోయింది. 
‌ 
   ప్రైవేటు పాఠశాల పక్కన, ప్రభుత్వ పాఠశాల చిన్న పోయేలా ప్రభుత్వం తయారుచేసింది.  

  1.* సరిపడినంత మంది ఉపాధ్యాయులు ఇవ్వలేకపోవడం

*2.* విద్యార్థులకు తరగతి గదులు సరిపడా ఫర్నిచర్ లేకపోవడం.

  3.* ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు సరైన సమయంలో చేసి, సరైన పద్ధతిలో పాఠశాలలను నడిపించలేక పోవటం

  4.* ప్రైవేటు విద్యార్థులు సొంతంగా సిలబస్ లు.రూపొందించుకున్న వారిని అదుపు చేయలేక పోవడం.

 5.* కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, క్లాస్ రూమ్ సిలబస్ కి సంబంధం లేకపోవడం.. 
       ఉదాహరణకు *5వ తరగతి పూర్తి చేసి నవోదయ రాస్తున్న విద్యార్థికి ఐదవ తరగతి సిలబస్ లో ఉన్న ప్రశ్నలు కాకుండా ఇతరత్రా జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ ఉండటం వల్ల వాటిని పాఠశాలలో బోధించే ఏవిధంగా సిలబస్ లేకపోవడం.* 
       ఇంటర్మీడియట్ రెండు సంవత్సరములు *MPC గ్రూప్ గవర్నమెంట్ కాలేజీలో చదివి లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్క లైను కూడా మిస్ అవ్వకుండా మొత్తం అవపోసణ చేసిన వాడికి ఐఐటీలో సీటు వస్తుందా?* ‌రాదు...  

       ఎందుకంటే *ఆ సిలబస్లో లేని అంశాలు, అంతకు మించిన అంశాలను ఆ ఎక్జామ్ లో ప్రశ్నించడం వలన...* 

       అంటే *ప్రభుత్వం ఆ అంశాలను ఎందుకు సిలబస్ లో పొందుపరచ లేకపోయింది. లేదా ఇంటర్మీడియట్ సిలబస్ కు మించకుండా ఐఐటీ ఎగ్జామ్ ని ఎందుకు నిర్వహించలేక పోతుంది?* 
       అంటే *గవర్నమెంట్ పాఠశాల పుస్తకాలు, గవర్నమెంట్ కాలేజీ చదువులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సరిపోవు..* అనే భావాన్ని ప్రజల్లో బాగా నాటింది... 

       ఈ విధంగా ప్రభుత్వం తన విధానాలతో ప్రభుత్వ స్కూళ్ల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. ఆ తప్పిదాన్ని ఉపాధ్యాయులు మీదికి నెట్టేస్తూ *ప్రజల్లో ఆ భావాన్ని గట్టిగా నాటింది.*

       *నిజంగా ఇప్పుడు ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న రాష్ట్రంలో విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయితే వారి సంఖ్యకు తగ్గట్టు స్కూళ్లను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించగలదా...?* 

       *ఆ సామర్ధ్యం ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు బలోపేతం కావు ..?!*

       ఇక్కడ నేను చెప్ప వచ్చే *ముఖ్యమైన విషయం ఏంటంటే* ... 

       ఫలితాలు చూపిస్తూ మేము మీ కంటే మెరుగ్గా ఉన్నాం అని *విర్రవీగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు*, వాటిని సమర్థించే *గొర్రె మంద లాంటి జనాలు* ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. 

       *నీళ్లు ఉన్నచోట ఎవరైనా పంట పండిస్తారు..*

       *ఎడారిలో పండించండి ...*

       మీ ప్రవేట్ స్కూల్ కి వచ్చిన ప్రతి పిల్లాడు ప్రతి రోజు స్కూల్ కి వస్తాడు. 

       వారిని స్కూల్ దాకా దింపే తల్లిదండ్రులు ఉంటారు.

       నువ్వు అడిగిన ప్రతి పుస్తకం కొంటాడు. 

       నువ్వు ఎన్ని గంటలు రుద్దుతున్నా వింటాడు. 

       వాళ్ల తల్లిదండ్రులు విద్యావంతులై ఉంటారు. 

       ఇంటి దగ్గర మాత్రం వారి కోసం సమయం కేటాయించగల గలవారై ఉంటారు. 

       ఆ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు. 

       *మరి నా ప్రభుత్వ స్కూల్ కి వచ్చిన పిల్లాడు ..*

       నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, రోజువారి కూలీల పిల్లలు... 

       అడిగిన పుస్తకం కూడా లేని పరిస్థితి.. 

       ఇంటి పని అంతా చేసుకొని సమయానికి స్కూలు రాని పరిస్థితి... 

       పేదరికంలో ఉన్న వాళ్లు ఆరోగ్యం చెడిపోతే మధ్యలోనే నెలలపాటు పాఠశాల మాని వేసే పరిస్థితి.. 

       ఉదయాన్నే పనికిపోయే తల్లిదండ్రులు వాడు పాఠశాలకు వెళ్తున్నాడు లేదో కూడా పట్టించుకోని పరిస్థితి..  

       పౌష్టికాహారం లేక బక్కచిక్కిన పిల్లలు.. 

       ★ నువ్వు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను చేర్చుకోవు.

       *మేము చేర్చుకుంటాం...*

       ★ మీరు పుస్తకం లేకపోతే బడీకి రానివ్వరు..

       *మేము రానిస్తాం...*

       ★ మీరు పాఠశాలకు ఆలస్యమైతే ఒప్పుకోరు..

       *మాకు వాడు పాఠశాలకు ఎప్పుడు వచ్చినా అదే పదివేలు..*

       ★ మీరు మీ విద్యార్థులకు హోం వర్క్ చేయకపోతే వాళ్ల తల్లిదండ్రులను కూడా మందలిస్తారు.

       *మా పిల్లల తల్లిదండ్రులు 90 శాతం నిరక్షరాస్యులు..*

       ★ మీ పాఠశాలను శుభ్రం చేసే మనుషులు ఉంటారు.

       *మాకు మా విద్యార్థులు మరియు మేమే ఆ పని చేస్తాం.*

       ★ మీరు చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల నుండి తీసివేసి పంపించేస్తారు.

       ఎందుకంటే వాడు ఉంటే మీ పాఠశాల *పరువు తక్కువ* కాబట్టి.

       *మేము వెనుకబడిన విద్యార్థులకు పిలిచి మరీ పాఠశాలలో చేర్చుకుంటాం.*

       ★ మీ పాఠశాలలో క్రీడలు లాంటివి లేవు. అంతెందుకు గ్రౌండ్ లే లేవు.

       *మా పాఠశాలలో తప్పనిసరిగా క్రీడలు ఆడించవలసిందే...*

       ★ మీ పాఠశాలలో తెలివైన విద్యార్థులను మీరే దాచుకుంటారు. ఫీజు రాయితీలు అంటూ బయటికి పోనివ్వరు.

       *ఎందుకంటే వాడి పేరు చెప్పి ఇంకో వందమందిని ఆకర్షించాలిగా..*

       *మా పాఠశాలలో తెలివైనవారిని నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పంపించేస్తుంటాం...*

       ★ మీరు కొన్ని వందల పాఠశాలల బ్రాంచ్ లు కలిపి అది మీ యొక్క పాఠశాల రిజల్ట్ గా చెప్పుకుంటారు...

       *మాకు మా పాఠశాలలో వస్తేనే మా గొప్ప...*

       ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి... 

       *అవన్నీ మీకు కూడా తెలుసు...* 

       వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిదే లోపం అని మాట్లాడుతున్న *గా.. అందరూ ఈ అన్ని విషయాలు గమనించండి.*

       అయినా *మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ తోపులు* కాలేదు.. 

       లక్షల మంది దగ్గర్నుంచి ఐఐటీ సీట్లంటూ *లక్షలు.. గుంజేస్తుంటే ఏ వందమందికో సీట్లు* వస్తున్నాయి... 

       *మరి మిగతా వాళ్ల సంగతేంటి..?*

       మా ప్రభుత్వ పాఠశాలలో పదికి పది పాయింట్లు వచ్చిన వారిని నీలాగ రాష్ట్రం అంతా కలిపి లెక్కేస్తే, టీవీల్లో ప్రకటనలు ఇస్తే *నువ్వు ఒక పక్కకు కూడా రావు..* అది *నీ లాంటి సౌకర్యాలు లేకుండా..* 

       ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి *కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు* ఉంది.

       ప్రైవేట్ పాఠశాలలు *గోదారి బ్రిడ్జి మీద కారులో పోతున్నట్టు* ఉంది.. 

       అన్ని తెలుసుకోకుండా ఎవడికి వాడు ఈ రంగంలో లేకుండా *ఒడ్డున కూర్చుని మామీద రాళ్లువేయడం* సరికాదు.

       దయచేసి *ప్రభుత్వ పెద్దలు* ఈ లోపాలను సరి చేయండి.

       *నిజమే.. అనిపిస్తే* ఈ నిజాలను ఎంత ఎక్కువ మందికి చేరవేస్తే(share) అంత మంచి చేసినవారు అవుతారు.

       ఆలస్యమెందుకు... చదివిన వెంటనే ఆ పని మొదలు పెట్టండి.

తెలంగాణ ప్రభుత్వానికి టెట్ అభ్యర్థి లేఖ

గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. కె.చంద్రశేఖర్ గార్కి, విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ.సబితా ఇంద్రారెడ్డి గారికి టెట్ అభ్యర్థి రాస్తున్న లేఖ

విషయం : టెట్ పేపర్ -2లో సైన్స్ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయం గురించి వివరణ కోరుతూ...విన్నపం 

అయ్యా....

నా పేరు పి. గోపాల్ రావు. ఎంఏ.బీఎడ్ పూర్తి చేశాను. ప్రస్తుతం ఓ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాను. 
 
తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యావిధానంలో మార్పు వస్తుందని, నిరుద్యోగులకు త్వరగా ఉద్యోగాలు వస్తాయని భావించిన వారిలో నేనొకడిని. అయితే ఉపాధ్యాయ ఎంపిక కోసం ప్రభుత్వం ముందస్తుగా  నిర్వహిస్తున్న టెట్(టీచర్స్ ఎలిజబులిటీ టెస్ట్) పరీక్షపై నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. చాలా సందేహాలున్నాయి. దయచేసి వాటిని మీ దృష్టికి తీసుకువస్తే నా సందేహాలను నివృత్తి చేస్తారని, వీలైతే న్యాయం చేస్తారని భావించి ఈ లేఖ రాస్తున్నాను.  

• అసలు టెట్ పరీక్ష ఎందుకు ?

• ఏ ఉద్దేశంతో ప్రభుత్వం టెట్ నిర్వహిస్తున్నారు?

• ఉపాధ్యాయ శిక్షణ కోసం డీఈడీ, బీఈడీ లాంటి కోర్సులకు ఎంట్రెన్స్ లు రాసి సెలెక్ట్ అయి కోర్సు పూర్తి చేయడానికి మళ్లీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారిని ప్రత్యేకంగా పరీక్షించేదేముంది?

•   ట్రైనింగ్ చేసిన అభ్యర్థి ఆల్రెడీ ఎన్నో పరీక్షలు రాసి ఉత్తీర్ణుడైతే గానీ ఆ స్థాయికి రాడు.. అలాంటి అభ్యర్థులను మళ్లీ టెట్ లో మీరు కొత్తగా పరీక్షించాల్సిందేముంది?

• టెట్-2 (సైన్స్ అండ్ మ్యాథ్స్) పేపర్ వల్ల సైన్స్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్న విషయం మీకు తెలుసా ? ఎప్పుడైనా ఈ విషయం మీరు గమనించారా ?

• 150 మార్కులుండే టెట్ పేపర్ -2 లో తెలుగుకు 30 మార్కులు, ఇంగ్లీష్ కు 30 మార్కులు, ఛైల్డ్ సైకాలజీ(పెడగాజీ)కి 30 మార్కులు కేటాయించారు.బాగానే ఉంది. కాన సైన్స్ అభ్యర్థికి తను చదువుకున్న సైన్స్ లో 15 మార్కులు ఇచ్చి, అసలు సైన్స్ అభ్యర్థికి ఎందుకూ ఉపయోగపడని మ్యాథ్స్ కు 30 మార్కులు, ఫిజికల్ సైన్స్ కు 15 మార్కులు కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ ? దీని వల్ల కేవలం మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అభ్యర్థులు మాత్రమే ఎక్కువ శాతం ఉత్తీర్ణులు కాగలుగుతున్నారు. బయోలాజికల్ సైన్స్ అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గుతుందో మీరు ఆలోచించి ఉంటే ఈ విషయం మీదాకా వచ్చేది!

• సైన్స్ టీచరయ్యే అభ్యర్థికి మీరిచ్చేవి  15  మార్కులా? అంటే అతడి సబ్జెక్ట్ పై అవగాహన ఉండాల్సిన అవసరం లేదనా మీ ఉద్ధేశం ?

• స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ టీచరయ్యే అవకాశం మాకున్నప్పుడు, బోధించేది సైన్స్ అయినప్పుడు మాకు మ్యాథ్స్ , ఫిజిక్స్ నేర్చుకోని ఏం చేయాలి ? భవిష్యత్తులో సైన్స్ అభ్యర్థిని వేరే రకంగా ఉపయోగించుకునే ఆలోచన ఉందా?

• టెట్-2 లో సైన్స్ పరీక్ష రాసి క్వాలిఫై అయి డీఎస్సీలో మంచి మార్కులతో భవిష్యత్తులో ఉద్యోగం సాధించే సైన్స్ అభ్యర్థికి మ్యాథ్స్ తో పనేముంది మాకు క్లారిటీ ఇవ్వండి? 

• సైన్స్ అభ్యర్థికి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చదవడం వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో చెప్పండి?

• సైన్స్ అభ్యర్థిలో మ్యాథ్స్ నైపుణ్యాలు ఉన్నాయా అని పరీక్షించడం ఎంత వరకు న్యాయం ?

• టెట్-2 పేపర్లో మీరు సైన్స్(జీవశాస్త్రం) అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొనే మీరు మార్గదర్శకాలు తయారు చేశారా?

• మ్యాథ్స్ అంటే భయముండే ఇంటర్ లో బైపీసీ గ్రూప్ ఎంచుకున్నాం. డిగ్రీలో బీజెడ్సీ సైన్స్ చదివాం..బీఈడీలో సైన్స్ తీసుకున్నాం..పదవ తరగతి తర్వాత మాకు మ్యాథ్స్ పై అసలు పట్టే లేదు..అలాంటప్పుడు టెట్ లో సైన్స్ అభ్యర్థికి మ్యాథ్స్ ఎందుకు పెట్టినట్లు ?

• సోషల్ అభ్యర్థులకు టెట్ -2లో సోషల్ మెథడ్ కు 60 మార్కులు ఇచ్చారు. మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ వారికి 45 మార్కులు ఇచ్చారు.మరి సైన్స్ అభ్యర్థులు మీ ప్రభుత్వానికి ఏం ద్రోహం చేశారని కేవలం 15 మార్కులే కేటాయించారు..దీనిపై వివరణ ఇవ్వండి?

• పైగా ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 60 శాతం మార్కులు వస్తేనే క్వాలిఫై అంటున్నారు. మీరు తయారు చేసిన పేపర్లలో, మీరు పొందుపరిచిన సబ్జెక్ట్ లతో సైన్స్ చదివిన ఒక ఓసీ అభ్యర్థి ఓపెన్ కేటగిరిలో క్వాలిఫై ఎలా అవుతాడు ? 150 మార్కులకు 90 మార్కులు ఎలా వస్తాయి? 

• టెట్ పరీక్షే శుద్ధ దండగ అనుకుంటే అందులో ఇలాంటి మార్గదర్శకాలేంటి ?

• టెట్ విధానాన్ని రూపొందించింది ఎవరో తెలియదు కానీ వారికి సబ్జెక్ట్స్ పై అవగాహన లేదని అర్థమవుతోంది. దయచేసి తెలంగాణ ప్రభుత్వంలోనైనా అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.

• ఇప్పటికే సైన్స్ అభ్యర్థులకు న్యాయం చేయండి మహాప్రభో అని నల్గొండ జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.. కనీస అవగాహనతో ఆలోచిస్తే టెట్ లో సైన్స్ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయలను పరిశీలించి వారికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. 

• వీలైతే పక్క రాష్ట్రంలో పెడుతున్న మాదిరిగా టెట్, డీఎస్సీ కలిపి పెట్టండి. దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి!

• ఒక టీచర్ గా సెలెక్ట్ అవ్వడానికి ఇంత వ్యయప్రయాసలకోర్చి మేము చదువుకొంటుంటే మీరు చేస్తున్నదేమిటి ? మీ మార్గదర్శకాలను సవరించుకొనే హక్కు, అధికారాలు మీకు లేవా? అన్యాయం జరుగుతుందని తెలిసే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసం ?

• మీరు వేసే నోటిఫికేషన్ లో వేకెన్సీ ఉన్న పోస్టులనే నింపుతారు కదా. అలాంటప్పుడు టెట్ పరీక్ష పెట్టడం వల్ల మీకు శ్రమ, మాకు ఖర్చు దండగేననిపిస్తుంది. డైరెక్ట్ గా ఇంతకుముందున్నట్లు డీఎస్సీని నిర్వహిస్తే సరిపోతుంది కదా.

• చివరగా మీపై అభిమానంతో, గౌరవంతో అడుగుతున్నాం.టెట్ పరీక్షలో పేపర్ -2లో సైన్స్ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయాలపై కమిటీ వేసి న్యాయం జరిగేలా చూడండి. ఓసీలకు అర్హత మార్కుల శాతం తగ్గించండి. దీని కోసం కూడా ఉద్యమాలు చేయడం మా వల్ల కాదు...ఇప్పటికే చాలా జీవితాన్ని, విలువైన సమయాన్ని కోల్పోయాం..జీవితంలో స్థిరపడే దశలో ఉన్న మాకు ఈ అయోమయస్థితిని కట్టబెట్టిన మీరే న్యాయం చేయాలి.

ఇట్లు
టెట్ అభ్యర్థి
పి.గోపాల్ రావు
9494 273 373

తొలి ఏకా దశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ? సంపూర్ణ వివరణ!

హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

తొలి ఏకాదశి అంటే ఏమిటి

ఆషాడ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి.

తొలి ఏకాదశి – విశిష్టత

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి”  అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి.

తొలి ఏకాదశి జరుపుకొను విధానం , నియమాలు

మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు.

ఉపవాస ఫలితాలు:

ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 

అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు. 

ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. 

అన్నదానం చేయడం చాలా మంచిది. 

ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు.

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి , శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు , కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు , మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ , ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ , మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.

ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు *‘చాతుర్మాస్య వ్రతం’* అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది , ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి , మర్నాడు పారణ చేసి , ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని , పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని , ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి , ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. 

తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే..

ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు.

ప్రాశస్త్యం

 ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి , రాత్రికి జాగారం చేసి , మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు.

 దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.

All Updates

TSLPRB Updates

TET DSC Gurukula Updadtes

Job Notifications

Important Links

Centran Jobs Updates

TSPSC VRO FInal Merit Lists and Cut off Marks

Important Links

TSPSCvro District wise Reservation wise Marks and Merit lists

Top